లింగాయత- నీతి శాస్త్రము | గురువు - జంగముడు |
లింగాంగయోగం, త్రాటక యోగం, (శివయోగము) |
✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి
*మంత్రపురుష బసవణ్ణ్ణగారిచేత ఇవ్వబడి, శరణులు ఆచరించిన యోగమునకు లింగాంగయోగ (శివయొగ) మని పేరు, దానికి త్రాటక యొగమనియు వేరుగలదు. ఇష్టలింగమును పట్టుకొని దాని మూలకముగనే నిర్వికల్ప - చైతన్య సమాధిని పడయు సాధనయే లింగాంగయొగముయొక్క జీవము. శివభక్తి శివజ్ఞానము, శివధ్యానము, జీవక్రియ, శివార్చన అను ఐదు అంశములు సమావేశమగును. జ్ఞాన - భక్తి - క్రియలు స్వతంత్రముగ జ్ఞానయోగ, భక్తియొగ, కర్మయొగములై భారతీయ ధర్మపరంపరయందు రూఢియందు కలవు. కాని, శరణులు జ్ఞానములేని భక్తి, మూఢభక్తి భక్తిలేని జ్ఞానము, శుష్కజ్ఞానము, క్రియలేని భక్తి - జ్ఞానము నిరుపయొగము అని తెలిసి యోగియొక్కజీవనము సర్వాంగ పూర్ణమై పెరుగుట కావలెనన్న ఈ అంశములన్నియు ఉండవలెనని లింగాంగయోగమునందు వానిని ఉపయొగించిరి.
అష్టాంగయొగమునందు వచ్చు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారములను పూర్వార్ధమును ఎక్కువగా వాడుకొనక ఆవశ్యకమున్నంతమాత్రమే వాడుకొని, ఉత్తరార్ధమైన ధారణ, ధ్యాన, సమాధి అనువానిని యొగమునందు ఉపయోగించుకొని లింగాంగయొగమును శ్రీ సామాన్యలకును సులభసాధ్యమగునట్లు శరణులు చేసిరి. లింగాంగయొగమునందు మూడు అంతస్తులున్నవి. త్యాగాంగము, భోగాంగము, యొగాంగము అనునవి. ఈ మూడు అంతస్తులు, త్యాగాంగమునందు విషయత్యాగము, భోగాంగమునందు ప్రసాద భోగము, యొగొంగమునందు లింగయొగము. ఎంతవఱకు దైవానుగ్రహముయొక్క నీరు లోపలచేరదు. విషయములను త్యాగముచేసినపిదవ శివప్రసాదమును అనుభవింపవలెను. జగత్తునందలి సుఖ - దుఃఖములనన్నింటిని శివునికి నైవేద్యముగా అర్పించి ప్రసాదముగా స్వీకరించి “పరిణామి” కావలెను. అటుపైన మనస్సు, చిత్తాది కరణములన్నియు శివముఖములై సదా లింగయొగమునందుండవలెను. అప్పుడు శరణుడు లేచి కూర్చుండిన శివరాత్రి, నిద్రించిన జపము, అతడు చైతన్య సమాధియందుండును. ఇట్టి శరణుడు త్యాగాంగమందు ఇష్టలింగ సిద్ధిని పొందినచో భోగాంగమందు ఈ ప్రాణలింగసిద్ధిని యొగాంగమందు " భావలింగసిద్ధిని పొందును. త్యాగాంగమందు - కొన్ని నిమిషముల కాలము స్థిరముగ కూర్చుండలేని స్థూలశరీరము ఒక నియంత్రణకు లోబడి కొంతకాలమైననూ ఇష్టలింగపూజకు కూర్చుండు సహనమును గడించును. భోగాంగమందు నూరారు చోట్లకు పొరుగెత్తికొన్ని రుచులకు ఆశపడు మనస్సు, లింగ రుచులవైపు పొరుగెత్తి దేవునికి అంకితమై - ఏకాగ్రతను సాధించును. అప్పుడు సూక్ష్మమైన భావము యొగాంగమందు పరిశుద్దమై సదా లింగధ్యానమందు తన్మయమై పరమ తృప్తిని సాధించును. గురుపూసంగిన ఇష్టలింగమును ఎడమచేతియందుంచుకొని మజ్జనము, పుష్పార్చన, నైవేద్యార్పణముమున్నగు సద్వస్తువులతో పూజించుట ఇష్టలింగపూజ. హృదయ పీఠమునందు ఆత్మలింగమును మూర్తరూపముచేసి సద్గుణములను పరికరములతో మనస్సనేది చేతితో ధ్యానముఖముగ అర్పించునది ప్రాణలింగపూజ. బ్రహ్మండగతమైన పరంజ్యోతి స్వరూప పూర్ణమైన మహాచైతన్యము ఓతప్రోతముగ నిండుకొన్నందువలన సాధకుని భావము కూడ అంతటి చైతన్యమును గ్రహించి విశ్వమునందు నడచియున్న మహాపూజనుగూర్చి. అనుసంధానము చేసినప్పుడు అది భావలింగపూజ, భావలింగపూజను చేయుశక్తియే ఆత్యంతిక సిద్ది.
