Previous తోంటద సిధ్ధలింగ శివయోగి గారి బసవ స్తుతి వచనము పోస్టల్ స్టాంప్ మరియు నాణెం పై గురు బసవన్న. Next

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమ: ||

షణ్ముఖ శివయోగి గారి బసవ స్తుతి వచనము

✍ మడపతి.వి.వి.
లింగాయత సమన్వయ సమితి
హైదరాబాద్ తెలంగాణ.

బసవణ్ణయే గురువు నాకు;
బసవణ్ణయే లింగము నాకు;
బసవణ్ణయే జంగమము నాకు;
బసవణ్ణయే పాదోదకము నాకు;
బసవణ్ణయే ప్రసాదము నాకు;
బసవణ్ణయే రుద్రక్షి నాకు;
బసవణ్ణయే మూలమంత్రము నాకు;
బసవణ్ణయే అష్టావరణము నాకు;
బసవణ్ణయే పంచాచారము నాకు;
బసవణ్ణయే షట్ స్థలబ్రహ్మము నాకు;
బసవణ్ణయే సర్వాచారసంపత్తియైన కారణమున,
బసవణ్ణను పరచుకొని, బసవణ్ణను కప్పుకొని,
బసవణ్ణను చుట్టుకొని, బసవణ్ణను ధరించుకొని,
బసవణ్ణ చిద్గర్భమునందు కూర్చొని,
నేను బసవా బసవా బసవా బసవా ఎనుచుంటినయ్యా అఖండేశ్వరా. - సమగ్ర వచన సంపుటం : 14వచనము సంఖ్య : 874


12 వ శతాబ్దం భారత చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపదగినదిగా ఉంది.లింగవంతుల ధర్మగురువైన బసవేశ్వరుని వైరాగ్యాన్ని, భక్తిని, వైభవకీర్తిని, సమసమాజం స్తాపనకై చేస్తున్న కృషిని, అంత్యజులు, అస్పరుషులు, నీచులను, అంటురానిలారలను, ఇష్టలింగధారులుగా మార్చి వారికంటూ సమాజములో చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చూచి, ఎందరో భక్తులు దేశం నలుమూలల నుండే కాక అన్య ఇతర దేశాలనుండి వచ్చి లింగవంతులుగానూ శరణులుగానూ మారి అమూల్యమైన వచనాలను రాసేంతగా ఎదిగారు అంటే బసవణ్ణ గారి సంఘటన శక్తికి తార్కాణం అని చెప్పవచ్చును. లింగాయతుల సంఘటన నాటి కల్యాణ రాజ్యమునందు బసవణ్ణ గారి ఆధ్యర్యంలో అనుభవమంటపములో జరిగేది. నాడు ప్రతీ రోజు 770 మంది అమరగణాలు, 1,96,000 శరణులు ప్రతీ నిత్యం కాయక దాసోహానికై సమయాన్ని సద్వినియోగం చేసుకొనేవారు. అందులోభాగంగా బసవణ్ణ అంటే అందరికీ ఎనలేని అభిమానం ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, మరియూ తానే సర్వస్వమై ఉన్నడనడంలో అతిశయోక్తి లేదు.

పై వచనము షణ్ముఖ శివయోగి గారు బసవణ్ణ గురించి చెప్పడం అబ్బుర పచేట్టగా *అష్టావరణములైన* (గురవు, లింగము, జంగమము, పాదోదకము, ప్రసాదము, వీభూతి, రుద్రాక్షలు, మరియూ మంత్రము) *పంచాచారాలైన* (సదాచారము, లింగాచారము, శివాచారమం, గణాచారభు, మరియూ భృత్యాచారము) అంతే కాకుండా *షట్ స్ధలములైన* (భక్తుడు, మహేశ్వరుడు, ప్రసాది, ప్రాణలింగి, శరణుడు మరియూ ఐక్యుడు) వీట నన్నింటిని ఒక ధర్మగురువులో తప్ప ఇంకొక్కరిలో చూడలేరనే విషయాన్ని మార్మికంగా బసవణ్ణ గారి గురించి చాలా చక్కగా స్తుతించడం గమనించవచ్చును.

సూచిక (index)
*
Previous తోంటద సిధ్ధలింగ శివయోగి గారి బసవ స్తుతి వచనము పోస్టల్ స్టాంప్ మరియు నాణెం పై గురు బసవన్న. Next