Back to Top
Previous చందిమరసు వచనాలు సకలేశ మాదిరాజు (మాదరస) Next

మడివాళ మాచిదేవుడు, మడివాలు మాచిదేవుని సమయాచారపు మల్లికార్జునుడు, మధువయ్య వచనాలు

సూచిక (index)
వచనను ఎంచుకోండి:

ఎంపిక చేసుకున్న వచన
*

మడివాళ మాచిదేవుడు


అంగలింగ సంబంధం కావలెనన్న
కపటుల మాటలను వినరాదు
అంగలింగ సంబంధం అవసరమేమి
మనస్సు లింగాల సంబంధం ఏర్పడనంతవరకు?
మనస్సు మహత్తులో నిలిచిన పిదప
లింగ సంబంధమెంతటిది చెప్పుమా, కలిదేవరదేవ! / 1882
అంధకారపు దిశ నుండి చందమామ వెలిగింది
నిందకుల పల్కులను త్రిప్పికొట్టేందుకు శివభక్తి ప్రకాశించిందించింది
ఔనంటే కాదను వాదానికీడ్చే వారిని, కుతర్కంతో
యమలోక పథకులతో కూడి నానాజన్మల కెక్కనీక
శివాచార పథమును చూపించుమయ్యా కలిదేవరదేవ! / 1883
ఎఱుక నెరిగితినని క్రియను విడువరాదు
మాధుర్యానికి మాధుర్యం చేరితే రుచికి కొరత ఉండునా?
ద్రవ్యానికి ద్రవ్యం చేరితే పేదతనానికి ఎడముంటుందా?
నీవు చేసే పనిలో శివపూజాభావన ముండాలి
అది కలిదేవర దేవుని కూటము, చందయ్యా ! / 1884
ఆ మహాలింగవంతు డొకడే తిన్నాడన వద్దు
అతని దంతాలన్నీ పంకికారులు
అతని నడుమన ఉండే కాంతిరూపము నీవు కనుమా?
కలిదేవయ్యా ! / 1885
ఆశాపాశములను విడిచితే ఏమయ్యా?
రోషపాశాన్ని విడువనంత వరకు?
రోషపాశాన్ని విడిచితే ఏమయ్యా?
మాయాపాశమును విడువనంత వరకు?
ఈ రీతి త్రివిధపాశమును తెంచి
నిజము నందిన లింగైక్యులను చూపుమురా
కలిదేవర దేవా! / 1886
చంపరాదు ప్రాణిని
నిందింపరాదు పరులను
ఎవరి గుట్టును ఎత్తి మాటాడరాదు
పర వధువును చూచి మరులు గొనకుంటే
శివలోకమే కరతలామలకం అన్నాడు
కలిదేవర దేవుడు. / 1887
పగలు రే లెరుగని అంధుని చేతిలో
చేతి దీపం ఉంటే ఏమి? దారి చూచి నడువ గలదా?
గురుచర పరమును ఎరుగని దురాచారి చేతిలో
లింగమున్న నేమి? వాడు సత్య సదాచారములు కల
భక్తిపరులకు సాటివచ్చునా?
అతడు శివభక్తుడై చెడిపోయిన విధ మెటువంటిదంటే
భక్తుల ఇంట్లో దూరి తిన్న కుక్క
తిరిగి మరల హేయానికి పరిగెత్తినట్లన్నాడు కలిదేవయ్య! / 1888
తింటే భూత మంటారు
తినకుంటే చకోరి అంటారు
ఊళ్ళో ఉంటే సంసారి అంటారు
అడవిలో ఉంటే మర్కట మంటారు
మాట్లాడితే వదరుబోతు అంటారు
మాట్లాడకపోతే నంగనాచి అంటారు
నిద్రపోకుంటే చోరుడంటారు
నిద్రపోతే జడదేహి అంటారు
ఇట్లు వసుధలో ఈ ఎనిమిది విధాలను
పోగొట్టుకోవటం మన వశం కాదు, చూడరా! కలిదేవర దేవా! / 1889
ఎక్కడా, ఎప్పుడూ ప్రాణిని చంపకుండుటే ధర్మము
దేన్నైనా వద్దనుటే తపము
పరవధువుపై ఆశకు మనసులో తావు లేనప్పుడు
దేవుడు తాను అక్కడే ఉంటాడని అన్నాడు కలిదేవయ్యా. / 1890
ఈకలు కట్టని బాణం గురిని తాకగలదా?
గురు లింగ జంగముల పాద తీర్థ ప్రసాదమును తెలియకనే
పరమును చూచానన్న దురాచారుల ముఖాలను
చూడజాలనన్నవాడు మన కలిదేవర దేవయ్య. / 1891

References

[1] Vachanas selected from the book "VACHANA" (Edited in Kannada Dr. M. M. Kalaburgi), Telugu Version Translation by: G. Chandrasekhara Reddy. ISBN: 978-93-81457-05-4, 2012, Pub: Basava Samithi, Basava Bhavana Benguluru 560001.

*
Previous చందిమరసు వచనాలు సకలేశ మాదిరాజు (మాదరస) Next