షట్ స్థల దర్శనము | కరుణోదకము (పాదోదకము) - ప్రసాదము |
సదాచారము (బసవాచారము - ధర్మగురు నిష్ఠ) |
✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి
*
విశ్వగురు బసవణ్ణగారు పంచాచారములను బోధించిరి. ఈ తత్వములతోబాటు వీనిని మనకిచ్చిన ధర్మగురు బసవణ్ణగారి యెడల నమ్మిక, నిష్ఠ అత్యగత్యము. సృష్టిని కల్గించినవాడు దేవుడైతే ఆ సృష్టియందు బ్రదుకు విధానమును నేర్పినవారు బసవణ్ణగారు. కాబట్టి సృష్టికర్తయందు శ్రద్ధా ధర్మగురువునందు నిష్ఠ అత్యావశ్యకములు. బసవ గురువునందు అతడు దేవుని ప్రతినిధి అను శ్రద్ద అతడు ఆదేశించినట్టు నడచుకొనవలెనను నిష్ఠ లేకున్నచే, అటి అనుయాయియొక్క భక్తి జరుగదు. కావున బసవాచార - ఏకగురు నిష్ఠలనగా ధర్మగురు బసవణగారియందు నిష్ఠయను ఇంకొక ఆచారమును చేర్చి 10.3.1994 రోజున జరిగిన ప్రథమ గణమేళపు శరణసభయందు ఘోషింపబడినది
కాయకమే కైలాసమను శరణ తత్వమును ఒప్పుకొని వ్యక్తి పరోపజీవియై అనగా వేరొకరిని కష్టపెట్టి బదుకుట మహాపాపమని తెలిసి సత్య, శుద్ధ కాయకముతో ధనము సంపాదించి తనకు కావలసినంత మాత్రము ఉపయోగించుకొని ఎక్కువయినదానిని సమాజమునకు చెల్లించి పరిశుద్ధమైన జీవితమును గడపుచు రాష్ట్రప్రగతికి శ్రమపడవలేవన్నదే సదాచారము.
కృత్యకాయకవిల్లదవరు భక్తరల్ల
సత్యశుద్ధవల్లదుదు కాయకవల్ల (ఉరిలింగ పెద్ది)
శరణధర్మముయొక్క అనుయాయి లక్షణమునగా కార్యోన్ముఖత. కాయకమును చేపట్టక పరోపజీవి భక్తుడు కానేకాదు. అనగా ఏదో ఒక వృత్తిని ఎట్లైననూ చేసి, ధనము సంపాదించిన అది కాయకము కాదు. సత్యత, శుద్దత - ఇవి కాయక ప్రథమ లక్షణములు. అపవిత్ర మార్గములో లక్షలు కొలది సంపాదించి వేయారు దానము చేయువానికంటే సత్యశుద్ధముగా నూరు రూపాయలను సంపాదించి పది దానము చేయువాడు పరమ పవిత్రుడు.
ఇట్లు శరణధర్మముమేరకు కాయకము వ్యక్తికి అవశ్య నియమము.
“మాట ఉళ్ళన్నక్క మహా ప్రమథర భాషేయ భాగ్యదొరకొండితు” అను ఆయ్దక్కి లక్కమ్మ వచనము వలన కాయకము చేయువారికి మాత్రము అనుభవ మంటపమునందు ప్రవేశము దొరకి మహాశరణుల సత్సంగము, అనుభవ గోష్ఠులు లభ్యమగుచుండినవి అనిపించును. మరియొక నియమముతో కాయకమునందు వృత్తిగౌరవమును (Dignity of Labour) వృత్తి దైవత్వమును (Divinity of Labour) కనుగొను భావమును బసవణ్ణగారు పెంచిరి. కాయకమువలన కైలాసము అనగా ఇది ఇంకొక్క_సిద్దికి సాధనయని భావింపక “కాయకవే కైలాస” అనగా అర్థ మర్మములను తెలిసికొని చేసిన దీనియందే ఆత్యంతిక సిద్ధి అని అర్థమగునట్లు చేసి ఇచ్చిరి. కాయక-దాసొహములందే సర్వమునూ సాక్షాత్కారించుకొనిరి.
