Previous ఇష్టలింగ స్వరూపం చుట్టి చుట్టి వస్తే లేదు లక్షగంగల్లో మునిగిన లేదు, మనస్సు శుద్ధి చేయాలి Next

ఏ కాయకం(ఉద్యోగం) చేసినా సమానం

ఏ కాయకం చేసినా ఒక్కటే కాయకం అయ్యా
ఏ వ్రతం అయినా ఒక్కటే వ్రతం అయ్యా
అపాయం తప్పితే చావులేదు, వ్రతం తప్పితే కూడలేదు
కాకపికాలవలె కూడడం నాయక నరకం
గంగేశ్వర లింగంలో - హాదరద మారయ్యగారి పుణ్యస్త్రీ గంగమ్మ/1374 [1]

కాయకంలో నిమగ్నమైనపుడు
గురు దర్శనమైనా మరచిపోవాలి
లింగపూజనైనా మరచిపోవాలి
జంగముడు ఎదుట నిలబడ్డా దాక్షిణ్యం చూపరాదు
ఎందుకంటే కాయకమే కైలాసం కనుక!
అమరేశ్వర లింగమైన కాయకం తరువాతే - ఆయ్దక్కి మారయ్య/1520 [1]

ఏయే జాతి గోత్రాల నుండి వచ్చినా
తమ తమ కాయకానికి, భక్తికి సూతకం ఉండకూడదు
ఏ వ్రతాలను స్వికరించినా
ఎదుటి దాక్షిణ్యం మరచి
తన త్రికరణ శుద్దిగా సాగాలి
పర పురుషార్దాన్ని మూగ అరిగించుకో(గలడా)
మేధావులు చెప్పారని అమంగళాన్ని కలపవచ్చా?
ఇలా క్రియలో భావశుద్ధుడై
భావంలో దివ్య జ్ఞాన పరిపూర్ణుడైన గురుచర భక్తునికి
చెన్న బసవని సాక్షిగా
కమలేశ్వరలింగము తానే అని భావిస్తాడు - అద్దం కాయకపు అమ్మిదేవయ్య/1615 [1]

కృత్య కాయకం చేయనివారు భక్తులుకాదు
సత్యం శుద్ధం కానిది కాయకం కాదు
ఆశ అనేది భవ బీజం
నిరాశ అనేది నిత్యముక్తి
ఉరిలింగ పెద్దిరేనిలో సరికాదు కనవమ్మా? - ఉరలింగపెద్దిగారి పుణ్యస్త్రీ కాళవ్వె/1298 [1]

నేమము చేసికొని భక్తుల ఇళ్ళల్లో దూరి,
కాయకం వదలి, ధనం బంగారం వేడడమనేది,
సద్భక్తునికి కష్టం కాదా?
ఆ గుణం అమరేశ్వరలింగానికి దూరం. - ఆయ్దక్కి మారయ్య/1524 [1]

కాణీ పనిచేసి వరహనిమ్మంటే
అది నిజమైన కాయకమయ్యేనా?
భక్తుల చేసినదానికి తక్కువ కొరడమే
అమరేశ్వరలింగానికి చిత్తశుద్ధ కాయకం. - ఆయ్దక్కి మారయ్య/1527 [1]

కందజేసి, కుందజేసి, బంధించి కనబడినవారిని బ్రతిమలాడి తెచ్చి
జంగమానికి చేశామనే కష్టపక్వాన్నం లింగానికి నైవేద్యంకాదు
తనువు కరిగించి మనస్సు శ్రమించి వచ్చిన జంగముని అనువు గ్రహించి
ఎడంలేక సంశయంలేక జంగమలింగానికి
దాసోహం చేసేది కాయకం
గుమ్మడికాయ అడవి ఆకుకూరైనా
కాయకంతో వచ్చింది లింగార్పితం
చన్నబసవన్న ప్రియ చందేశ్వర లింగానికి నైవేద్యం చెల్లింది -నులియ చందయ్య/1817 [1]

గురువైనా కాయకంచేతనే జీవన్ముక్తి
లింగమైనా కాయకంచేతనే రాతిగురుతు తొలగేది
జంగమమైనా కాయకం చేతనే వేషంయొక్క పాశం తెగేది
గురువైనా జంగమ సేవ చేయాలి
లింగమైనా జంగమ సేవ చేయాలి
జంగమమైనా జంగమ సేవ చేయాలి
చన్నబసవన్న ప్రియ చందేశ్వరలింగ జ్ఞానం ఇదే! -నులియ చందయ్య/1820 [1]

సత్యశుద్ధ కాయకం చేత వచ్చిన ద్రవ్యంలో
చిత్తం చలించకుండా ఉండాలి
నియమపరమైన కూలిలో నిత్య నియమంలో తప్పుండకూడదు
నియమమైన కూలిని వదిలి
హేమంపై ఆశతో కామించి ద్రవ్యాన్ని గ్రహిస్తే
తాను చేసే సేవ నష్టమయ్యా
నీ ఆశల వేషపాశానికి నీవే వెళ్ళు
నాకు మన జంగముని ప్రసాదంలోనే
చందేశ్వరలింగానికి ప్రాణమయ్యా -నులియ చందయ్య/1824 [1]

సత్య శుద్ధ కాయకమును చేసి తెచ్చి
వంచన లేక ప్రపంచమును మరచి
నిత్యజంగమ దాసోహమును చేయు
సద్భక్తుని హృదయంలో అచ్చొతినట్లున్నాడు
కామ ధూమ ధూళేశ్వరుడు! - మాదార ధూళయ్య/1938 [1]

ఏ కాయకమైనా నీవే చేసి
గురులింగ జంగముల ముందుంచి
సమర్పించి దయతో మిగిల్చింది స్వీకరించి,
తెగులు వస్తే పొగులు వేడి చేస్తే రగులు
జీవంపోతే చావు, దీనికంతా దేవుడి దాక్షిణ్యమెందుకు
బాపురే లద్దె సోమేశ్వరా/2025 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous ఇష్టలింగ స్వరూపం చుట్టి చుట్టి వస్తే లేదు లక్షగంగల్లో మునిగిన లేదు, మనస్సు శుద్ధి చేయాలి Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys