బ్రహ్మా, విష్ణు, మహేష గురించి | వచన సాహిత్యము |
లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము |
ప్రతియొక్క ధర్మ సమాజమునకు ఒక అధార సాహిత్యము కావలసియుండును. ఆ తత్వముయొక్క అనుయాయలు దిక్కుదిక్కులకు వెళ్లిపొకుండునట్లు సంఘటితముగా నిలువవలెనన్నచొ వారికందరికి ఒక సూత్రాత్మక సాహిత్యమయొక్క అవశ్యకత కలదు. క్రిశ్చయనులకు బైబల్, ఇస్లామియలకు కురాను, మిగిలినట్లుగా లింగాయత ధర్మమునకు వచన శాస్త్రమె ఆధార సాహిత్యము. దానియందు సంపూర్ణమైన అధికారమును లొగొన్నవి బసవణ్ణగారి షట్ స్థల వచనములు. బసవణ్ణ మొదలుగ, సకల ఆది శరణుల వచనములె మన నడతలకు, మాటలకు ఆచరణములకు దారి చూపునట్టి సాహిత్యమని లింగాయతుడు తెలిసికోనవలెను.
ఈ ప్రకారముగా తెలిసికొని బసవాది శరణులయొక్క వచనముల ఆధారముపై ఆచార - విచారములను రూపించుకొనువారే నిజమైన లింగాయతలు. సిద్ధరామేశ్వరులు తమ ఒక వచనమునందు ఇట్లు చెప్పియున్నారు.
(Kananda script)
ನಮ್ಮ ನಡಾವಳಿಗೆ ನಮ್ಮ ಪುರಾತರ ನುಡಿಯೆ ಇಷ್ಟವಯ್ಯ
ಸ್ಮೃತಿಗಳು ಸಮುದ್ರದ ಪಾಲಾಗಲಿ
ಶೃತಿಗಳು ವೈಕುಂಠವ ಸೇರಲಿ
ಪುರಾಣಗಳು ಅಗ್ನಿಯ ಸೇರಲಿ
ಆಗಮಗಳು ವಾಯುವ ಹೊಂದಲಿ
ಎಮ್ಮ ಶರಣರ ನುಡಿ ಕಪಿಲಸಿದ್ಧ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ
ಮಹಾಲಿಂಗದ ಹೃದಯದೊಳು ಗ್ರಂಥಿಯಾಗಿರಲಿ - ಸಿದ್ಧರಾಮೇಶ್ವರ /857.
ಎಮ್ಮವಚನದೊಂದು ಪಾರಾಯಣಕ್ಕೆ
ವ್ಯಾಸನದೊಂದು ಪುರಾಣ ಸಮಬಾರದಯ್ಯಾ.
ಎಮ್ಮ ವಚನದ ನೂರೆಂಟರಧ್ಯನಕ್ಕೆ
ಶತರುದ್ರೀ(ಯಾಗ)ಸಮ ಬಾರದಯ್ಯಾ.
ಎಮ್ಮ ವಚನದ ಸಾಸಿರ ಪಾರಾಯಣಕ್ಕೆ
ಗಾಯತ್ರೀ ಲಕ್ಷ ಜಪ ಸಮ ಬಾರದಯ್ಯಾ,
ಕಪಿಲಸಿದ್ದಮಲ್ಲಿಕಾರ್ಜುನ. - ಸಿದ್ದರಾಮೇಶ್ವರ ಸವಸ4/1613
(Transiltration)
నమ్మ నడావళిగె నమ్మ పురాతర నుడియె ఇష్టవయ్య
స్మృతిగళు సముద్రద పాలాగలి
శృతిగళు వైకుంఠవ సేరలి
పురాణగళు అగ్నియ సేరలి
ఆగమగళు వాయువ హొందలి
ఎమ్మ శరణర నుడి కపిలసిద్ధ మల్లికార్జున
మహాలింగద హృదయదొళు గ్రంథియాగిరలి - సిద్ధరామేశ్వర /857
ఎమ్మవచనదొందు పారాయణక్కె
వ్యాసనదొందు పురాణ సమబారదయ్యా.
ఎమ్మ వచనద నూరెంటరధ్యనక్కె
శతరుద్రీ(యాగ)సమ బారదయ్యా.
ఎమ్మ వచనద సాసిర పారాయణక్కె
గాయత్రీ లక్ష జప సమ బారదయ్యా,
కపిలసిద్దమల్లికార్జున. - సిద్దరామేశ్వర సవస4/1613
శ్రీ సిద్ధరామేశ్వరులు చెప్పునట్లుగా లింగాయతుని నడతలకు మాటలకు వచనములే ఆధారశాస్త్రము. వానిని అనుయాయులు పారాయణము అధ్యయనము చెయవలెను.
ఇట్టి అధ్యయన ఫలముగా స్వతంత్రమైన విచారశక్తిని రూపించుకొని సత్యార్థ నిర్ణయమునందు శాస్త్ర ప్రమాణమునకంటె స్వానుభవ ప్రమాణమె శ్రేష్ఠమని లింగాయతడు నమ్మవలెను. కావున మూఢసంప్రదాయమునకంటె సత్యమె శ్రేష్ఠమనియూ, వ్యక్తిప్రేమకంటె తత్వప్రేమయె శ్రేష్ఠమని సత్యార్థ నిర్ణయమునందు శబ్దప్రమాణమునకంటెలోతైన అనుభవ ప్రమాణము శ్రేష్ఠమని స్వతంత్రముగ విచారణ చెయువాడె నిజమైన లింగాయతడు.
Reference:
1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.
*బ్రహ్మా, విష్ణు, మహేష గురించి | వచన సాహిత్యము |