మాడువ మాట ఉళ్ళన్నక్క బేరొందు పదవియనరసలేతక్కె!
దాసోహవెంబ సేవెయ బిట్టు నీసలారదే
కైలాసవెంబ ఆసె బేడ
మారయ్య ప్రియ అమరేశ్వర లింగవిద్ద ఠావే కైలాస (ఆయ్దక్కి లక్కమ్మ, పుట · 175 - వ.సా.సం)
తమ తమ ప్రామాణిక, సత్య శుద్దకాయకమందే ఆత్మానందమును కనుగొనవలెనను. తత్వమును బోధించిరి.
కాయకముయొక్క నిర్బంధము. ఒకరిద్దరికి కాదు గురువుగాని, జంగముడు కాని కాయకమును చేసియే భుజింపవలెను. ఒక ఊరియందు స్థిరముగ నిలిచి అచ్చట జనులయందుగల లోపదోషములను బోధ, దీక్ష, అనుగ్రహముల మూలకముగ దిద్ది సుధారణచేయు కాయకము గురువుకు; ఊరినుండి ఊరికి సంచరించు ధర్మబోధచేయు కాయకము జంగమునకు చెందినది. కొంతమంది, నవయుగమునందు ధర్మబోధ చేయునది కూడ ఒక కాయకమా? అని పరిహాసము చేయుదురు. ధర్మబోధయొక్క మహాత్వమను తెలియనివారు, బోధకులను ధర్మప్రచార వ్యాజమున ధనము సంగ్రహించు యాచకులు అని భావింతురు. కాని ఒక విషయమును బాగుగ మనస్సునందుంచుకొనవలెను. క్రిశ్చియన్ ధర్మమునందు, సమాజమునందు ధర్మ ప్రసారకుల విషయమున, ఆ వృత్తి విషయమున పూజ్య భావమున్నందువలననే ఆ సమాజము సుసంఘటితముగానున్నది, శరవేగమున పెరుగుచున్నది.
కేవలము ఉపజీవనమునకు దారిచూపు లౌకికవిద్యను బోధించు శిక్షకుని వృత్తి అత్యంత పవిత్రమని అందుము. నిజజీవన మార్గమునకు లోబడి లౌకిక జీవనమునందు పొందిన అనేక దుఃఖములభారమును తొలగించుకొని బాధపడిన హృదయమునకు బోధవలన సాంత్వనమును కలుగించు ధర్మబోధకుని కర్తవ్యము పవిత్రము కాదా? భౌతికమైన పంటను పండించు రైతును పవిత్రజీవి అనుచున్నాము. ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించి ఆత్మతృప్తిని ఇవ్వగల ధర్మగురువు కార్యము పవిత్ర కాయకము కాదా? బయటి శత్రువులునుండి రక్షించు సైనికునిది పవిత్ర కాయకము కాగా ఆంతరంగిక శత్రుపులనుండి (కామ, క్రోధ, మోహ, లోభ, మద మత్సర) రక్షించు సద్గురువుది పవిత్ర కాయకము కాదా? ధర్మ బోధకుడు నేరుగా గుద్దలి, రైఫల్ పట్టి శారీరికముగ కాయకము చేయక పోయిననూ రైతులందు కాయకనిష్ఠ, ప్రామాణికత, యువకులయందు రాష్ట్రాభిమానము, అధికారులయందు లంచము తినరాదను పాపభీతి, నైతికత - వీనిని ఉద్దీపింపచేసినచో దానికంటే పవిత్ర కాయకమేది? ఈనాడు మనశిక్షణయందు వైజ్ఞానిక, కళాత్మక, సామాజిక శిక్షణలన్నియూ దొరకిననూ బ్రతుకుటకు కావలసిన నైతిక శిక్షణయొక్క కొరతయున్నది. సర్కార శిక్షణ సంస్థ ఇవ్వని నైతిక శిక్షణమును రాష్ట్రీయ శిక్షణమును ధర్మబోధకుడిచ్చినప్పుడు అతనికంటే శ్రేష్ఠులు ఎవరుండగలరు? కాని ఇది మాత్రము నిజము. ధర్మబోధవ్యాజమున దౌర్జన్యమును, జాతీయతను, మూఢ నమ్మకములను పెంచి ముగ్ధ భక్తలను బాధించినచో దానికంటే పాపాత్మక కృత్యమేదియూ లేదు. నమ్ముకొని వచ్చిన అనుయాయులను తప్పుమార్గమున నడపించినచో అది కమింపరాని అపరాధము.
