Previous బ్రహ్మా, విష్ణు, మహేష గురించి లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము Next

లింగాయతంలో శివరాత్రి

బసవణ్ణగారి దృష్టిలో శివరాత్రి మహత్యము

బసవేశ్వరునికి పూర్వము కులము, మతము, వర్గము, వర్ణము, జాతి, అస్పురుశ వ్యవస్థతో రాజే దైవంగా భావించే సమాజంలో సామాన్యప్రజలకు సమానన్యాయము, సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక న్యాయమే లేకుండెను.

ఈ వ్యవస్థ గురించి తన చిన్నతనము లోనే తెలుసున్న బసవేశ్వరుడు జాత్యాతీత వర్ణ, వర్గ, లింగ, బేధంలేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా జనసామాన్యులలో దేవునిపట్ల భయాన్ని విడనాడి భక్తిని పెంపొందించడంలో బసవేశ్వరునికి పాత్ర అమోఘమైనది. ఆ క్రమములో శైవ పరంపరలో అతి ముఖ్యమైన దినముగా భావించే శివరాత్రిని బసవాది శరణులు ఏవిధముగా జరుపుకునేవారో వారి వారి వచనాలలో మనము తెలుసుకోవచ్చు.

" కలవర మేలయ్యా కాపురమున;
దిన-దినము శివరాత్రి సేయవచ్చు;
వేవేగ పూజార్చన సేయవచ్చు;
కూడల సంగని కూడుకొనవచ్చు;"

కలవరము ఎందులకు పడుతున్నారు,? మంచి రోజని చెడురోజని ఎందుకు ఆలోచిస్తున్నారు? అలాంటి మంచి చెడులు భూమికి గాని, ఆకాషినికి గాని , గారికి గాని , నిప్పుకి గాని ఆత్మకు గాని ఉన్నాయా..? అని ప్రశ్నిస్తారు బసవేశ్వరుడు!! కలవరము పడరాదు ఈ పంచభూతములతో చెయ్యుకాపురానికి.., ఒక్కరోజే శివరాత్రి కాదు శరణులకు ప్రతీరోజూ శివరాత్రి చేసుకోవచ్చు వయస్సనే కాలచక్రంలో సమయం వ్యర్ధం చేసుకోకుండా త్వరత్వరగా నిష్టతో ఇష్టలింగాన్ని నిరాకార స్వరూపమైన దేవున్ని పూజించమంటారు బసవేశ్వరుడు.

అర్చించు టెట్టులో, పూజించు టెట్టులో దినదినము శివరాత్రి సేయుటెటులో దెలియ, కప్పడి వేషముతో వచ్చి ఆడెదనయ్యా శివా నీ దాసుల దాసుని కుంటివాడ నేనయ్యా కూడలసంగమదేవా! మీ లాంఛనము ధరియించు ఉదరపోషకుడ నేనయ్యి!

పరమేశ్వరుడా,! నిరాకార, నిర్గుణ, పరబ్రహ్మ, స్వరూపంగా ఉన్న నిన్ను ఏవిధముగా అర్చనచెయ్యాలి,? నిన్ను ఏవిధముగా పూజించాలి,? నిన్ను పూజించడానికి శివరాత్రియే తెలియక పోతినే నేను.! కపట వేశమైన ఈ దేహతత్వముతో నీవు ఆడించునటుల ఆడెదెనయ్యా శివ,! ఓ.. పరమేశ్వరుడా నీ దాసుల దాసుని దాసుడనయ్యా నేను, కూడలసంగమదేవా! మీ లాఛనాలైన వీభూతి, రుద్రాక్ష, ఇష్టలింగాన్ని ధరించిన ఉదరపోషకుడను నేనయ్యా! అని పరమేశ్వరుడిని కానియాడారు. భక్తి భావములో మునిగిపోయిన బసవేశ్వరునికి ప్రతీరోజూ ప్రతీక్షణమూ శివరాత్రియని వివరించడం జరిగింది.

