Previous గణాచారము (దుష్ట శిక్షక, శిష్ట రక్షక ) భృత్యాచారము (సమాజ సేవ Social Service) Next

లింగాయత ధర్మసంస్కారము: ఇష్టలింగధారణము

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

ఇష్టలింగమును వ్యక్తి గురువు మూలకముగనూ మంత్రోపదేశముతోనూ పొందవలెను. తనంతటతానే శరీరముపై దాల్చినవాడు సామాజికమైన అర్థమునందు మాత్రమే లింగవంతుడగును. ధార్మికముగను - ఆధ్యాత్మికముగను లింగాయతుడు కావలెనన్నచో ఆ ఇష్టలింగమును గురువు మూలకముననే పొందవలెను ఆజ్ఞానియైన మానవుడు జ్ఞానియైన శరణుడగుటకు అతనికి సంస్కారము కావలెను. ధర్మము వచ్చుట జన్మతోకాదు, సంస్కారమువలన.

వైద్యకీయ పరీక్షయందు ఉత్తీర్ణుడుకాక కేవలము వైద్యుని కుమారుడయనంత మాత్రమున వైద్యుడని చెప్పుకొనట ఎటు హాస్యాస్పదమొ అట్లే సంస్కారము లేక జన్మలో మాత్రమే లింగాయతుడనుట హాస్యాస్పదము.

బీదియ బసవంగే దేగులద పశువిగే
హుట్టిద కరు హోరిగళు బసవగళప్పవే?
లింగముద్రియ ఒత్తదన్నక్క
భక్తంగే భక్తాగే హుట్టిద మక్కళేందడె
గురుకారుణ్యదింద లింగధారణవిల్లదిర్దడె భక్తరప్పరే?
అవరగొళగిట్టుకొండు నడెదడె భక్తిహీనరెనిసిత్తు
కూడలచన్నసంగమదేవ. (చ.బ.వ. 424)

కావున ఈ ధర్మము మేరకు మానవులందరూ పుట్టుకతో భవులు; గురువుయొక్క అనుగ్రహమువలన భక్తులు శరణులు అగుదురు.

లింగ సంస్కారమునందు రెండు విధములు కలవు. ఒకటి లింగధారణము, మరియొకటి లింగదీక్ష. స్త్రీ గర్భవతిగానున్నప్పుడే ఏడెనిమిది నెలలున్నప్పుడు బిడ్డకొరకు మంత్రోపదేశము చేయింపవలెను. తల్లియొక్క ఆహారవిహారములన్నియూ బిడ్డపై పరిణామము కల్గించుటవలన ఆధ్యాత్మిక సంస్కారము కూడా పరిణామమునుకల్గించును. ఈ విధానము సాధ్యము కాకపోయిన బిడ్డ జన్మించిన తరువాతనయిననూ లింగధారణము తప్పక చేయింపవలెను.

హుట్టిద శిశువింగే లింగధారణవ మాడదే
తాయ మొలేహాలు జేనుతుప్ప.
ముట్టిసదిహుదే ఇప్పత్తనేయ ఆచార (చ.బ.వ. 112 )

చన్నబసవణ్ణగారు తమ ఇంకొక వచనమునందు ఈరీతిగా చెప్పినారు.

శివభక్తర శిశు ధరణీయ మేలె బిద్దాగలె
విభూతియ పట్టవకట్టి, కొరళల్లి లింగసాహిత్యవమాడి
పాదోదకదల్లి జళకవ మాడిసువుదు
ప్రసాదదెణ్ణె, బెణ్ణెహాలనెరెదు సలహువుదు ఆచార,
మతావ భూతశాంతియ మాడలాగదు. (చ,బవ.399)

పుట్టినవెంటనే సంస్కారము చేయించుటకు అవకాశము కలుగకున్నచో పదునొకండువ దినముననయినను సంస్కారమును తప్పక చేయించవలెను.