క్రిశ్చియన్ ధర్మమునందు ప్రచారకుల విషయమై మంచి భావముండుటయే కాక ప్రచారకులు కూడ అంతే నిష్ఠతో కార్యము చేయుదరనుటను , మనము మరవరాదు. తమ ధర్మగురువుయొక్కతత్వప్రసారమునందే వారి ఆత్యంతికశాంతిని పొందుచున్నారు - ప్రసారకార్యము పవిత్ర కర్తవ్యమని స్వీకరింతురు. కాని వికృతిచెందిన లింగాయత సమాజమునందు ధర్మప్రసారమునకై స్వామిత్వ మఠాధికారము వహించుకొన్నవారికంటే మఠపీఠముయొక్క ఆస్తికొరకు కావి బట్టలు ధరించువారే ఎక్కువగానున్నారు.
అట్లు అధికారము కైగొన్న తప్పువలననైననూ ధర్మప్రసారము చేయుకార్యమును చేపట్టుట లేదు. ఇది ధర్మ ద్రోహము. అంతేకాక ఇంకొక్క పెద్ద తప్పు ఏమనగా - అర్హతను చూచి క్రిశ్చియన్ ఫాదర్ లను, బౌద్ద భిక్షువులను ఎన్నుకొనునట్లు జంగములను ఎన్నుకొని వారికి ప్రసారకార్యము వహింపచేయక యొగ్యతవుండని పోని జాతిని బట్టి మతాధికారులనుచేయు మూఢసంప్రదాయమే సమాజముయొక్క అసంఘటనకు, పతనమునకు ఆది కారణమైనది. స్వయంస్పూర్తి, త్యాగముతో వచ్చిన సాధకులకు ఏ మఠపీఠముల ఆస్తిని ఇవ్వకున్ననూ ధర్మప్రసారమునకై వారు పాడుపడుదురు. ఎందుకనగా వారికి కేవలము తినుట, త్రాగుట, అనుగురిలేక ఏమైనను సాధింపవలెనను ఉత్కంఠవుండును. వారినుండి అన్నింటినీలాగుకొన్ననూ వారు తమకర్తవ్యమును, తమ బాధ్యతను వదులుకోరు. కర్తవ్యమును విడిచిన వారికి ఆత్మశాంతి దొరకదు. కావున అట్టి ఆసక్తి, త్యాగము కలవారినే మఠపీఠములకు ఎన్నుకొను నేర్పు భక్తులకుండవలెను.
దీనిని తెలిసియే శరణులు - ఎంతటి పెద్దవారు కాని, అందరు తప్పక కాయకము చేయవలెననిరి. మోళిగె మారయ్యవంటి రాజు త్యాగముచేసి వచ్చినను, అతడు కట్టెలను కొట్టి అమ్మునటి కాయకము చేపట్టవలసివచ్చెను. ఇచ్చట గమనింపవలసిన మఱియొక అంశమేమనగా, వ్యక్తికైగొన్న కాయకము విషయమై అతని యొగ్యతను, జాతిని, పరిగణింపరాదు,అనిచెప్పి కాయకముయొక్క విభజననుగూర్చి కల్పింపబడియున్న వర్గబేధ, వర్ణబేధములను తొలగించివైచి కాయకము మూలమునను సామాజిక సమానతను బసవణ్ణగారు తెచ్చిరి.
