దేవుని స్వరూపం

-మడపతీ.V. V, జహీరాబాద్.

నిప్పు తాకిన కరిగిపోవు లక్కదేవుడు,
మంటతాకిన మాడిపోవు చెట్టుదేవుడు,
అవసరమొచ్చిన అమ్మెడి లోహదేవుళ్ళు,
భయము గొలుపుతు జూచెడి భూమిలో దిగబడే దేవుడు, దేవుళ్ళెటులగుదురయ్యా
సహజ భావ నిజైక్యుడు కూడల సంగమ దేవుడు. - విశ్వగురు బసవేశ్వర

విశ్వగురు బసవేశ్వరుడు పై వచనములో చాలా చక్కగ దేవుని నిజ స్వరూపాన్ని చెప్పడం జరిగింది.

మైనంతో, కట్టెతో , అట్టపుట్టలతోమరియూ లక్కతో చేసిన దేవుళ్ళు నిప్పుతాకినంతటనే కాలి బూడిదైపోవును. ఇలాంటివి దేవుళ్ళని అనగలమా..? కడు బీద పరిస్థితిలో బంగారము, వెండి,ఇత్తడి, వస్తువులను అమ్మి తన అవసరాలను తీర్చుకొనెదరు. ఇలాంటి అమ్మె వస్థువులను దేవుళ్ళని అనగలమా..? భయము గొలుపుతు జూచెడి అంటే రాతిలోనో లోహాలతోనో చేసిన దేవుళ్ళు భిన్నమైనప్పుడు(పగిలిపోవడం లేదా కరిగిపోవడం) వాటిని పెద్దలు పూడ్చిపెట్టమంటారు. అలాంటి భూమిలో దిగబడే దేవుడిని దేవుళ్ళని అనగలమా..?
నిజ దేవుడు విత్తనములోని చెట్టలా, పాలలోని నెయ్యిలా, అణువులోని పరమాణువులా, మనలోనే సహజ భావుడై
నిజైక్యుడు ఉన్నాడు కూడలసంగమదేవుడు అని దేవుని నిజ స్వరూపాన్ని చెప్పడం జరిగింది.

నిజ లింగాయతులు మట్టి, చెక్క, రాతి, మరియూ ఆకార దేవుళ్ళను నమ్మరు, సకల ప్రాణికోటితో సహ - మనలోపల దాగియున్న నిరాకార ఆత్మ చైతన్య స్వరూపాన్ని మాత్రమే దేవుడని నమ్ముతారు.

"బసవాది శరణుల వచనాలు అందరూ చదవాలి అందరికీ చదివించాలి"

Previousవీరశైవ మతము మరియు లింగాయత ధర్మమునుకు గల సంభంధముబసవేశ్వరుడు మన ధర్మగురుNext
*