Previous భహురూపి చౌడయ్యగారి బసవ స్తుతి వచనము తోంటద సిధ్ధలింగ శివయోగి గారి బసవ స్తుతి వచనము Next

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమ: ||

శివయోగి సిధ్ధరామేశ్వరుని బసవ స్తుతి వచనము

✍ మడపతి.వి.వి.
లింగాయత సమన్వయ సమితి
హైదరాబాద్ తెలంగాణ.

"చూసే భక్తి బసవణ్ణనుండి సంపాదించాను,
కలిసే జ్ఞానము బసవణ్ణనుండి సంపాదించాను చూడుమా!
ఎక్కడి శివభక్తి ,ఎక్కడి మాటజ్ఞానము బసవణ్ణనుండి కాక ? మహాజ్ఞాని మహాప్రకాశవంతుడు
*బసవన్న ధర్మమయ్యా* కపిలసిధ్ధమల్లికార్జున." - వచన సంపుటం:4, వచన సంఖ్య:747

పై వచనము శివయోగి సిధ్ధరామేశ్వరుడు భక్తి, జ్ఞానమును గురించి వివరిస్తూ బసవేశ్వరుని గురించి స్తుతించడం జరిగింది.

" *చూసే భక్తి బసవణ్ణనుండి సంపాదించాను,*
శివయోగి సిధ్ధరామేశ్వరుడు 12 వ శతాబ్దములో సొన్నలాపురం (నేటి షోలాపూర్) లో అచంచలమైన భక్తిని కలిగి అల్లమాప్రభు ద్వార బసవేశ్వరునికి పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు భక్తి అనే నిర్వచనాన్ని చేసే భక్తిగా కాకుండా చూసే భక్తిని బసవణ్ణనుండి సంపాదించాను అని చెప్పడం జరిగింది. *సర్వేంద్రియాణాం నయనం ప్రధానం* అన్నట్టుగా భక్తిని చెయ్యడం కంటే భక్తితో చూడడం ఎంతో శ్రేష్టమైనది అని దీని అర్థం.

" *కలిసే జ్ఞానము బసవణ్ణనుండి సంపాదించాను చూడుమా!*
జ్ఞానమనే మహా సముద్రాన్ని సంపాదించడం అంతసులువు కాదు. జ్ఞానాన్ని సంపాదించాలంటే పెద్దలతోగాని అనుభవజ్ఞులతోగాని, మహాపురుషులతోగాని, అన్నిటికంటే నిరాడంబరమైన శరణుల సాన్నిహిత్యం వల్లమాత్రమే లభిస్తుంది. అందుకే సిద్దరామేశ్వరుడు బసవణ్ణగారు మరియూ బసవాది శరణుల సాన్నిహిత్యం వల్ల నిజమైన పరమాత్ముని జ్ఞానాన్ని సంపాదించానని చెప్పడం జరిగింది.

*ఎక్కడి శివభక్తి , ఎక్కడి మాటజ్ఞానము బసవణ్ణనుండి కాక.*
భక్తి వున్నచోట జ్ఞానానికి ఆస్కారము లేదు, జ్ఞానమున్న చోట భక్తికి ఆస్కారము లేదు. అందువల్లే భూమికీ ఆకాశానికి వ్యత్యాసము గల ఈ భక్తి జ్ఞానములను కేవలం బసవణ్ణనుండి మాత్రమే నేను సంపాదించానని చెప్పడం జరిగింది.

*మహాజ్ఞాని మహాప్రకాశి బసవణ్ణుని ధర్మమయ్యా కపిలసిధ్ధమల్లికార్జున."*
జ్ఞానానికి అతీతమైన మహాజ్ఞాని, భక్తితో తనను తాను ప్రకాశిస్తూ, లక్షలాది శరణులను ప్రకాశింపచేసిన మహాప్రకాశి *బసవేశ్వరుడు నిర్మించిన ధర్మమయ్య* ఇది అని లింగాయత ధర్మము గురించి మరియూ విశ్వగురు బసవేశ్వరుని గురించి చాలా అద్భుతంగా స్తుతించడం జరిగింది.

*బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి*

సూచిక (index)
*
Previous భహురూపి చౌడయ్యగారి బసవ స్తుతి వచనము తోంటద సిధ్ధలింగ శివయోగి గారి బసవ స్తుతి వచనము Next