Previous శివాచారము (సామాజిక సమత) సదాచారము (బసవాచారము - ధర్మగురు నిష్ఠ) Next

షట్ స్థల దర్శనము

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

కాలికి పాపముగుండును కట్టుకొని కంఠమునందు పుణ్యముచెండును బిగించుకొని భవసాగరమునందు తేలుచు మునుగుచునుండు బద్దజీవి సుఖదుఃఖములనన్నింటిని గెలిచి, జనన - మరణ జంజాటమునుండి దాటుకొని నిత్యమైన సుఖమును అనుభవించు సిద్దస్థితిని పొందతగినదైన లింగాంగయోగ మార్గమునందు పోవునప్పుడు, అతడు ఆరు మెట్టులు దాటి వచ్చును. అవే షట్ స్థలములు. కొండనెక్కుటకు ఉండు మార్గము లింగాంగయొగముకాగా, షట్ స్థలములు దారియందువచ్చు విశిష్ఠమైన మెట్టులగుచున్నవి. భక్తుడు, మహేశుడు, ప్రసాది, ప్రాణలింగి, శరణుడు, ఐక్యము - ఈ ఆరు స్థలములములు అలవరచుకొన్న వ్యక్తి మహాజంగముడై సర్వాంగ పరిపూర్ణ వికాసమును సాధించియుండును. క్రియా-జ్ఞాన-భావములు అను మూడు శక్తులు పూర్ణముగ చిగురించియుండును. వాని వివరణను కొన్ని మాటలయందు మాత్రమే చెప్పెదను.

ఉపాసకుడైన అంగుడు (పరిశుద్దాంతకఃకరణావృత ఆత్మ) ఉపాస్య వస్తువగు లింగుడగుటకు వీలైన ఆరోహణమార్గమే ఈ షట్ స్థలము. ఉపాసన లేక భక్తియే జీవముగానుండు ఈ దర్శనమునందు అంగ-లింగుల నడుమనుండు విన్నత - ద్వైతభావము కరగునంతవరకు భక్తి ఒకొక్క మెట్టు వృద్ధియగుచు లింగాంగ సామరస్యమునకు సాధనమగుచున్నది. ఈ దర్శనము ఆరు విధములుగ సాధకుని మనోవికాసమును చిత్రించు కారణముగా దీనికి షట్ స్థలము అను వేరు వచ్చినది.

విశ్వాసదింద భక్తనాగి,
ఆ విశ్వాసదొళగణ నిష్థెయిం మహేశ్వరనాగి,
ఆ నిష్థెయొళగణ సావధానదిం ప్రసాదియాగి
ఆ సావధానదొళగణ స్వానుభావదిం ప్రాణలింగియాగి,
ఆ స్వానుభావదొళగణ అరివినిం శరణనాగి
ఆ అరివు నిజదల్లి సమరస భావనైదిర్దడె
అదే ఐక్య స్థల గుహేశ్వర - (అల్లమ ప్రభుదేవ )

భక్తనాదడే తనుమన ధనదాసెయనళిదిరబోకు,
మహేశ్వరనాదోడె పరధన, పరచింతె, పరాంగనెయర ఎడియళిదుళిరబేకు.
ప్రసాదియాదోడె సుఖ రుచియవగ్రాహవం మరేద ప్రసాద
ఘట వళియదే ఉళిదిరబోకు.
ప్రాణలింగియాడె ఘటదాశెయ తోరెదు
ప్రాణలింగదొళగె బెరసి బేరిల్లదిరబోకు.
లింగైక్యనాదొడె ఆప్యాయనదేయడగి
సుఖదుఃఖమం తాళదే నిర్భాంతనాగిరబేకు.
ఇంతి షటస్థలవారీగేయూ అళవడదు
గొడ్డళదేవను షటస్థలద భక్తియను
బసవణ్ణంగె మూర్తియ మాడిదను. (సొడ్డ ళ బాచరసు)

