లింగాయతంలో తిథి వారాలు, జాతకము నమ్మరు
|
|
చిలుక ఇతరులకు జోస్యం చెప్పి ఏమి ఫలం?
పిల్లి వచ్చు టెరుగదు
జగమంతా చూచుకన్ను
తనను చంపు బాణాన్ని చూడనేరదు
ఎదిరి గుణం తెలుసునంటారు, తమగుణ మెరుగరు
కూడల సంగమదేవా - గురు బసవన్న/185 [1]
తిథి వారాలంటూ తెలియనయ్యా - శుభలగ్న, దుర్లగ్నాలన్నవీ
తెలియనయ్యా
దేన్నెరిగి తిథివారాలు పద్దెనిమిది కులాలంటారు
నేనివన్నీ తెలియనయ్యా
రేయొక్క వారం పగలొక్క వారం
భవిదొక కులం భక్తుడిదొక కులం
మాకు తెలిసింది ఇంతేకదా!
బసవప్రియ కూడల చెన్నసంగమ దేవా! /2047 [1]
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*