Previous లింగాయతంలో. ప్రతి రోజు మంచి రోజె లింగాయతంలో వ్రతం, శీలం మరియు నేమాలు Next

లింగాయత ధర్మగ్రంథం వచన సాహిత్యం (వేద. శాస్త్ర , ఆగమ లింగాయతలు నమ్మరు)

ఆద్యుల వచనాలు పరుషవేది చూడన్నా
సదాశివుడను లింగం నమ్ముతుంది
నమ్మడంతో నీది గెలుపు కనుమన్నా
అధరానికి చేదు ఉదరానికి స్వాదు (రుచి)
కూడల సమగని శరణుల వచనాలు వేము జుర్రినట్లు! - గురు బసవన్న/39 [1]

వేదం గడగడ వణికింది
శాస్త్రం జారి నేలకూలిందయ్యా
తర్కం తర్కించడం తేలియక ముక్కుపట్టుకోన్నదయ్యా
ఆగమాలు దవ్వుగా తొలిగినవయ్యా
మా కూడల సంగయ్య
మాదిగ చెన్నయ్య ఇంట భుజించి నందుకు - గురు బసవన్న/360 [1]

వేదాలు చదివితేనేమీ? శాస్త్రాలు విటేనీమి?
జపం చేస్తే నేమీ? తపం చేస్తేనేమీ?
ఏమి చేస్తే మాత్రమేమి?
మా కూడల సంగయ్య మనసులో దూరనంత వరకు? - గురు బసవన్న/361 [1]

వేదాన్ని వేదానికి ఒర కడతా
శాస్త్రాలకు సంకెళ్లు వేస్తాను
తర్కం వీపున తోలు వలుస్తాను
ఆగమాల ముక్కు కోస్తాను చూడవయ్యా
మహాదాని కూడల సంగమదేవా
మాదిక చెన్నయ్య ఇంటిబిడ్డను నేనయ్యా - గురు బసవన్న/359 [1]

శాస్త్రం ఘనమందునా? కర్మను భజిస్తుంది
వేదం ఘనమందునా? ప్రాణి వధను చెబుతోంది
శ్రుతులు ఘనమందునా? ముందుంచి వెతుకుతాయి
అక్కడెక్కడా నీము లేవు కనుక
త్రివిధ దాసోహముల ద్వారా కాక చూడరాదు
కూడల సంగమ దేవుని! - గురు బసవన్నణ/364 [1]

ఆజ్ఞానమనే ఉయ్యాలలో
జ్ఞానమనె శిశువును పడుకోబెట్టి
సకల వేదశాస్త్రములనే తాళ్లు కట్టి
పట్టి ఊపుతూ జోల పాడుతోంది
భ్రాంతి అనే తల్లి.
ఊయల విరిగి తాళ్లు తెగి
జోల పాట నిలువక పోతే
గుహేశ్వరుడనే లింగం కానలేము - అల్లమప్రభు/447 [1]

వేదాలనేవి బ్రహ్మాయ్య బూటకం
శాస్త్రములనేవి సరస్వతమ్మ పితలాటకం
ఆగమాలనేవి ఋషుల ఉన్మాదం
పరాణాలనేవి పూర్వుల నాటకం
ఈలాగున వీటిని తెలిసిన వారిని వీధికిలాగి
నిజంగా నిందించేవాడే గుహేశ్వరునిలో
అచ్చంగా లింగైక్యుడు. - అల్లమప్రభు/607

వేదం ప్రమాణం కాదు శాస్త్రమూ ప్రమాణం కాదు
శబ్దం ప్రమాణం కాదు చూడండహో లింగానికి
అంగసంగం నడుమ నుండి, దాచుకొని వాడకొన్నాడు
గుహేశ్వరా మీ శరణుడు - అల్లమప్రభు/608 [1]

వేదమనేది చదువుల మాట
శాస్త్రమనేది సంతల సుద్దులు
పురాణములనేది దోంగల గోష్ఠి
తర్కమనేది టగరుల పోరు
భక్తి అనేది, కోరి, అనుభవించే లాభం
గుహేశ్వరడు అందని ఘనము. -అల్లమప్రభు/ 609 [1]

వేదాలు అందుకోవడం తెలియక చెడ్డాయి
శాస్త్రాలు సాధించుటెరుగక చెడ్డాయి
పురాణాలు పూరించుట తెలియక చెడ్డాయి
పెద్దలు తమ్ముతా మెరుగక చెడ్డారు
తమ బుద్ధి, తమనే తిన్నది
మిమ్మేక్కడ తెలిసేరురా గుహేశ్వరా. - అల్లమప్రభు/610 [1]

మా ఒక వచన పారాయణానికి
వ్యాసుని ఒక పురాణం సమం కాదయ్యా
మా నూటెనిమిది వచనాల అధ్యయనానికి
శతరుద్రీయ యాగం సమం కాదయ్యా
మా సహస్ర వచనాల పారాయణానికి
గాయత్రి లక్షజపం సమం కాదయ్యా
కపిల సిద్ధ మల్లకార్జునా. -సిద్ధరామేశ్వర/969 [1]

వేదశాస్త్ర ఆగమ పురాణములన్ని
పొల్లున దంచిన నూకతౌడు కనండహో
ఇవి దంచనేల? దించ నేల?
అటు ఇటు పరుగుదేయ మనసు లోతులను తెలిసికోంటే
పట్టితనపు బట్టబయలు చెన్నమల్లకార్జునా - అక్క మహాదేవి/1225 [1]

వేదాల వెనుక తిరుగాడకు, తిరుగాడకు
శాస్త్రాల వెనుక తిరుగకు, తిరుకగు
పురాణాల వెనుక పడకు, పడకు
ఆగమాల వెనుక వేలాడకు, వేలాడకు
సౌరాష్ట్ర సోమేశ్వరుని చెయిని పట్టి
శబ్దజాలానికి వేసరిల్లకు, వేసరిల్లకు./ 1511 [1]

వేదం, విప్రుల బోధ
శాస్త్రం, సంతలో సందడి
పురాణం, తుంటరుల గోష్ఠి
ఆగమం, అనృతపు మాట
తర్క వ్యాకరణం, కవిత్వ ప్రౌఢి
ఇలా వీరి అంగము మీద లింగములేని భాష
ఈ కారణంగా తన్ను తానెరిగిన అనుభావికన్నా మిన్న లేదన్నాడు
కలిదేవుడు/ 1896 [1]

ఈ వచనాను భావము నందున్న అర్థము
సకల వేదాగమశాస్త్ర పురాణాల్లోనూ ఉన్నది గనుమా
ఈ వనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాల్లోనూ లేదు కనుమా
ఈ వచనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాలకు అందదు గనుమా
ఈ వచనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాతీసము గనుమా
అప్రమాణ కూడల సంగమదేవా. /2441 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous లింగాయతంలో. ప్రతి రోజు మంచి రోజె లింగాయతంలో వ్రతం, శీలం మరియు నేమాలు Next