లింగాంగయొగముయొక్క అతిముఖ్యమైన తత్యమేమనగా కైలాసపదవికి, రుద్ర, ఇంద్ర, విష్ణు పదవికి ఆశపడుట కాదు. ఈ మర్త్యమందున్నప్పుడే సర్వాంగలింగత్వమును పడయట, సర్వాంగములూ పరిశుద్ధమై లింగగుణములను అలవాటు చేసుకొన్నది.
ఇంటి స్వామిని యింటసుద్ది నే మందునమ్మా?
అంగ విద్యనొల్లడు; కన్గొలకుల పుసీ తీక. చూడనీడు
కడగకనే చేతిని ముట్టనీడు; కాలు కడగకుండ కప్పనీడు
ఇట్లే సర్వాంగముల కడగిన కతమున స్వామి నను
కూడేనమ్మా (బ.ష. వ.909)
చనిపోయిన తరువాత మరల పునర్జన్మ పొందక లయము కావలెనన్నచో ఇప్పటి మర్త్యజీవితము సర్వాంగశుద్దము కావలెను. మనస్సు చైతన్య సమాధిస్థితిని పడయవలెను. ఒక యోగి నిర్వికల్ప సమాధియందు కూర్చున్నప్పుడు అతని మానసిక స్థితి ఎట్లుండునో అదే నిర్వికారస్థితి అన్ని అవస్థలయందునూ అలవాటుకావలెను. ఇంద్రియముల మూలముగా లోకముతో వ్యవహారించునప్పుడును ఆ నిర్వికార మనఃస్థితి అలవడిన అదియే చైతన్య సమాధి. అట్టి స్థితియందు శరుణుడు చేయు అన్ని వ్యవహారములు దేవపూజాక్రియయే, అందువల్లనే అక్కమహాదేవి ఇట్లు చెప్పుచున్నది
ఉసిరపరిమళవిరలు కుసుమద హంగేకయ్యా ?
శ్రమె, దయ, శాంతి సైరణియిరలు సమాధియ నిలువేకయ్యా?
లోకవే తానాద బళిక ఏకాంతద హంగేకయ్యా ?
చన్నమల్లికార్జునా (అ. వ, 98)
అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహము, చిత్తసమత, శాంతిగుణము ఇవియున్నప్పుడు జీవనమే సమాధియని అక్కమహదేవి అభిప్రాయము. ఇట్టి స్థితిని అలవాటు చేసికొనుటయే లింగాంగయొగముయొక్క గురి. మర్త్యమందు ఇంకనూవున్నప్పుడే శివయోగి మనస్సు, సకలవిధ వికారములు ఆటుపోటులు, సంకల్ప వికల్పములనుండి విడుదలకొంది. భావము బ్రహ్మాండగత మహాలింగముతో సమరసము పొందును. మృత్యువు ఈ శరీరమును ఆత్మనుండి విడదీసినప్పుడు, పరిశుద్దాంతఃకరణయుతమైన శుద్దాత్మ దేవునియందు ఒకటియగును. దీనిని చన్నబసవణ్ణ్ణగారు బహు మార్మికముగా చెప్పియున్నారు.
ఎలె శివనె, నిమ్మల్లి సాలవ కొండు
నిమ్మ శివపురవ హోగువనల్లా
పృథ్వీయ సాలక్కే పృథ్వియకొట్టు
అప్పువిన సాలక్కే అప్పువనే కొట్టు
తేజద సాలక్కే తేజవనే కొటు
వాయువిన సాలక్కే వాయువనే కొట్టు
ఇన్నారిగూ ప్రసాదవ కొడలిల్లవెందు
కూడల చన్నసంగమ దేవరల్లీ మోరెహొక్క శరణంగె
నమో నమో ఎంబె (చ.బ.వ 1279)
పరిశుద్ధమైన కళంకరహిత కర్పూరము సంపూర్ణముగ మంటలో కరగినట్లు ఆత్మ పరమాత్మయందు ఒకటియగును. ఇట్టి సంసార్లవాసనలు లేనివాడు కావున వేయించిన విత్తనమువలె ఈ సాధకుడు పునర్జన్మమును పొందడు. ఇట్లు సూక్ష్మాకాశగుణమును సంపాదించి, మహాకాశమునందు కలసి పోవునదే లింగాంగయొగముయొక్క లక్ష్యము.
Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.
లింగాయత- నీతి శాస్త్రము | గురువు - జంగముడు |