Previous లింగాయత తత్వశాస్త్రం (Lingayat Philosophy) లింగాయత ధర్మసంస్కారము: ఇష్టలింగధారణము Next

గణాచారము (దుష్ట శిక్షక, శిష్ట రక్షక )

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

తన అంతరంగ - బహిరంగములందుండవలసినవగు వైయుక్తిక సామాజిక అనిష్టములకు విరుద్ధముగ ఆత్మవిశ్వాసముతో పోరాడివానిని నిర్మూలించి సత్యసామ్రాజ్యమును, కల్యాణరాజ్యమును (Kingdom of God) స్థాపించు నిష్ఠయే గణాచారము.

దొర్జన్యమును సౌజన్యముతోను, హింసను అహింసతోను, ద్వేషమును ప్రేమతోను, ఆత్మనైర్యముయొక్క అస్త్రమును పట్టిగెలుచునదే గణా చారము. ఇది క్రౌర్యముకాదు, శౌర్యము, దౌర్జన్యము కాదు, ధైర్యము. ఇందు సమాజమును దిద్దునట్టి చైతన్యమున్నది. వినయ వీరత్వముల కలయిక ఉన్నది. వీరత్వములేని వినయము పిరికితనము, వినయములేని చీరత్వము క్రూరతనము, కావున ఇవి రెండును సమన్వయము కావలెను.

సమాజమునందు అనేక అన్యాయములు, అత్యాచారములు. జరుగుచుండును. జాతీయత, ఆర్థిక అసమానత, సామాజిక శోషణము మున్నగునవి. వానిని పిరికితనముతో సహించుకొనియే పోయిన చో సమాజము నరకసదృశమగును. అప్పుడు కొంత మందియైనను ధైర్యముతో పోరాడవలసివచ్చును.

కూటికై గొల్పు కూలివాడగాను
కష్టములకు నిల్చు భటుడనయ్యా
పనిచెఱచి పరుగిడు భటుడగానయ్యా
వినుమొ స్వామి, మరణమే మహానవమి. (బ.షవ. 697)

మరణమునకు, సమాజముయొక్క_నిందకు - మాయకు భయపడక వోరాడునది గణాచారము. ఇంతటి తత్వనిష్ఠ - సత్యశోధక గణా చారియే నిజమైన లింగాయతుడు.

సమాజమునందు కనబడుచుండు "ముళ్ళావిగె కాయక" (చెడ్డ దారిపట్టిన వానికి బుద్ది చెప్పి, మంచి మార్గమునుకు అతనిని తీసుకురావాలని అతని ఇంటి ముందు ముల్లు మంచం (nails stool) మీద నిలబడతారు మరియు సత్యాన్ని గురుతు చేసి వారిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు.), "తెక్కెయ కాయక" ములే ఆనాటి గణాచారతత్వ ప్రతీకములగుచున్నవి.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous లింగాయత తత్వశాస్త్రం (Lingayat Philosophy) లింగాయత ధర్మసంస్కారము: ఇష్టలింగధారణము Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys