1 |
జననము - ఆనందనామ సంవత్సర వైశాఖశుద్ధ, అక్షయ తృతీయా, రోహిణి నక్షత్రమున |
30 ఏప్రిల్ 1134. |
2 |
ఉపనయన తిరస్కారము - కూడలసంగమమున ప్రవేశము, విద్యాభ్యాసము |
1142 |
3 |
జ్ఞానోదయము కలుగుట, ఇష్టలింగం అవిష్కారం - మకర సంక్రాంతి రోజున. |
1155 |
4 |
కూడల సంగమమువీడుట - మంగళవేఢ ప్రవేశము - శ్రీముఖ సంవత్సరము. |
1155 నుండి 1160 |
5 |
మంగళవేఢను వీడుట - కల్యాణమున ప్రవేశము. విక్రమనామ సంవత్సరము శ్రావణ శుద్ధ పంచమి |
1160 |
6 |
అనుభవ మంటప స్థాపన |
1169 |
7 |
చెన్న బసవేశ్వరుని జననం - కార్తీక శుద్ధ పాడ్యమి |
1172 |
8 |
అల్లమప్రభు మరియు సిద్ధరామేశ్వరుల ఆగమనం |
1184 |
9 |
శూన్యపీఠ స్థాపన - ప్రభుదేవునిచే పీఠారోహణ విశ్వావసు సంవత్సర, చైత్ర శుద్ధ పాడ్య యుగాది సోమవారం, రేవతి నక్షత్రంలో |
1185 |
10 |
చర్మకారవృత్తికి చెందిన హరళయ్య కల్యాణమ్మ దంపతుల కుమారడు శీలవంతునకు బ్రాహ్మణవర్గము వాడగు మంత్రిపదవియందుగల మధువరసు కూతురు లావణ్యవతితో వివాహము. రాక్షసనామ సంవత్సర ఫాల్గుణ ఏకాదశి |
12 ఫిబ్రవరి 1196 |
11 |
బసవణ్ణవారు దేశబహిష్కార శిక్షతో కల్యాణము వీడుట - ఫాల్గుణ శుద్ధద్వాదశి |
13 ఫిబ్రవరి1196 |
12 |
హరళయ్య, మధువరస, శీలవంతులకు బంధనం |
14 ఫిబ్రవరి 1196 |
13 |
హరళయ్య, మధువరస, శీలవంతులకు క్షిప్రవిచారణ, దోషులుగా నిర్ధారించి కన్నుల పెరికింపజేసి ఏనుగుకాళ్ళకు కట్టి ఈడ్పించి చంపు శిక్ష ఫాల్గుణ మాస చతుర్ధశి రోజున |
15 ఫిబ్రవరి 1196 |
14 |
బిజ్జళని వధ (హోలి) కామిని పున్నము |
16 ఫిబ్రవరి 1196. |
15 |
అల్లమప్రభుదేవుడు శ్రీశైలం కదళివనం చేరుకొని దేహమును విసర్జించినది - నళనామ సంవత్సర, అశాడ శుద్ధ పాడ్యమి |
3 జూన్ 1196 |
16 |
కూడలసంగమములో బసవేశ్వరుని లింగైక్యము-నళనామ సంవత్సర శ్రావణశుద్ధ పంచమి (నాగుల పంచమి) |
30 జులై 1196. |