దేవసహితుడు భక్తుడింటికి రాగ
కాయక మేమని ప్రశ్నించునా?
నీ యాన నీ భక్తుల ఆన
తలనిత్తు తలనిత్తు కూడలసంగమదేవా
భక్తుల కులమెంతునా నీ రాణివాసమే సాక్ని బ.షవ. 453)
దేవుని ఇష్టలింగాకారమున ధరించిన భక్తుడువచ్చినప్పుడు అతని వృత్తినిగూర్చి అడిగిన వర్గభేధమును చూపినట్లగును, జాతినిగూర్చి అడుగగా వర్ణభేదము చేసినట్టుగును. చండాలుని నుండి బ్రాహ్మణుని వఱకు ఏవిధమైన కాయకము చేసినను ఏదియు తక్కువకాదు. ఎక్కువకాదు. ప్రధాన మంత్రియొక్క కాయకమువలెనే సామాన్యుని కాయకము కూడ సమాజము పెరుగుటకు ముఖ్యము. బ్రాహ్మణుడు మొదలు భంగివఱకు ఏ జాతివాడే కాని, అతడు ఇష్టలింగమును ధరించిన, అతని జాతిస్మరత్వము తొలగి గురు కర జాతుడగును. అప్పుడు జాతికిని కాయకమనకును సంబంధమే లేదు అని కాయకత్వము ప్రతిపాదించుచున్నది.
చతుర్విధ మౌల్యములన్నియూ ఉదాత్రీకర్ణమును పొందవలెను. అర్థమును సంపాదించుటనుమాత్రమే నేర్చిన చాలదు. వాడుకొను కళను కూడ నేర్వవలెను. మానవునకువుండు ఆస్తులు మూడు - తను, మన, ధనము. ఈ త్రివిధ సంపదను వ్యర్ధముచేయక గురు - లింగ - జంగమ సేవకై వాడవలెను. ఈ శరీరమును గురు సేవకై ఉపయొగింపవలెను - అనగా గురువు ధర్మప్రసారము చేయునపుడు తాను కూడా 'తనువుతో’ సేవ చేయవలెను. ధర్మప్రసార కార్యము కేవలము సన్యాసుల, మతాధికారుల సొత్తు కాదు. ప్రతియొక్క అనుయాయియ కర్తవ్యము. వేళను కల్పించుకొని ధర్మప్రసారమునకై తనువును వాడవలెను, - గురువు పూజ ఎందులకు - గురువగుటకు. గురు కరుణను పొంది జ్ఞానమును సంపాదించుటకు. గురువు కార్యభారమునకై ఈ శరీరమును ధారపోయవలెను. మనస్సు లింగమునకు వశముకావలెను, ముక్తిబంధనము - ఈ రెండిటికి కారణమైన ఈ మనస్సు కేవలము స్త్రీ, ధనము, భూమి, వీనియందు ఆసక్తముకాక పరమాత్ముని అనుగ్రహమును పడయుటలో ఆసక్తము కావలెను. ధనమును జంగమ సేవకై అర్పించవలెను. అనగా ధర్మప్రసారక మహాత్ములకు ధనమునర్పించి ధర్మదాసోహమందు. పాల్గొనవలెను. ధనమును దీనదలితుల సేవకు, దుఃఖితుల దుఃఖనివారణకొరకు ఉపయొగింపవలెను. ఇట్లు తన సంపాదనయందు ఒక భాగమును సమాజమునకు చెల్లించు దాసోహం భావియే లింగాయతుడు. ఆవశ్యకమైనదానికంటే ఎక్కువగ ఈనాటికి రేపటికి అని సంగ్రహించునది మహాపరాధము. కొంతమంది ఎక్కువ సంపాదించుటవలన అనేకులు పేదరికమునందు కష్టపడవలసియుండును. ఆవశ్యకతకంటే ఎక్కువ సంపాదింపనురాదు. అట్లు సంపాదించిన వేరొకరి ఆదాయము తక్కువై నిరుద్యోగ సమస్య ఏర్పడుచున్నది. అవశ్యకతకంటే ఎక్కువ సంగ్రహించరాదు. అట్లు సంగ్రహించిన వున్నవారు లేనివారు అను వర్గములు ఏర్పడుచున్నవి. సమాజమునందు కొంతమంది మాత్రమే కష్టపడి సంపాదింతురు. అనేకులు పని చెయక కూర్చుండి తినుచుందురు. అందరూ కాయక, కళా, ఊపాసనలను సమానముగా వాడుకొనవలెను. అని శరణులు ఘోషించిరి.
