గురువు - జంగముడు | లింగ- (ఇష్టలింగము) |
లింగాయత పరంపర (Heritage) |
✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి
*లింగాయత ధర్మము, దాని కార్యాంగము రూపుగొన్నది, ఈ ధర్మము సంస్థాపింపబడినది పన్నెండవ శతమానమునందు.. కాని దీనికి స్ఫూర్తినిచ్చిన పరంపర యనగా శైవపరంపర. ఆదిగురువైన శివుడు ఐతిహాసికముగా శైవధర్మమును స్థాపించెను. ఆర్యుల ఆగమనమునకు పూర్వమే ఇది ఉఛ్రాయ స్థితియందుండినది. అందు యజ్ఞయాగాదులకు ప్రాణిబలికి చతుర్వర్ణములకు అవకాశముండలేదు. ఈ ఆది శివుని ధర్మమైన, శైవధర్మమునందు సప్తపభేదములయినవి. దానియందు వీరశైవమను సదాచారపథము వృషభుని నేతృత్వమునందయ్యెను. వీరు ఏకదేవోపాసకులై తమ ఆదిగురువు మాటమేరకు నడచుకొనుచుండిరి. ఈ పరంపరయందు తమిళునాడుకు చెందిన 63 మంది పురాతనులు, మాణిక్యవాచకర్, నక్కినాయనార్, మున్నగువారు వచ్చుచున్నారు. వీరి ఏకదేవతోపాసన సమతా తత్వములతో స్ఫూర్తిగొన్న బసవణ్ణగారు శైవధర్మముయొక్క భక్తియంశమును మెచ్చుకొని ఒక క్రొత్త ధర్మమును రూపించి తనదే అయిన క్రమబద్ద సిద్ధాంతము, సాధన, దర్శన సంస్కారము, సమాజ శాస్త్రము, నీతిశాస్త్రము, అర్థశాస్త్రము, సంస్కృతి, పరంపర, సాహిత్యములను చేర్చి లింగాయత ధర్మముగ చూపించి ఇచ్చిరి. దానిని ఒక వచనమునందు సూక్ష్మముగా చెప్పియున్నారు.
హరబీజమై పురాతను లాదిగా
ప్రాకి బొంగొన్న మాదారుని సుతుడ నేనయ్యా
పన్నగభూషణ కూడల సంగమదేవ
చెన్నయ్య మా ముత్తాతకు తాత గదయ్యా (బ.షవ. 347)
ఇందు శైవధర్మమునకు హరుడు ప్రధానుడని తెలియవచ్చుచున్నది. ఆ పరంపరనే గ్రహించి నేను వచ్చినానని బసవణ్ణగారు చెప్పుచున్నారు.
నీరు నింపిడి యవ్వ మా యవ్వ నింబవ్వ
నృపుని లాడమున పనివాడు మా అయ్య చెన్నయ్య
ఎవ్వరూ లేరంటిరే నాకు
కంచిలో వంటక తై మా అక్క
మా తాతలు పొందు భక్తిని
యీ చేతుల గొందు కదరా, కూడల సంగమ దేవా (351)
బసవణ్ణగారు రూపించిన ధర్మపాత్రకు కక్కయ్య, చన్నయ్య, దాసయ్యగారలు, నింబెవ్వ, బాణుడు, మయూరుడు, కాళిదాసు, మున్నగు శివభక్తులు - వీరందరూ విచారస్పూర్తిని కల్గించినవారు. పురాతనుల ఆచరణములన్నింటిని బసవణ్ణగారు గౌరవింపకపోయిననూ వారి భక్తియొక్క ఉత్కటతతో స్పూర్తిగొన్నవారే. కావున శైవధర్మముయొక్క లత వీరశైవమను మొగ్గకు జన్మనిచ్చినది. ఆ మొగ్గ లింగాయత ధర్మమను ఫలమయినది అని అనవచ్చును. లతయందులేని ఒక నవ్యత మొగ్గయందుండగా మొగ్గయందులేని ఒక వైశిష్ట్యము ఫలమునందు కలదు. శైవధర్మముయొక్క లతనుండి వేయారు సంవత్సరముల తరువాత జన్మించిన ఫలమైననూ ఈ లింగాయత ధర్మము స్థావరలింగపూజ, తీర్థక్షేత్రయాత్ర మున్నగువాని తొడిమనుపోగొట్టుకొని స్వతంత్ర ధర్మముగ శోభించుచున్నది. శైవధర్మమునకు శివుడు ప్రధానుడు, లింగాయత ధర్మమునకు బసవణ్ణ ప్రధానుడని దృఢముగ చెప్పవచ్చును. బసవణ్ణగారినుండి ఆరంభమైనది. ఇష్టలింగధారుల శరణపరంపర. అదే లింగాయత పరంపర. దానినే సిద్దరామేశ్వరులు ఇటు చెప్పుదురు.
"అనువినాయతకెల్ల బసవమూలిగనాగే
బసవణ్ణ శరణయ్య యోగినాథ" (బసవ స్తోతత్రివిధి - 28)
Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.
గురువు - జంగముడు | లింగ- (ఇష్టలింగము) |