Previous లింగ- (ఇష్టలింగము) లింగాయత తత్వశాస్త్రం (Lingayat Philosophy) Next

లింగాచారము

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

పంచాచారములు సామాజిక తత్యములు, వీనియందు నైతిక ఆచారములు మిళితమైయున్నవి. లింగాయత ధర్మమును రాష్ట్ర ధర్మముగాను, విశ్వధర్మమును చేయుగల సత్యము పంచాచారములకు కలదు. పంచాచారము ఏవనగా -

లింగాచార, సదాచార, శివాచార, గణాచార, భృత్యాచారవెంబ
పంచాచారద అచరణెయెంతెందడె
లింగవల్లదే అన్యవనరియదిహుదె లింగాచార
సజ్జనకాయకదల్లి తందు గురులింగ జంగమక్కె నీడి
సత్యశుద్ధనాగిహుదే సదాచార;
శివభక్తరల్లి కులగోత్ర జాతివర్ణాశ్రమవనరసదె
అవరోక్కుద కొంబుదే శివాచార;
శివాచారద నిందెయ కేళదిహుదే గణాచార;
శివశరణరే హిరియరాగి తానే కిరియనాగి
భయభక్తియింద ఆచరిసువుదే భృత్యా చార;

ఇంతి పంచాచారవుళ్ళ భక్తర ఒక్కుదనికి సలహయ్యా
ప్రభువే కూడల చెన్నసంగమదేవా (చ.బ.వ. 1190)

సృష్టికర్తయై కరుణామయుడైన పరమాత్మయొకడు ఉన్నాడని అచలముగ విశ్వసించి, అతనిని మానవాకారములందు, ఐతిహాసిక వ్యక్తుల రూపమందు పూజింపకూడదని తెలిసి, మూర్తిపూజ, స్థావరలింగపూజ మున్నగు వైదిక-శైవాచరణములను వదలి పరమాత్మను విశ్వాకారముయొక్క ఇష్టలింగరూపమునందు మాత్రము - పూజించునట్టి ఏకదేవోపాసకుడే లింగాచారియగును. లింగాచారమనగా (Consistent Monotheism) దేవుడొక్కడేయని నమ్మి ఒకే ఒక ఆకారమునందు పూజించుట.

సత్ చిత్ ఆనందరూపుడైన దేవుడొక్కడే మార్గదర్శనము చేయుటకై, ఆత్మజాగృతి కలిగించుటుకై మంత్రపురుష - ముక్తిదాయక - బసవణ్ణ గురువుగా అవతరించెను. ఇట్లు వచ్చిన బసవణ్ణ నిరాకారుడైన దేవుని తెలిసికొనుటకు విశ్వముయొక్క ఆకారమునందు ఇష్టలింగము ఇచ్చెను. ఇటు పరమాత్మ, పూజను గ్రహించి అనుగ్రహించి సదా శరణాగతులను రక్షించుటకై లింగముగా చైతన్యరూపిగా ఉద్దరించుటకు జంగముడుగా అవతరించును. కావున ఇష్టలింగమును, చైతన్యరూపులైన గురుబసవణ్ణగారిని విడిచి మరిదేనిని పూజింపకూడదు. గర్బిణియైన తల్లికి భోజనముగా పెట్టిన ఆహారము గర్భస్థ శిశువునకు చెందునటు మహాగర్భమైన ఇష్టలింగమును పూజించిన దానియందు నిలిచియున్న మహాత్ములందరి పూజయు సహజముగా జరుగును.

మూర్తిపూజను, బహుదేవోపాసనను ప్రోత్సాహించు గుడి-గోపురములను లక్షలకొలది ధనమును వెచ్చించి నిర్మాణముచేయక జీవంతదేవాలయములగు ధర్మవంతులను, ధర్మనిష్ఠులను రూపింపచేయు బసవమంటపములను నిర్మించి, వానియందు సతతము బోధ జరుపుటకు ప్రోత్సాహించువాడే లింగాయతుడు.

లింగాయత ధర్మశాస్త్రముల ప్రకారము అన్యదేవతా - దేవాలయముల నిర్మాణము, స్థావరలింగ ప్రతిష్ఠ - ఇవి తత్వవిరోధి ఆచరణములు.

