లోకపు వంకరలు మీరెందుకు దిద్దడం; మీమీ మనసులు సరిచేసుకోండి
|
|
తనువు మీదన్న మీదట నాకు వేరే తనవు లేదు
మనసు మీదన్న మీదట నాకు వేరే మనసు లేదు
ధనము మిదన్న మీదట నాకు వేరే ధనము లేదయ్యా
ఇటులి త్రివిధాలూ మీవని తెలిసికొన్నాక
నాకు ఇతర విచారాలుంటాయా కూడల సంగమదేవా - గురు బసవన్న/208 [1]
పరచింతలు మనకేలనయ్యా మనచింతలు మనకు చాలవా?
కూడల సంగమదేవుడు ప్రసన్నుడయ్యాడో లేదో నన్నచింత
పరచుకోనూ వుంది కప్పుకోనూ వుంది - గురు బసవన్న/268 [1]
లోకపు వంకరలు మీరెందుకు దిద్దడం
మీమీ తనువులు సరిచూసుకోండి
మీమీ మనసులు సరిచేసుకోండి
పొరుగింటి దు:ఖానికి ఏడ్చేవారిని మెచ్చడు
మా కూడల సంగమదేవా! - గురు బసవన్న/352 [1]
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*