Previous లింగాయత ధర్మసంస్కారము: ఇష్టలింగధారణము బసవాచారము - ధర్మగురునిష్ఠ Next

భృత్యాచారము (సమాజ సేవ Social Service)

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

వ్యక్తికంటెను సమాజము శ్రేష్ఠము. సమాజ - రాష్ట్రముల హితమునకై వ్యక్తి స్వయముగ భృత్యుడై, సేవకుడై, కింకర భావముతో సేవచేయవలెను.

నాకన్న చిన్నలు లేరు
శివభక్తులకన్న పెద్దలు లేరు
నీ పాదమే సాక్షి, నా మననే సాక్షి
హడల సంగమదేవా నాకిదే దివ్యము (బ.షవ 334)

క్రింద పడుటకేగాని పైబడనొల్లనయ్యా
క్రింది క్రేపునకే ఆపు పాలిచ్చు
వైబడి నరకాన పోలేను
నీ శరణుల చరణాల కడ
పడవేయుమయ్యా కూడల సంగయ్యా (బ.షవ 359)

మనుష్యడు వినయముతో తనను తాను తగ్గించుకొనుకొలది వ్యక్తిత్వమునందు పెద్దవాడగును. మాగినకొలది వరికంకి వంగుచున్నది. అట్లే ఉన్నతి పక్వమైనకొలది వ్యక్తి వినయపూర్ఖుడగును. సేవ చేయువాడు స్వామియే కాని చేయంచుకొనువాడు కాడు అను సమాజసేవాసూత్రముగల భృత్యాచారియే లింగాయతుడు. బసవణ్ణగారు ఇట్లు చెప్పుటలో వినయముతోబాటు “నేను ప్రధానియైనను సమాజమునకు (శరణుల పాదములకు మాత్రము నేవకుడుగానే) ఉండగోరుదును” అను ఘనతత్వము ఇమిడియున్నది.

రావయ్యా బసవా, మర్త్యలోకమున భక్తులుండిరే చెప్పమన
ఎవరూ లేరయ్యా ఎవరూలేరు
మఱి యెవ్వరూ లేరయ్యా. నేనొకడనే భక్తుడ;
మర్త్యలోకమందున్న జంగమ లింగ భక్తులందరూ
నీవేనయ్యా కూడల సంగమదేవా (బ.షవ 891)

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous లింగాయత ధర్మసంస్కారము: ఇష్టలింగధారణము బసవాచారము - ధర్మగురునిష్ఠ Next