అజ్ఞానాంధకారమునందు పరుండి గాఢనిద్రయందుండు వ్యక్తికి ఉన్నదున్నట్లే పూర్వ సుకృతము నిండివచ్చి మెలుకువయగును (awakening). అప్పుడు నేనెవరు అని ప్రశ్నించి “పిండస్థళ” మునకు వచ్చును. తరువాత నాకునూ పరమాత్మకునూ సంబంధమేమి కలదు అని ప్రశ్నించి “పిండజ్ఞాన” స్థలమునందు నిలుచును. స్వరూపత: నేను ఆత్మయని దేహము కాదని తెలిసిన పిదవ తన లౌకిక జీవన మౌల్యముల విషయమున జుగుప్ప వచ్చి కలవరపడి “సంసారహేయ స్థల” మునకు వచ్చును. గురువుననుగ్రహమునకై తాపత్రయపడి మేల్కొన్నప్పుడు గురుసూర్యుని ఉదయమగును. అప్పుడు గురువు ఇతనికి విభూతి - రుద్రాక్షి - ఇష్టలింగములను ధరింపచేసి పాదోదక ప్రసాదములతో అనుగ్రహమునిచ్చి మంత్రోపదేశము చేసినప్పుడు భక్తుడగును. అప్పుడతని ఆధ్యాత్మిక జీవనము ఆరంభమగును. గురు - లింగ - జంగమలందు అపారమైన శ్రద్ద. నిలిచి తను మన ధనములను అర్పించి గురు - జంగములయొక్కయూ సమాజముయొక్కయూ సేవకుడుతానను కింకరభావము, దేవునియందు శరణాగతి మున్నగుగుణములు అలవడినవాడు భక్తుడు. శ్రద్ధాభక్తి జ్ఞానములతో ఇంకనూ గట్టియై నిష్ఠాభక్తి కలవాడై కేవలము మూఢతనముతో కూడియుండక వివేచనా శక్తితోకూడి పరధన, పరసతుల యెడ మనస్సును కూడ చింతింపక సత్యశుద్ధ కాయకము చేయువాడు మాహేశ్వరుడు. తాను సత్య - శుద్ధుడై గడించు ప్రతియంశమును తాను ఉపయొగించు ప్రతి వస్తువునూ దేవునికి అర్పించి వచ్చిన సుఖదుఃఖములను నిందావందనములను అన్నింటిని అతనికి సమర్పించి తాను అర్పించుటయందు అవధానియై (vigilant) పరమతృప్తితో జీవనమును గడపువాడే ప్రసాది. అతని దృష్టికి జగత్తంతయూ దైవీప్రసాదము. అప్పుడతనియందు అనుభవ భక్తి అంకురించి మనస్సు అంతర్ముఖియగును. సత్య - శుద్ద కాయక- పవిత్ర జీవనముల ఫలముగ అంతఃకరణములన్నియూ పరిశుద్ధములైయుండుటవలన ఆత్మజ్యోతియొక్క ప్రకాశము కనబడనారంభమగును. ఈ ప్రాణలింగ లేక జ్యోతియొక్క ధ్యానమునందు తన్మయుడైన అతనికి బాహ్యవిచారములయెడ దృష్టి తక్కువగును. అప్పుడు అతని ప్రాణము స్వభావగుణములను తొలగించుకొని లింగమగును. అతడు పూజించు ఇష్టలింగమే అతని ప్రాణమగును. ఈ ఆత్మతత్త్వమునందు అతని భావము ఒకటయ్ స్వరూప సాహితార్థమును పొందును. పిండగతమైన ఆత్మను సాక్షాత్కారించుకొన్న అతని మనస్సు బ్రహ్మాండగత భావలింగమును లేక మహాలింగమును తెలిసికొనుటకు ఆశపడును. అప్పుడతడు తాను సతియనియూ పరమాత్మయే పతియనియూ తలచి అతని పాదమందు సంపూర్ణశరణుడగును. భక్తస్థలమునందు శరణుపొందినప్పుడు తనవస్తువులను అర్పింపగా ఇప్పుడు తననే అర్పించుకొనును. దైవభక్తుల నడుమ పతి - సతి సంబంధము గట్టి పడినప్పుడు దివ్యమైన ఆనందభక్తిని అనుభవించును. అప్పుడతనికి విషయ సుఖమునందు పంచేంద్రియ తృప్తియందు ఆసక్తి కూడ నిలువక దేవపతితో మధుర భక్తియందు మైమరచిపోవును. పరసతులను తల్లివంటివారని ఇంతవరకూ అనుచుండినవాడు ఇప్పుడు తన సతిని కూడ తల్లియను భావించు మానసిక స్థితిని చేరుచున్నాడు.

మడది ఎన్నలాగదు ఎన్నను బసవణ్ణ్ణనిగె
పురుషనెన్నలాగదు బసవణ్ణన ఎనగే
నాను బసవణ్ణగే శిశువాదే
బసవణ్ణ్ణనెన్న శిశువాద - నీలమ్మ

భవి సంగవళిదు శివభక్తనాద బళిక
భక్తంగె భవిసంగవతి ఘోర నరక
శరణ సతి లింగపతియాద బళిక
శరణంగె సతి సంగవతి ఘోర నరక
చన్నమల్లికార్జునా
లింగైక్యంగే ప్రాణగుణవళియదవర సంగవే భంగ .... అక్కమహాదేవి.

లింగపతి - శరణ సతుల సంబంధము సమీపించిన కొలది శరణుని భావము నిర్భావమై బాహ్యస్థితి అలవడును విశాలమైన బాహ్యస్థలమున పక్షియొకటి ఎగిరినప్పుడు బయటి విషయ పరిణామము కలుగినటు జీవనముయొక్క సుఖదుఃఖములేవియూ అతనిపై పరిణామమును కలిగింపనట్లు అతడు ఉన్నతుడగుచున్నాడు. బ్రహ్మాండగతమైన పరమాత్మ చైతన్యము ఓతప్రోతమూ నిండి ప్రకాశమైయుండుటను గ్రహించి ఆ మహాసాహితార్థమును పొందుచున్నాడు. పూజ్య - పూజక - పూజయను త్రిపుటిని దాటి నిలుచుచున్నాడు. అప్పుడతనియందు సమరస భావము, ఆత్మ తృప్తి అలవడడియుండును. ఇదే కడపటి స్థితి. వీరి ఆత్యంతిక అనుభవము లింగ - అంగ సామరస్యము.

షట్ స్థలముయొక్క_ఈ మనోవికాసము బహిరంగిక, ఆంతరంగిక విషయములన్నిటి మీదను పరిణామము కలిగించును. జగత్తును జీవనమును అతను చూచు దృష్టి అతడు వ్యవహరించు విధానము అన్నియూ దైవీమయమగుచున్నవి.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous శివాచారము (సామాజిక సమత) సదాచారము (బసవాచారము - ధర్మగురు నిష్ఠ) Next