కల్ల మనేయ మాడి, కల్ల దేవర మాడి
ఆ కల్లు కల్లమేలె కెడెదరే దేవరెత్త హోదరో?
లింగప్రతిష్టెయ మాడిదవనిగె నాయక నరక గుహేశ్వరా (212 అల్లమన వచన )

"స్థావరక్కళివుంటు జంగమకళివిల్ల" అను తత్వమువలన శరణులు దేవాలయ పద్దతి, పూజారి పద్దతులు రెండిటిని నిరోధించిరి. జంగమాత్మకమైన జ్ఞానప్రసారమును చేయు, జనులయందు పరివర్తనను కలిగింపగల మఠములను నిర్మాణముచేసిరి. ధర్మసంస్కారమువలన లోపలికి వచ్చినవారందరు కలసి తత్వసమాలోచనము చేయవలెను. తమ ఆచారవిచారములను పరిపూర్ణము చేసికొనవలెనన్నచో ఆధ్యాత్మిక సత్సంగమునందుండవలెను. ఇట్టి సత్సంగమును (Holy Communion) సమకూర్చునట్టి మంటపములు కావలెను.

మండే (తల) మాసిదడే మహామజ్జనవ (తలస్నానవ) మాడువుదు
వస్త్ర మాసిదడి మడివాళంగిక్కువదు
మనద మైలిగే తోళెయబేకాదడే
కూడల చన్నసంగయ్యన శరణర అనుభావ మాడువుదు (చ.బ.వ. 102)

నీరువిడిచి చేప నిలుచుటే చోద్యము
గణములలో నను పడవేయుమయ్యా ప్రభు!
శివశివ కూడల సంగమదేవా సెరగాడ్డి వేడెద. (చ.షవ.367)

ఈ మొయు నా యొడలి బెండును
గంజికి కొనువారు లేరయ్యా
నీ శరణుల భుక్తశేషమున
బ్రతికెదనయ్యా నేను, మేరుగిరి దాకిన
గాని బంగారు కాక దప్పదు
కూడల సంగమదేవా. (బ.షవ. 471)

కూడల సంగన శరణర ద్నషియవన
మేలె బిద్దవ జగజట్టి. (బ.షహ.వ 1189)

అయ్యా సజ్జన సద్భావర సంగదింద
మహానుభావర కాణబహుదయ్యా
మహానుభావర సంగదింద శ్రీగురువనరియబహుదు.
లింగవనరియబహుదు జంగమవనరియబహుదు
ప్రసాదవనరియబహుదు, తన్న తానరియబహుదు
ఇదు కారణ సద్భక్తర సంగవనే కరుణిసు
కూడలసంగమదేవా, నిమ్మ ధర్మ (బ.షవ. 881)

ఏకదేవోపాసకుడైన లింగాయతుడు తన ఇష్టలింగము తప్ప మరేమియూ ధరింపరాదు, పూజింపరాదు. కొందరు తమ ఇంటిదేవుడు, కులదేవుడు అని వేరు వేరు దేవతలకు నడచుకొనుచున్నారు. లింగాయతకు ఇంటి దేవుడని, కులదేవుడని ఏదియూ లేదు.

వీరభద్ర, నంది, మల్లికార్జుననెంబ దైవంగళిగే
నమ్మ కులదైవంగళెందు హేళువవరిగె
గురువిల్ల లింగవిల్ల పాదోదక ప్రసాదవిల్ల
కూడల చన్నసంగమదేవా (చ.బ.వ 226)

మరికొందరు పరశివుని పంచముఖములను చేసి స్థావరలింగముపైన, ఇష్టలింగముపైన ఉంచి పూజింతురు. ఇష్టలింగమునకు ఏవిధమైన మూర్తిత్వ కల్పన చేయుట తప్పు.

సద్యోజాత, వామదేవ, అఘోర
తత్పురుష, ఈశాన్యవెందు శివలింగద
మేలే పంచవక్త్రవ స్థాపిసువ అనాచారియ మాత కేళలాగదు
ఇంతప్ప లింగద్రోహియ తోరదిరయ్యా
సకల నిష్కలదంతహ లింగవు
కూడల చన్నసంగయ్యనల్లి సర్వాంగ
లింగి బసవణ్ణ బల్ల, (చ.బ,వ. 326)

శకున అపశకునములను నమ్మక మంచిముహూర్తము చెడ్డ ముహూర్తము, మంచి గడియ అని సంశయింపక తీర్థక్షేత్రాదులకు పోక బహిరంగముననున్న జడదైవతములను పూజింపక కుంభాభివేకము, సహస్ర బిల్వార్చనము మున్నగు స్థావరక్రియలను చేయక, పాలు, నేయి, తేనె మొదలగు పంచామృత నవామృతములను దేవునిపై పోసి నీటియందు ప్రవహించి పోవునట్లు చేయక తానున్నదే దేవాలయము, ఇష్టలింగమే సర్వస్వము, విశ్వమే పరమాత్ముని మహాలయము, అని నమ్మి భావశుద్దియే దేవుని తప్తిపరచు సాధనమని ఇష్టలింగమునందు మాత్రమే నిష్పగొని అత్మవిశ్వాసముతోనుండు లింగాచారియే నిజమైన లింగాయతుడు.