పైడియందొకరవ పట్టునందొక పోగు
నేటికి నాటికి నే గోరినట్లెన
నీ సాక్షి నీ పురాతనుల సాక్షి
నీ శరణులకు తప్ప అన్యులకు నౌనగనయ్యా
కూడల సంగమదేవా (బ.షవ 436)
ఆనాటి బ్రతుకు, ఆనాటికే. రేపటికి వుండనని సంగ్రహించునది తప్పు. ఇట్లు ఆవశ్యకతకంటెను ఎక్కువగా కూడబెట్టిన ధనమును భూమియందు పాతిపెట్టుట, వడ్డీ వ్యాపారమునకు ఉపయోగించుకొనుట మున్నగు క్రియలు తప్పు. ధనమును సమాజ శ్రేయస్సుకై వినియొగింపవలెను. ధనము ఉన్నతమైన సామాజిక కార్యమును నెరవేర్చుటకు ఒక సాధనమేకాని సిద్దికాదు. ఆవశ్యకతయున్నంత మాత్రమే దానికి విలువనిచ్చి వాడుకొనవలెను. సంగ్రహింపరాదు.
ఒక వృక్షము తన వేరుమూలముగ సత్వమును స్వీకరించునట్లు పరమాత్మ చైతన్యమయ వ్యక్తుల ముఖరూపమున తిని తృప్తిపడుచున్నాడు. కాన దేవపూజ చేయవలెననువాడు సమాజమునకై శ్రమపడవలెను.
గీతమెరిగినవాడు జాణకాడు;
మాటనేర్పరి జాణకాడు;
జాణ జాణ (శివు)దేవుని నెఱనమ్మువాడు
జాణ. జంగమునకు. సమియువాడు;
జాణవాడు జముని నోట మట్టిగొట్టి పోయినవాడు
జాణవాడె మా కూడల సంగని శరణుడు (153)
భూమిలో నిధు లుంట అంజనము కలవారు
చూపెదరు భయపడకురా;
మనమున సందేహింపకురా;
జంగమున లింగయ్య కలడని
నమ్మిన సంగయ్య కన్పించురా. (187)
తనువిచ్చి గురుని మెప్పింపవలె
మనసిచ్చి లింగము నర్చింపవలె
ధనమిచ్చి జంగముల దనియింపవలె
త్రివిధ మిటు వెచ్చింపక, పలకగొట
వట్టి మట్టిబొమ్మల గొల్చువారల
మేచ్చడయ్యా కూడల సంగమదేవుడు (206)
ఊరినుండి వూరికి తిరుగుచు ధర్మపచారమును చేయు ధర్మప్రచారకులకు ధనముయొక్క ఆవశ్యకత ఎక్కువ. అట్లే సమాజమునందలి దుర్బలజీవులకు ధనావశ్యకత అధికము. కావున వారికి ధనసహాయము చేయువలెను.