రెండవ సంస్కారమనగా లింగదీక్ష, ఆడబిడ్డ కాని మగబిడ్డ కాని - ఏ భేదమును లెక్కింపక వారికి గురువుయొక్క అనుగ్రహమును కలుగ చేయవలెను. బిడ్డకు బుద్ది వచ్చి, తన పూజాది కార్యములను తానే చేసికొనుటకు పదుమూడు పదునాలుగు సంవత్సరములయిననూ కావలసియుండును, ఆ వయస్సు వచ్చినప్పుడు లింగదీక్షను చేయింపవలెను. దీక్షలేక మొక్షము లేదు (చ.బ.వ. 46-115). దానిని పడయుట ఆద్యకర్తవ్యము. లింగధారణము నిశ్చయకార్యమువలె; లింగదీక్ష, లగ్నకార్యమువంటిది. కేవలము వధూవరులను ఏర్పరచుకొనుట నిశ్చయకార్యము. వారు - సామాజికముగ కలసియుండుటకు ఇంకనూ అవకాశముండదు. అట్లే ఈ వ్యక్తి ఇట్టి ధర్మయొగముల అనుయాయి అని ఘోషించుట లింగధారణములోనే. స్వయముగ లింగపూజలు చేసి దాని ఆనందమును పడయుటకు సాధకమయినది . లింగదీక్ష. నిశ్చయకార్యమునందు బిడ్డలను ధారపోయుటకు తల్లితండ్రులు. ఒప్పుకొందురు. లగ్నమునందు వధూవరులే నేరుగా కలిసికొందురు. అట్లే లింగధారణా సందర్భమునందు బిడ్డపరముగా తల్లితండ్రులు ప్రతిజ్ఞను స్వీకరింతురు. లింగదీక్షయందు స్వయముగ పరిపక్వత సాధించిన వ్యక్తియే ప్రతిజ్ఞాబద్దుడగుచున్నాడు. తననమ్మకమును ఆచరణమును వ్యక్తి సామాజికముగ లింగదీక్షయందు ఘోషించును. తనతల్లితండ్రులు తీసికొన్న ప్రతిజ్ఞలను స్థిరీకరింతురు. లింగదీక్షకు తాత్త్విక యొగిక మనోశాస్త్రీయ, సామాజిక, అర్థసంపదులు కలవు. లింగాయతులందరూ పదునాలుగు పదునైదవ వయస్సునకు సద్గురువువలన దీనిని తప్పక పడయవలను.

లింగదీక్షయనగా గురుకారుణ్యమును పడయుట మరియు లింగాంగి సంబంధియగుట.

దీయతే లింగసంబంధః క్షీయతే చమలత్రయం
దీయతే క్షీయతే యస్మాత్ సాదీక్షీతి నిగద్యతే

(శివానుభవ సూత్ర పరిచ్ఛేద 5.28) మగ్గెయమాయిదేవరు

స్థూల, సూక్ష్మ్ కారణములను తనుత్రయమునందుండు కార్మిక, మాయా, ఆణవములను, మంత్రయుములను పోగొట్టి, ఇష్ట ప్రాణ, భావ లింగములను క్రియామంత్ర, వేధాదీక్షలతో సంబంధింప చేసి లింగాంగ సామరస్య మార్గమువైపున నడచునట్లు చేయునటి ధార్మిక సంసార్లమే దీక. దీనిని తీసికొన్నప్పుడు మాత్రమే తాను పరమాత్ముని వైపు తిరిగి కొన్నట్లు వ్యక స్థిరీకరించును. ధర్మగురువుయొక్క తత్వములను ఆచరించునుటను ఒప్పుకొన్నట్లగును. విశిష్ట ఆచార వీచారములుగల సమాజముయొక్క ఒక అంగము అనుటను చూసినట్టుగును. "Turning towards God. Turning towards Basava and joining the Holy Fellowship"

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous గణాచారము (దుష్ట శిక్షక, శిష్ట రక్షక ) భృత్యాచారము (సమాజ సేవ Social Service) Next