Previous విభూతి - రుద్రాక్షి - మంత్రము శివాచారము (సామాజిక సమత) Next

లింగాయత సిద్ధాంతము

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

సిద్ధాంతము ధర్మమునకు జీవము. అది జగత్తును జీవనమును చూచునట్టి విశిష్ట దృష్టికోణమును పెంచును. సిద్ధాంతమునందు జగత్తును అబద్ధమని చెప్పువాడు జీవనముయొక్క అనేక సత్యములను అసత్యమని చెప్పవలసివచ్చును. కేవలము ఆధ్యాత్మిక మౌల్యమును మాత్రమే సత్యమని చెప్పు సిద్ధాంతము మిగిలిన మౌలమునకు విలువనివ్వక వైజ్ఞానిక ప్రగతికి ఆటంకమగుచున్నది. దీనిని తెలిసికొన్న శరణులు జగత్తు సత్యము అను విచారధారను సమర్థింపగోరుచున్నారు.

లింగాయతుడు సైద్ధాంతికముగ పరమశివుడు, పరాశక్తి, పురుషుడు, ప్రకృతి అను నాలుగు తత్వములను సత్యమని అంగీకరించును. మన ఈ పిండాండమునకు (శరీరమునకు) ఏరీతిగా తల్లితండ్రులున్నారో అట్లే బ్రహ్మాండమునకు పరశివపరాశక్తులు పితృ-మాతృ తత్వములని ఒప్పుకొనును. పరశివపరాశక్తులనగా ఇద్దరూ పౌరాణిక వ్యక్తులు కాదు. నిమిత్త ఉపాదానకారణములగు రెండు తత్వములు అని అవినాభావ సంబంధముతోనుంది. ఈ జగత్తుయొక్క నిర్మాణమునకు కారణమగుచున్నవి.

శివశక్తి సంపుటంబుదెంతు హేళిరణ్ణ
శివనే చైతన్యాత్మకను శక్తియే చిత్తు
ఇంతు చైతన్యాత్మకనే చిత్స్వరూపనేందరియ బల్లడె
ఆతనే శరణ గుహేశ్వర

బ్రహ్మసత్యము, జగత్తు మిథ్య అను అద్వైత సిద్ధాంతమును త్రోసివైచి పరమాత్మనుండి వెలువడిన చైతన్యముతో నిండిన ఈ జగత్తు సత్యము మాత్రమే కాదు; దివ్యమూ ఔను అని ఈ శక్తివిశిష్టాద్వైత సిద్ధాంతము చెప్పుచున్నది.

ఆ లింగదిందోగెద దేహేంద్రియ మనఃప్రాణాదిగళల్లి
ఆ లింగద ఉపకరణంగళాద కారణ
ఆ మనః ప్రాణాదిగళెల్ల ఆ పరవస్తువిగే భిన్నవెంబ
అజ్ఞానియ మెచ్చ కొడల చన్నసంగయ్య (చ.బ.వ. 5)

పరమాత్మ ఈ సృష్టికి అభిన్న నిమిత్తోపాదాన కారణమైయున్నాడు. ఏ రీతిగా సాలెపురుగు తనకంటె వేరుకానిది తనయందే అంతర్గతమైయున్న లాలాజలమునుండి జడమైనవలను నేసి, దానియందే లీలగా తిరుగుచు, చైతన్యమయమైన పిల్లలను సృష్టించునో అట్లే పరమాత్మ తనయందు అంతర్గతమైయున్న పరాశక్తినుండి జడమైన జగత్తును, చైతన్యాత్మక జీవులను నిర్మించి, దీనికి పూర్తిగ అతీతుడైయుండక ప్రీతితో దానియందు తిరుగుచుండును. తనకు చాలైనప్పుడు ఈ జగత్తును లయముచేసి తన గర్భమునందు అణగియుండునట్లు చేసికొనును అను ఈ సిద్ధాంతమును లింగాయతుడు ఒప్పుకొనును.

కీటక సూత్రద నూల గూడమాడి సుత్తిర్పంతె
సూత్రక్కె నూలనెల్లింద తందిత్తయ్యా?
రాటెయిల్ల అదక్కె హంజి మున్నవే ఇల్లు నూతవరారో?
తన్నొడల నూల తెగైదు పసరిసి అదరోళు
ప్రీతియిందొలిదాడి
తుదియల్లి తన్నోళగద మడగికొండప్పంతే
తన్నిందాద జగవ తన్నొళగైదిసికొళ్ళబల్ల
నమ్మ కూడల సంగమదేవరు (బ.షహె.వ. 993)

ఈ వచనమునందు బసవణ్ణగారు పరమాత్మ ఎట్లు ఈ జగత్తుయొక్క సృష్టికి కారణుడైయున్నాడనుదానిని సూత్రరూపముగ చెప్పియున్నారు.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous విభూతి - రుద్రాక్షి - మంత్రము శివాచారము (సామాజిక సమత) Next