నాగశిలలు కనిపిస్తే పాలు పోయమంటారు
నిజమైన పాముల్ని కనపడగానే చంపమంటారయ్యా
తినగోరే (ఆకలితో) జంగముడొస్తే పదపదమంటారు
తినలేని లింగానికి బోనం చేయమంటారయ్యా
మా కూడల సంగని శరణులను చూచి ఉదాసీనం వహిస్తే
రాతిని గ్రుద్దుకొన్న మట్టి పెళ్ళలా ఔతారయ్యా. /148
"తినగోరే (ఆకలితో) జంగముడు" అనగా కేవలము విన్నపము తీర్చుటకు వచ్చు అయ్యగారని కాదు. ఆకలిగొన్న చైతన్యాత్మక జివియని అర్థము. పండుగలందు అనేక గృహములనుండి పిలుపు వచ్చినప్పుడు తినలేక కష్టపడునటవారికే మరల మరల తినచేయు అనేక మూఢ సంప్రదాయస్తులు ఆకలిగొని అలసివచ్చిన ఒక వ్యక్తివచ్చి భిక్షకొరగా, ఇచ్చుట లేదు. ఆకలిగొన్న వ్యక్తి వచ్చినపుడు భోజనము పెట్టక తినలేని లింగమునకు వడ్డించుటను బసవణ్ణగారు ఇట్లు పరిహాసము చేయుచున్నారు.
నిప్పుల బడ మేను బొబ్బలగు నందురు
తెచ్చినవాని చేయి మొదలే కాలేనయ్యా
నొచ్చితి నొచ్చితినయ్యా కందితి కందితినయ్యా
కూడల సంగని శరణుల జూచి
చూడనట్లుండిన నే నపుడే మాడితినయ్యా; (405)
సరుకు నింపిన వెనుక సుంకమిక
తప్పించుకొని పోలేవు
దొంగ నాణ్యము చెల్లదయ్యా
దొంగ నాణ్యము చెల్లనీరయ్యా;
భక్తియను సరుకునకు జంగముడే సుంకరి;
కూడల సంగమదేవా (198)
ఒక సంపదను ఊరిలోనికి తీసికొని పోవునప్పుడు పన్ను చెల్లింపక లోపలికి పోవుటకు సాధ్యము కాదు. అట్లే భక్తియను భాండమును దేవునియొద్దకు తీసికొని పోవుటకు ముందు దీనదళితుల, సమాజజీవుల సేవ చేసి, ఆ పన్ను చెల్లించియే తీరవలెను.
సామాజిక ప్రక్రియయందు వ్యక్తి భక్తుడు. అతడు తప్ప మిగిలిన సమాజము, జగత్తంతయు జంగమము. “నానొబ్బనే భక్త ఉళిదవరెల్ల జంగమలింగ నీనే అయ్య”
రావయ్యా బసవా; మర్త్య లోకమున భక్తులుండిరె చెప్పమన
ఎవరూ లేరయ్యా ఎవరూలేరు
మఱి యెవ్వరూ లేరయ్యా నేనొకడనే భక్తుడ;
మర్త్య లోకమందున్న జంగమ లింగ భక్తులందరూ
నీవేనయ్యా కూడల సంగమదేవా (891)
కాబట్టి వ్యక్తి సమాజసేవను చేసి తీరవలెను. వ్యక్తి సేవ చేయవలెను, ఏ భావముతో?
భక్తుడై లింగముల పూజింపవలె
భక్తుడై తనకు తా పూజించుకొనుటెట్లయ్యా?
స్వామిభృత్యసంబంధమెట్లుయ్యా నిండునది?
కూడల సంగమదేవా, కనుగట్టి అద్దమిచ్చినట్లయ్యా (185)
“భక్తనాగి లింగజంగమవ పూజిసబేకు” (బ.షవ. 185)
అనగా సమాజముపై తాను శ్రమపడునప్పుడు, తన ఆదాయమును వ్యయముచేయునప్పుడు నేను “దాని, శ్రేష్థుడు” అని భావింపక, “దాసుడు”, “నేవకుడు”, “భక్తుడు” అని కింకరతతో దాసోహం భావియై చెల్లింపవలెను.
Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.
షట్ స్థల దర్శనము | కరుణోదకము (పాదోదకము) - ప్రసాదము |