Previous సదాచారము (బసవాచారము - ధర్మగురు నిష్ఠ) లింగాయత- నీతి శాస్త్రము Next

కరుణోదకము (పాదోదకము) - ప్రసాదము

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

గురు - లింగ - జంగమములను పూజ్య వస్తువులను, విభూతి - రుద్రాక్షి - మంత్రములనేది సాధనములతో పూజించినప్పుడు భవము తొలగిపోవుటకు సాధకముగ దొరకు ఫలములేవనగా కరుణోదకము (పాదోదకము), ప్రసాదము విద్యుతసారమునకు తంతియొకటి మాధ్యమమగునట్లు పాదోదక ప్రసాదములు గురుకరుణ ప్రసరించి వచ్చుటకు మాధ్యమమగుచున్నవి. నేటికి గురువుయొక్క అంతఃకరణ కృపారనము కలసినప్పుడు అది "కరుణోదకముముకాగ" (ఇష్టలింగము పై వెసి పట్టుకున్న నీరు) పదార్థమునకు అనుగ్రహము కలసినప్పుడు అది "ప్రసాదమ" గును. ఈ జగత్తునందు ఉపయోగించుకొను వస్తువలన్నియూ దేవునికి అర్పించునదియే నైవేద్యము. దానియందు అతని కారుణ్యరసము ప్రవహించి అది మనకు ఒదగివచ్చినప్పుడు ప్రసాదమగును.

అయితే సరియైన ఆధ్యాత్మిక కల్పనలేని, లింగాయత ధర్మ శాస్త్రమును సరిగా అభ్యసింపని కొందరు మూఢులు జంగమత్వమును ఒక జాతికి సంబంధింపచేసి, పాదోదకప్రసాదములు ఇచ్చువారియందు యొగ్యత లేక పోయియున్ననూ వారినుండి యాంత్రికముగ పాదోదక ప్రసాదములను స్వీకరింతురు.

క్రియాచారవిల్లద గురువిన కైయింద
దీక్షె, ఉపదేశవ కొళ్ళలాగదు,
క్రియాచారవిల్లద శిలెయ లింగవెందు పూజిసలాగదు.
క్రీయాచారవిల్లద భూతప్రాణిగళల్లి
జంగమవెందు పాదోదక ప్రసాదవ కొళలాగదు.
ఇంతప్ప ఆచారవిల్లద, అనాచారవ బళసువ
దురాచారిగళల్లి ఉపదేశవ పడెదు
పాదోదక ప్రసాదవ కొండవంగే అఘనాస్తియాగదు
ముందే అఘోరనరక తప్పదు కాణా
కూడల సంగమదేవా (బ.ష.హె.వ. 1123)

సదాచారము, సత్క్రియ లేనివాడు ఏజాతివాడు కాని గురువు కాడు. చిత్కళ లేకుండ అంగడియందుకొని ధరించినది లింగముకాదు. సద్వత్తులు లేనివాడు జంగముడు కాడు. కేవలము, జాతీయాధారముగ వారినుండి దీక్షపొంది పాదోదక ప్రసాదములు స్వీకరింపరాదు. ఇట్లు తీసికొన్న పాపము తొలగిపోదు. అంతే కాక "ఇంకనూ ఎక్కువగా వచ్చిచేరును. ఇచ్చువారియందు ఏ శక్తి సంచయమయియుండునో అది దుష్టశక్తియే కాని తపశ్శక్తియేకాని కరుణప్రసాదమును తీసికొన్న సాధకునకు ప్రసరించివచ్చును. దుశ్చటము దుర్గుణములతో కూడినవానినుండి పాదోదక ప్రసాదములను స్వీకరించినచో అతడు లింగదీక్షను పొంది తపశ్శక్తిని పొందియున్నచో సత్య సదాచారియైయున్నచో అతడే జంగముడు. అతనినుండి కరుణప్రసాదమును లింగాయతుడు నిస్సందేహపూర్వకముగ స్వీకరింపవచ్చును.

మంచిజంగములు ఆధ్యాత్మిక శక్తిమంతులు ఈ కాలమునందు దొరకుటయే కష్టము. అభ్యాసమునకు వ్యవహారమునకు వ్యక్తి పరదేశ ప్రవాసము చేయవలసివచ్చును. అచ్చట అంతటి గురుజంగములు ఎటు దొరకగలరు. అటి కాలమునందు సంబంధాచరణము చేసికొనవలెను. గురుజంగములను చేర్చి ప్రత్యకముగ పాదములను పూజించి పాదోదక ప్రసాదములను స్వీకరించుట సహజాచరణము, వారు లేనప్పుడు గురువొసంగిన ఇష్టలింగమునందే గురుజంగములను భావించుకొని గురు-లింగ-జంగమ పాదోదకమని మూడుసార్లు ఇష్టలింగముపై పోసి స్వీకరించుట సంబంధాచరణము, యోగ్యులైన గురుజంగములు దొరకనప్పుడు సంబంధాచరణమునే చేసికొనుట మంచిది.

ఈ ప్రసాద తత్వమునందు ఆప్యాయన ప్రసాదమును చెడుపరాదను అత్యున్నత ఆచరణగలదు. తనకు కావలసినదానికంటే ఎకువగ భుజించుటకాని, ఎక్కువనని తటయందు విడిచిపెట్టుటకాని, తటయందు విడిచిపెటుట శ్రీమంతుల గౌరవలక్షణమను ఆధ్యతనుగాని శరణులు ఒప్పుకొనక దానిని ద్రోహమని ఖండించుచున్నారు.

ఉండు ఉళిసదే కొండు మరళదే
తుంతుర్వని హీరదే, ద్రవగుందదే
లింగనిరీక్షణి తప్పదే, మంత్రధ్యాన మరెయదే
సావధానదిం ఈ సప్తవిధ భక్తి హిడిదు
త్రివిధప్రసాదవ త్రివిధ లింగక్కే అర్పిసువల్లి ఎచ్చర

ప్రసాదమును స్వీకరించు వ్యక్తి వేయించుకొన్న ప్రసాదమును ఏ కారణముచేతనయినను తట్టయందు విడిచి బయట చల్లుట ప్రసాదమునకు అపచారము, రాష్ట్రీయ నష్టము, అటు చేసినట్టివారు కోతులు అని సర్వజ్ఞుడు పిలుచుచున్నాడు

లింగప్రసాదవను అంగక్కె కొంబువరు
గంగాళదొళగె కైతొళెదు చెల్లువ
మంగగళ నోడా సర్వజ్ఞ

మితిమీరి వాంతియగునట్లు తినరాదు. భుజించునప్పుడు చుట్టుముట్టు ఎగురరాదు, చల్లరాదు, ఇటు సావధానముగ మంత్రధ్యానముచేయుచు భుజించి, (ప్లేట్ లో) తట్టయందు నీరు పోసి కడిగి ఆ నీటిని కూడ తాగవలెను అని శరణులు వేసిన నియమమందు ఘనమైన రాష్ట్రీయ మానవీయ ప్రజ్ఞయున్నది.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous సదాచారము (బసవాచారము - ధర్మగురు నిష్ఠ) లింగాయత- నీతి శాస్త్రము Next