Previous లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్యం లింగాయతంలో శరణులు అనుభావం చేయాలి (సంగం; శరణలు భక్తిపక్షం) Next

లింగాయతంలో దేవుని స్వరూపం

కీటకం పట్టుదారాల గూడు చేసుకొని చుట్టినట్లు
దారానికి నూలేడనుండి తెచ్చిందయ్యా
రాట్నంలేదు, దానకి దూది మొదటే లేదు నేసిన వారెవరో
తనదేహపు నూలు తీసి ప్రసరింప జేసి
అందులో నానందంగా ఆటలాడి
చివరికి తనలోనే దాన్ని దాచుకొన్నట్లు
తనవల్ల నైన జగతిని తనలోనే చేర్చుకోగలడు
మా కూడల సంగమదేవుడు - గురు బసవన్న/160 [1]

తల్లిదండ్రులు లేని కన్నా
నీకు నీవే పుట్టి పెరిగితివి కదా
నీ పరిణామమే నీకు ప్రాణతృప్తిగా ఉంది కదా!
భేదకులకు అభేద్యుడనై నిన్ను నీవే వెలుగుచున్నావు కదా!
నీ చరిత్ర నీకు సహజము గుహేశ్వరా - అల్లమప్రభు/536 [1]

మానులోని ఆకులూ పళ్లు
క్రమానుగుణంగా కనుపించినట్లుగా
హరునిలోపలి ప్రకృతి స్వభావాలు
హరుని భావేచ్ఛతో కానుపించు కొంటాయి
లీల యైతేను ఉమాపతి
లీల మానితే స్వయంభువు గుహేశ్వరా - అల్లమప్రభు/587 [1]

మబ్బుల మాటున మెరపులా
బయలు మాటున ఎండమావిలా
శబ్దము మాటున నిశ్యబ్దములా
కన్నుల మాటున వెలుగులా
గుహేశ్వరా మీ తీరు. - అల్లమప్రభు/596 [1]

తన వినోదానకై తానే సృజించెను సకల జగము
తన వినోదానకై తానే దానికి కట్టబెట్టెను సకల ప్రపంచము
తన వినోదానకై తానే త్రిప్పెను సకల భవ దు:ఖములందున
ఇట్లు నా చెన్నమల్లికార్జునుడను పరశివుడు
తన జగన్నాటకము చాలైన పిమ్మట
తానె త్రెంచి వేయును దాని మాయాపాశము -అక్కమహాదేవి/1191 [1]

నేలదాగిన నిధానంలా
పండున దాగిన చవిలా
రాతిని దాగిన పుత్తడిలా
నువ్వులలో దాగిన నూనెలా
మానులదాగిన తేజంలా
భావమునదాగి బ్రహ్మమై వున్న
చెన్నమల్లికార్జునుని నిలువు తెలియలేము -అక్కమహాదేవి/1199 [1]

చావులేని, కీడులేని, రూపలేని, అందగాణ్ణి నేవలచాను
ఎడంలేని కడయులేని, తెరవులేని, గురుతులేని
అందగాణ్ణి నేవలచాను అమ్మలారా
భవములేని, భయములేని, నిర్భయుడందగాణ్ణి వలచాను నేను
ఊరలేని, పేరులేని వానిని వలచాను నేను
చెన్నమల్లికార్జునుడను మగని
ఎక్కెక్కువ నేవలచాను అమ్మలారా! -అక్కమహాదేవి/1230 [1]

అడవిలో వెతికేటప్పుడు చెట్టు చేమలౌను
మడుగులో వెతికేటప్పుడు మత్స్యమండూకం కాదు
తపస్సు చేసేటప్పుడు వేషానికి వలచేవాణ్ణి కాదు
దేహాన్ని దండింపజేసుకొని వేడగా ఇచ్చే అప్పులవాడు కాడు
అష్ట తనుముల్లో దాగిన లింగాన్ని
తొంగిచూసి కాంచాడు అంబిగ చౌడయ్య -అంబిగర చౌడయ్య/1381 [1]

అసుర మాలలు లేవు
త్రిశూల డమరుకం లేదు
బ్రహ్మ కపాలం లేదు
భస్మ భూషణం లేదు
వృషభ వాహనం లేదు
ఋషుల వద్ద ఉన్నవాడు కాదు
పైబడిన సంసారం గుర్తు లేదాతనికి
పేరేదీ లేదు అన్నాడు అంబిగర చౌడయ్య -అంబిగర చౌడయ్య/1387 [1]

రాతిదేవుడు దేవుడుకాడు
మట్టిదేవుడు దేవుడుకాడు
కొయ్యదేవుడు దేవుడుకాడు
పంచలోహాలతో చేసిన దేవుడు దేవుడుకాడు
సేతురామేశ్వరము, గోకర్ణము, కాశి, కేదారము
మొదలైన అష్టావష్టి కోటి (86 కోట్ల) పుణ్యక్షేత్రాలు లోనున్న
దేవుళ్ళు దేవుళ్ళు కారు
తన్ను తానెరిగి తానేమని తెలిసిన
తానేపో దేవుడు చూడుమా
అప్రమాణ కూడల సంగమదేవా! 2444 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్యం లింగాయతంలో శరణులు అనుభావం చేయాలి (సంగం; శరణలు భక్తిపక్షం) Next