ఈ విధముగా బసవేశ్వరుని భక్తి ప్రౌరత్తులను గమనించిన అన్యరాజ్యపు దేశపు శైవ పరంపర భక్తులు లింగాయత ధర్మాన్ని స్వీకరించి ఇష్టలింగాన్ని మెడలో వేసుకొని సత్య శుద్ధ కాయకము దాసోహం తత్వాన్ని అలవరుచుకొవడం జరిగింది.
ఆనాటి కల్యాణ నగరంలో అందరూ శరణులైవుండెను. లక్షలకొక భక్తుడు, కోటికొక్క శరణులు అనే మాటకు ధీటుగా అప్పటీ బసవేశ్వరుని కల్యాణ రాజ్యము, భక్తి తత్వాన్ని దాసోహం భావంతో జనసామాన్యులకు అందించడం జరిగింది.

శరణుడు నిద్రిస్తే జపం చూడండిరో
శరణుడు మేలుకొని వుంటే శివరాత్రి చూడండిరో
శరణుడు నడచిందే పవిత్రం చూడండిరో
శరణుడు పల్కిందే శివతత్త్వం చూడండిరో
కూడల సంగని శరణుని కాయమే కైలాసం చూడండిరో

విశ్వగురు బసవేశ్వరుడు తన పై వచనములో చెప్పునటులుగా శరణుడు నిద్రపోతే జపముచూడండిరో శరణుడు ఎక్కడ మేల్కొని నడుస్తే అదే శివరాత్రి అని, శరణుడు నడిచిన స్ధలమే పరమ పవిత్రమైనదని, శరణుడు పలికితే శివతత్వమని తెలుసున్న పిదప, ఆ కూడల సంగమదేవుని శరణుని దేహమే కైలాసముతో సమానమని విశ్వగురు ధర్మగురు బసవేశ్వరుడు చెప్పడం జరిగింది.

ఆనాటి కల్యాణ రాజ్యములో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అటువంటి సందర్భములో శరణి ముక్తాయక్క తన వచనములో శివరాత్రి గురించి చాలా చక్కగా అందరికి అర్థమయ్యే విధముగా వివరించడం జరిగింది.

" అలాగే దినమెందుకు గడుపెదరు, అలాగే పొద్దెందులకు గడుపుతారు? అలాగే పొద్దెందులకు గడుపెదరు స్వాములారా ? చేయు రండి దిన దినము శివరాత్రిని వినరండి శివానుభవమును, చూడ రండి అజగణ్ణనుండే బసవణ్ణతండ్రికి."

ఈ పై వచనములో శరణి ముక్తాయక్క తన అన్న అజగణ్ణపేరునే తన వచనాంకితం రూపములో రాసినట్టు కొన్ని వచనాలు లభ్యమైనాయి. ఇందులో భాగంగా., అలాగే వ్యర్థముగా ఊరూరా తిరుగుతూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే మీ ఉదయం అస్తామాలను ఎందులకు భయపఢభడు తంన్నావు. చేయ్యాలి ప్రతీ దినమూ‌ శివరాత్రి చెయ్యండి, ప్రతీదినము బసవేశ్వరుడు చెప్పే వచనసాహిత్య శివానుభవమును వినడానికి అనుభవమంటపానికి దయచెయ్యండి అంటూ శరణులను ఆనాటి అనుభవమంటపానికి స్వాగతం చేస్తూ రాసిన వచనమైయున్నది.

బసవాది శరణులు శివరాత్రి అనే పవిత్రమైన పదమును ఒక్కరోజుకు, ఒక కకాలానికి, ఒక సమయానికి ఉద్దేశించినది కాదు. శరణుల దృష్టిలో శివరాత్రి ప్రతిరోజూ శివరాత్రే, ప్రతీ సమయము దేవ స్వరూపమే.

అందరికీ అనంత శరణూ శరణార్థులు.

సూచిక (index)
Previous బ్రహ్మా, విష్ణు, మహేష గురించి లింగాయత ధర్మ సంహిత వచన సాహిత్యము Next