శరణుడు శరణుడిని చూచి ’శరణ’ని చేతులు జోడించడమే భక్తి లక్షణం (అభినందించడం)
|
|
ఎప్పుడొచ్చారు బావున్నారా అన్నంతనే
మీ ఐశ్వర్యం ఎగిరి పోతుందా?
కూర్చోండి అంటే నేలలో గుంత పడుతుందా?
వెంటనే పలుకరిస్తే మీ తల పగిలి పోతుందా?
పెట్టలేక పోయినా ఒక్క గుణమైనా లేకుంటే
ముక్కును కోయక వదిలేనా కూడల సంగమదేవుడు - గురు బసవన్న/112 [1]
పలికితే ముత్యాల హారంలా వుండాలి
పలికితే మాణిక్యపు కాంతిలా వుండాలి
పలికితే స్ఫటికపు శలాకలా వుండాలి
పలికితే లింగం మెచ్చి ఔనౌననాలి
పలికినట్లుగా నడవకుంటే
కూడల సంగమ దేవుడేట్లా దయ చూస్తాడయ్యా. - గురు బసవన్న/260 [1]
మాటన్నది జ్యోతిర్లింగం స్వరమనేది పరతత్వం
తాళవాద్య సంపుటమన్నది నాదబిందు కళాతీతం
గుహేశ్వరుని శరణులు
మాట్లాడి మైలచెందరు వినరా ఉన్మాదీ. - అల్లమప్రభు/592 [1]
శరణుడు శరణుడిని చూచి
’శరణ’ని చేతులు జోడించడమే భక్తి లక్షణం
శరణుడు శరణుడిని చూచి
పాదభివందనం చేయడమే భక్తి లక్షణం
శరణుని పాదాలు పట్టక
చూచీ చూడక వెళ్ళినాడంటే
కూడల చెన్న సంగని శరణులు మన్నించరయ్యా/ 905 [1]
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*