నూరారు సంప్రదాయముల మూఢతనపు ప్రభావమునకు లోనైన ఈనాటి సమాజము ధైర్యముతో స్వతంత్ర విచారణముతో శరణుల ఆచరణమును ఉపయోగించుకొనునట్టి ఆత్మవిశ్వాసమును ఏనాడు పొందగలదో చెప్పలేము. వివాహాదికార్యములను చేయునపుడు కూడా జ్యోతిష్య, పంచాంగ ముహూర్తములనుగూర్చి ఆలోచింపరాదను పద్దతి శరణులది.

లింగభక్తన వివాహదల్లి
శివగణంగళిగే విభూతి వీళయవకొట్టు
ఆరోగణెయ మాడిసీ
శివగణంగళు సాక్షియాగి ప్రసాదవన్నికువదే సదాచారవల్లదే
వార, తిథి, సుముహూర్తవెందు లౌకికద
కర్మవ మాడిదడె నిమ్మ సద్భక్తరిగె దూరవయ్యా
కూడల చన్నసంగమదేవా (చ.బ.వ. ii2)

శరణులైనవారికి లగ్న, విఘ్న, నవగ్రహముల బాధలేవియూ లేవను ఆత్మవిశ్వాసము కలవాడు మాత్రమే లింగాయతుడు.

లింగాయతుడు యజ్ఞయాగములు, హోమహవనములు దేవుని పేరిట ప్రాణివధ, పాలు, నెయ్యి మొదలగు ఆప్యాయన ప్రసాదములను అగ్నిలో వేయుట, పంచామృతము చేసి, దేవునిపై పోసి, నీటితో కడుగట మున్నగునవి చేయదగినవి కావు. ఇష్టలింగమును విడిచి, తనకంటె వేరైన స్థావర లింగమునకు రుద్రాభిషేకము, దీపారాధనము, రుద్ర పఠనము మున్నగు శైవ-వైదికపర కార్వములను చేబట్టరాదు. హింసారూపమైన కథయగు దేవీపురాణమును పఠింపరాదు. (ఆదిపురాణ అసురరిగే మారి. బ.షవ. 520) పౌరాణిక దేవతలైన విఘ్నేశ్వరుడు, సరస్వతి, లక్ష్మి - వీనిని బయటవుంచి పూజింపరాదు. ఏలననగా బ్రహ్మాండ ప్రభువైన పరమాత్మయే విఘ్నములను పరిహరింపగల, విద్యాప్రదానము చేయగల, సంపదననివ్వగల శక్తిని పొందినవాడు. నవగ్రహ స్థాపనము, నవగ్రహ పూజ, శనిమహాత్ముని పఠనము - మొదలగువానిని చేయనేరాదు. ఏమైననూ తన సుఖ-దుఃఖములనన్నింటిని “ఏన బేడిద్దనీవ” ఇష్టలింగమునకే నివేదించుకొనవలెను. కాబట్టియే సొడ్డళ బాచరసలు ఇట్లు చెప్పుచున్నారు.

గంగానదియల్లి మిందు గంజళదల్లి హోరళువరే?
చందనవిద్దంతే దుర్గంధవ పూసువరే?
సురభి మనెయల్లి కరెవుత్తిరె హరివరే సొణగనహాలింగే?
బయసిదమృతవిద్దంతే అంబిలవ నేరెదుంబ
భ్రమిత మానవనే నీను కేళా;
పరమ పదవియనీవ చెన్న సోడ్డళవిద్దంతే
సావ దేవర నోంతరే కావుదే? (సౌడ్డళబాచరశ - “శరణ చరితామృత” పుట- 424)

ఘనతత్వముగల ఇప్పలింగపూజను చేసి మరల ఇట్చి చిల్లర దేవతలను పూజించిన గంగానదియందు మునిగి బురదలో పొరలాడినట్లు అని శరణుల అభిప్రాయము. కావున లింగాయతుడు తిరుపతి మున్నగు క్షేత్రములకు పోయివెండ్రుకలిచ్చుట కొన్ని చోట్ల ముద్రాధారణము చేయించు కొనుట, తాయత్తులు, చీటీలు కట్టించుకొనుట తప్పు.

