Previous లింగాయతంలో స్త్రీ పురుషలు సమానం లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము Next

బ్రహ్మా, విష్ణు, మహేష గురించి


బ్రహ్మా-దేవుడుగాడు విష్ణువు దేవుడుకాడు
ఈశ్వరుడు దేవుడుకాడు సదాశివుడు దేవుడుకాడు
సహస్రశివ, సహస్రాక్ష సహస్ర పాదుడైన విరాట్పురుషుడు దేవుడుకాడు
విశ్వతోముఖ, విశ్వతోచక్షు, విశ్వతోబాహు
విశ్వతోపాదుడైన పరమపురుషుడు దేవుడుకాడు
సహజ నిరాలంబమే తానని తెలిసిన మాహాశరణుడు తానే దేవుడు కనుమా
అప్రమాణ కూడల సంగమదేవా/2453 [1]

బ్రహ్మా, విష్ణువు మొదలైన దేవదానవ మానవులందరిని
ఆశ వెంటాడి వేధిస్తుంది
మహత్త్యమైన వ్రత నియమ గురుత్వ తత్వమున్న వాళ్ళని
చెడిపి, పలుచన చేసి పరిహాసం చేస్తుంది
ఈ సామర్థ్యం వున్న పురుషులను గాయపరచి, ఓడించి
తాను గెలవగలిగిన సామర్థ్యం కలది ఈ ఆశ! ఇదేమిటో
అని విచారిస్తే
శివ సంబంధుడు ఆశకు ఆసక్తడైనప్పుడు
శివుని ఆజ్ఞచే వేధిస్తుంది
శివుని దయగనువారిని చేరజాలదయ్యా
ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! - ఉరిలింగపెద్ది/1573 [1]

బ్రహ్మకు సరస్వతిగా వేన్నంటి వచ్చింది మాయ
విష్ణువుకు లక్ష్మిగా భవమునకు నడిపించింది మాయ
రుద్రుడికి ఉమాదేవిగా తలపై తొడపై వేధించింది మాయ
నువ్వుగింజకు నూనెలాగా, ముల్లుకు మొనలాగా, పూవుకు గంధంగా
వారివారి అంగాల్లో మాయని ప్రతిరూపమై
ఎడతెరిపిలేకుండా వేధిస్తోంది మాయ
డక్క చప్పడు నిలవకముందే ముందే నిర్థారంచుకోండి
కాలాంతకుడైన భిమేశ్వరలింగుని తెలుసుకోవాలని - డక్కా డొమ్మన్న/1782 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous లింగాయతంలో స్త్రీ పురుషలు సమానం లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము Next