Previous ఉళివె బసవకల్యాణ Next

కూడలసంగమ

జగత్తునందలి అన్ని స్వతంత్ర ధర్మములకు ఉండునట్లు లింగాయత ధర్మమునకు ఒక ధర్మక్షేత్రమున్నది. ఇదే విశ్వగురు బసవణ్ణగారు ఐక్యముచెందిన పరమపవిత్ర క్షేత్రము కూడలసంగమము. ఇది అప్పగారు విద్యాభ్యాసము చేసిన స్థానము; తపస్సు చేసి నవధర్మఘోషణము చేసిన ధర్మభూమి. ఇప్పుడు కూడ శ్రీ గురుబసవ తండ్రిగారి దివ్యసమాధి కృష్ణా మలప్రభా నదులసంగమస్థానమందున్నది. మన పూజనీయ శరణలు, శివయోగులు ఐక్యముచెందిన స్థానములు ధర్మక్షేత్రములు కాగా, కూడలసంగమము "ధర్మక్షేత్ర"మని నమ్మి సంవత్సరమునకొక్క సారియైనను శరణమేళ సమయమున సందర్శించుట తన కర్తవ్యమని లింగవంత ధర్మానుయాయి తెలిసికొనవలేను.

తన జీవమానమునందు లింగాయత ధర్మానుయాయి దర్శించియే తీరవలసిన మహత్వ క్షేత్రములివి.

అక్కడ చేరుకోవడానికి మార్గాలు:
సమీప విమానాశ్రయం: బెళగావి (బెల్గాం), 188 km
సమీప రైల్వే స్టేషన్: ఆల్మట్టి (ఆనకట్ట), 31 km
రోడ్ ద్వారా: జాతీయ రహదారి నంబర్ NH-13(Now renamed as NH-169) క్రాస్ నుండి కేవలం 8 కి.మీ ఉంది.

ప్రధాన నగరాలు నుండి దూరం

హునుగుంద NH-169(NH-13) మరియు SH-133 ద్వారా: 21 km
బసవన బాగెవాడి : 60 km
ఇళకల NH-169(NH-13) మరియు SH-133 ద్వారా: 33 km:
బాగల్ కోట్ SH-133 ద్వారా: 46 km
బీజపూర్ NH-169(NH-13) ద్వారా: 92 km
షోలాపూర్ NH-169(NH-13) ద్వారా: 196 km
గోవా బెల్గాం-బాగలకోట్ రోడ్ ద్వారా: 300 km
హైదరాబాద్: రాష్ట్ర రహదారి 18 మరియు బాచీ-రాయచూరు Hwy / రాయచూరు-బాగలకొటె Rd ద్వారా: 372 km
హైదరాబాద్: గుల్బర్గా బీజపూర్ హుబ్లి Hwy ద్వారా : 475 km
బెంగుళూర్ NH-4 ద్వారా మరియు NH-169(NH-13): 450 km

Reference:

1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
*
Previous ఉళివె బసవకల్యాణ Next