లింగాయతుని ఇంటి పూజామందిరమునందు ఏవిధమైన విగ్రహములు, మూర్తులు, స్థావరలింగములు వుండరాదు. తాను పూజకు కూర్చొను మందిరము స్వచ్చముగా, శాంతముగానుండవలెను. ఈ దిక్కు ఆ దికుయని ఒక ప్రత్యేకమైన దిక్కునందు పూజకు కూర్చొను పద్దతి తప్పు. అన్ని దికులందునూ పరమాత్మ వుండనేవున్నాడు. తన శరీరము పైనుండు ఇష్టలింగమును మాత్రమే పూజింపవలెను, అనుసంధానము చేయవలెను. అయితే ఈనాటి లింగాయతుల పూజామందిరమును చూడగా అది వివిధ దేవతల, భావచిత్రముల, విగ్రహముల ఒక సంగ్రహాలయము వలెనుండును. చేయిపెటుటకునూ చోటులేని దేవతలుందురు. ఇట్టివానినిగూర్చి బసవణ్ణగారు ఇట్లు చెప్పుచున్నారు.

లక్కత్తిని కరిగెడి దేవుని
మంట చూచి ముదురుకొను దేవుని
సరియనుటెట్టులయ్యా? ఆపదవచ్చిన అమ్ముడుబడు
దేవుని సరియనుటెట్టులయ్యా?
భయమున దిగజారు దేవుని యెట్లు సరియందునయ్యా ?
సహజభావ నిజైక్యుడు కూడల సంగమదేవుడొక్కడే దేవుడు. (బ.షవ. 557)

మనమే సృష్టించిన ఇటి దేవతలనెవరిని పెట్టి పూజ చేయరాదు, మనలను సృష్టిచేసిన దేవుని మాత్రమే పూజింపవలెను.

లింగాయతుడు మంగళమయుడైన దేవుని సదాకాలము దేహము మీదనే ధరించియుండుటవలన అతని కాయమే కైలాసము. కావున అతడు జనన సూతకము, మరణ సూతకము, జాతి సూతకము, రజసూతకము, ఉచ్ఛిష్ట సూతకము అను సాంప్రదాయికమైన పంచసూతకములను ఆచరింపరాదు.

గురుకారుణ్య కటాక్షదల్లి ఉత్పన్నవాద అజాతంగె
జాతిసూతక, జననసూతక, ప్రేతసూతక
రజస్సూతక, ఉచ్ఛిష్ట సూతకల్ల
ఉంటెంబవగె గురువిల్ల, లింగవిల్ల, జంగమచిల్ల
ప్రసాదచిల్లవయ్యా కూడలచన్నసంగమదేవా (చ.బ.వ. 130)

కానుపు అగునప్పుడు లింగము మైలయగునని స్త్రీశరీరమునుండి దానిని తీసి వేయుంచుట, సూతకమని ఆమెను తాకనీయకుండుట తప్పైన, ఆచరణములు. సూర్యుని చీకటిముంచివేయదు. కాంతిహీనుని చేయనేరదు. సూర్యుడు లేనప్పుడు మాత్రము చీకటి నిలిచియుండును. అట్లే మైలను పోగొట్టు లింగమును ఏదియూ అపవిత్రము చేయ నేరదు. తక్కువ జాతివారిని తాకి తాము అపవిత్రులమైతిమనునది, తక్కువ జాతివారికి అన్నము - నీళ్ళు ఇయుకుండట, మున్నగు జాతి సూతకములు తప్పు. లింగైక్యముచెందినప్పుడు చనిపోయినవారి యింటియందు సూతకమును ఆచరించుట, రజస్వల (ముట్టు) అయినప్పుడు లింగవంతులైన స్త్రీలను బయట ఉండునట్లు చేయుట, గురుప్రసాదమును తినునప్పుడు ఎంగిలియనుట - అన్నియు తప్పు. ఇవేవియు లింగాయతుని అంటవు.

