Previous లింగాయతంలో దంపతులు కూడా ముక్తి పోందగలరు లింగాయత ధర్మగ్రంథం వచన సాహిత్యం (వేద. శాస్త్ర , ఆగమ లింగాయతలు నమ్మరు) Next

లింగాయతంలో ప్రతి రోజు మంచి రోజె

నాడు నేడు మరో నాడనవద్దు
నేడే సరి శివ శరణమను వారికి
నేడే తగు హర శరణమను వారికి
నేడే మంచిది మా కూడల సంగని మానక తలచేవారికి. -గురు బసవన్న/8 [1]

మావాళ్ళొప్పుకొంటే శుభలగ్న మనండయ్యా
రాశి కూటం, ఋణ సంబంధం వుందని చెప్పండయ్యా
చంద్రబలం తారాబలం ఉందని చెప్పండయ్యా
రేపటి కన్నా నేడే మంచిదని చెప్పండయ్యా
కూడల సంగమదేవుని పూజాఫలం మీదయ్యా -గురు బసవన్న/101 [1]

ఉదయ, మధ్యాహ్న, సాయం, సంధ్యాకాలాలను చూసి
చేసే కర్మిష్ఠుడివి, నీవు వినుమా
ఉదయ మేమిటోయి శరణునకు?
అస్తమాన మేమిటోయి శరణునకు?
మహా మేరువు మరుగున నుండి
తమనీడ వెతుక్కోనే భావ భ్రమితుల మెచ్చడు
మా కూడల చెన్న సంగమ దేవుడు -గురు బసవన్న/712 [1]

సోమవారం మంగళవారం శివరాత్రి అని ఆచరించె భక్తులను
లింగభక్తునికి నేనెలా సరి అనగలనయ్యా?
దినం శ్రేష్ఠమా? లింగం శ్రేష్ఠమా?
దినం శ్రేష్ఠమని చేసే
పంచ మహాపాతుకుల ముఖం చూడరాదు
సొమే భౌమే వ్యతిపాతే సంక్రాంతి శివరాత్రయో:|
ఏక భుక్తోప వాసేన నరకం కాలమక్షయమ్||
అందువల్ల, కూడల చెన్న సంగయ్యా
ఇలాంటి వారి ముఖం చూడరాదు. /928 [1]

తిథి వారాలంటూ తెలియనయ్యా - శుభలగ్న, దుర్లగ్నాలన్నవీ
తెలియనయ్యా
దేన్నెరిగి తిథివారాలు పద్దెనిమిది కులాలంటారు
నేనివన్నీ తెలియనయ్యా
రేయొక్క వారం పగలొక్క వారం
భవిదొక కులం భక్తుడిదొక కులం
మాకు తెలిసింది ఇంతేకదా!
బసవప్రియ కూడల చెన్నసంగమ దేవా! /2047 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous లింగాయతంలో దంపతులు కూడా ముక్తి పోందగలరు లింగాయత ధర్మగ్రంథం వచన సాహిత్యం (వేద. శాస్త్ర , ఆగమ లింగాయతలు నమ్మరు) Next