జాతకర్మ, శుభకర్మ, ప్రేతకర్మవ
మాడువరు లోకద మనుజరు.......
ఈ పరియ మాడువనే శివభక్త? అదెంతెందడి
హుటిద మక్కళిగె లింగధారణే
నెట్టనె వివాహదల్లి శివగణంగళ ప్రసాద
దేవర పాదక్కె సందల్లి శివభక్తంగె
విభూతి విళెయంగోట్టు
సమాధి పూర్ణనం మాడువుదే శివాచార
లోకద కర్మవ మాడిదడే, ఆత భక్తనల్ల
లింగదూర, అఘోర నరకీయయ్యా
కూడల చన్నసంగమదేవా (చ..వ. 238)

లింగాయత ధర్మముయొక్క మఱియొక వైశిష్ఠ్యమేమనగా ధార్మిక స్వాతంత్యము. దేవుని నేరుగా ఏ పూజారుల బంధనము, దాక్షిణ్యము లేకుండ పూజించు స్వాతంత్యము కలది. నాలుగు గోడల ఆవరణమును కట్టించి, దానియందొక మూర్తిని నిలిపి కొందరిని లోపలికి వదలి, మరికొందరిని బయటకి తీసి, అట్లు లోపలికి వచ్చిన వారికి కూడ నేరుగా పూజించు స్వాతంత్యమునివ్వక (కేవలము కొన్ని దేవస్థానములందు కలదు) పైనుండి, దూరమునుండి, తీర్థ ప్రసాదములిచ్చుటయందు సమానతలేదని తెలిసిన బసవణ్ణగారు తమ తమ అంగముమీద దేవుని ధరించి పూజించు సదవకాశమును కల్పించిరి. పూజారియే మన పరముగా పూజింపవలెనను మూఢ విశ్వాసమును తొలగించిరి.

తన్నాశ్రయించిన రతి సుఖము
తాదిను భోజనము
వేరే మరిఒకనిచే చేయింపదగునే?
తన దేవునకు చేయు నిత్య నియమము
తాజేయవలెగానీ వేరొకనిచే చేయింపదగునే?
వృథా ఉపచారమునకు చేతురేగాని
నిన్నెట్లు తెలియనేర్తురు కూడల సంగదేవా. (బ.షవ. 183)

అని చెప్పిరి. తనకు ఆకలి అయినప్పుడు. తాను తినునట్లుగా తనకిష్టమయినప్పుడు భార్యాసుఖమును పడయునట్లుగా తన ఆత్మ దాహము అణగవలెనన్న తానే నేరుగా పూజింపవలెను. ఏరీతిగా దంపతులు దైహిక సంబంధమునకు మధ్యస్తుల ఆవశ్యకత లేదో అట్లు దేవ భక్తుల కూటమునందు, ఏ పూజారి మధ్యస్థికత అక్కరలేదు. నేరుగా దేవుని పూజించి, నేరుగా కరుణను పడయుటవలన ఆత్మవిశ్వాసము అపారముగ పెరుగును. ఇటు ఈ వచనమునందు దేవాలయ పద్దతిని, పూజారిపద్దతిని బసవణ్ణగారు ఖండించుచున్నారు. సాంప్రదాయిక ధర్మమందు స్త్రీ శూద్ర జాతిది. ఆమెకు నేరుగా పూజించు హక్కు లేదు. భర్త పూజించినచో అతని సేవను ఈమె నిష్ఠతో చేసిన అప్పుడు ఆమెకూ ముక్తివచ్చును. ఈ విచారమును బసవణ్ణగారు పై వచనమునందు ఖండించుచున్నారు. ఆత్మచైతన్యము సాధనాత్మకమైన దేహము కల ప్రతియొక్కడూ పూజింపవలెను. ఆధ్యాత్మిక ముక్తిమార్గము చాలా క్లిష్టమయినది. ఒకొక్కర్లే పోవలేను, ఒకని సాధనవలన ఇంకొకరు పోవుటకు వీలు కాదు. అయినచో పతిసేవవల్లనే సతి పుణ్యగతి పొందుననునది అసత్యమా? ఇది ఏకముఖ సత్యము. ఆమె పుణ్యగతిని పొందవచ్చును. ముక్తిని కాదు. భర్తయే దేవుడుని సేవ చేయుట నీతి. దేవుడే పతియని భావించుట ఆధ్యాత్మము - నీతివలన పుణ్యస్వరముల లభ్యత. ఆధ్యాత్మవలన ముక్తియొక్క లభ్యత. కాబట్టి ముక్తియభిలాషగల వారందరూ నేరుగా పూజించి భవసాగరమును దాటవలెను.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous లింగ- (ఇష్టలింగము) లింగాయత తత్వశాస్త్రం (Lingayat Philosophy) Next