Previous వచన సాహిత్యము లింగాయతంలో ప్రతియోక్కరు ఇష్టలింగ పూజ చేయాలి Next

లింగాయత ధర్మ గురు బసవణ్ణ

కల్యాణమను ప్రమిదలోన
భక్తి రసమను నూనెను పొసి
ఆచారమనె ఒత్తితో
బసవన్న అను జ్యోతి తాకించగా
పూని వెలుగు చుండెనయ్యా శివుని ప్రకాశం
ఆ వెలుగులో ఒప్పియుండిరయ్యా
అసంఖ్యాత భక్త గణములు
శివభక్తులున్న క్షేత్రమే అవిముక్త క్షేత్రమనెది అబద్ధమా?
గుహేశ్వర లింగమందు
నా పరమారాధ్యుని సంగని బసవన్నను గని
బ్రతికితిని కనుమా సిద్ధరామయ్యా. -అల్లమప్రభు/496 [1]

కుమ్మరి పురుగులా
ఒంటికి మన్నంటకుండ వున్నావుగా బసవన్నా
నిటిలోని తామర (పువ్వు)లా
తడిసి తడియనట్లు వున్నావుగా బసవన్నా
జలంలోని తామరలా
అంటి అంటనట్లు వున్నావుగదా బసవన్నా
గుహేశ్వరలింగం అనతి మీద
దేహాభిమాన మత్తులైన
ఐశ్వర్యాంధ కుల మతము
నేమి చేయ వస్తివయ్యా
సంగన బసవన్నా -అల్లమప్రభు/509 [1]

సతిని గాంచి వ్రతియైనాడు బసవన్న
వ్రతియై బ్రహ్మచారియైనాడు బసవన్న
బ్రహ్మచారియై భవరహితుడైనాడు బసవన్న
గుహేశ్వరా మిలో బాలబ్రహ్మచారియైనది బసవన్న ఒక్కడే. -అల్లమప్రభు/618 [1]

బసవన్న మర్త్యలోకానికి వచ్చి మహాగృహాన్ని నిర్మించి
భక్తి జ్ఞానాలనే దీపమెత్తి చూపగా
సుజ్ఞానమనే ప్రభ ప్రసరించిందయ్యా లోకంలో
వెలుగులో తెలిసి చూడండి
విడిపోయిన శివగణమంతా చేరి ఒక్కటైందయ్యా
కూడల చెన్న సంగమదేవా
మీ శరణ బసవన్న కృపతో
ప్రభుదేవుల నిజమెరిగి నిశ్చింతులయ్యారయ్యా
శివగణమంతా -చెన్న బసవన్న/840 [1]

మాంసపు పిండమనికాక మంత్ర పిండమనిపించాడు బసవన్న
వాయు ప్రానికాక లింగప్రాణి అయ్యాడు బసవన్న
జగద్భరితుడనే కీర్తిని కాంక్షించక, శరణ భరిత లింగమయ్యాడు
కూడల చెన్న సంగయ్యనిలో బసవన్న - చెన్న బసవన్న/872 [1]

కనకం కోసం వచ్చినవాడు కాడు, కాంత కోసం వచ్చినవాడు కాడు
అశనం కోసం వచ్చినవాడు కాడు, వసనం కోసం వచ్చినవాడు కాడు
కూడల చెన్న సంగయ్య
భక్తి మార్గాన్ని చూపవచ్చాడయ్యా బసవన్న -చెన్న బసవన్న/939 [1]

తనువుతో దాసోహం చెసి గురు ప్రసాది అయ్యాడు బసవన్న
మనసుతో దాసోహం చెసి లింగ ప్రసాది అయ్యాడు బసవన్న
ధనంతో దాసోహం చెసి జంగమ ప్రసాది అయ్యాడు బసవన్న
ఇలా ఈ త్రివిధ దాసోహం చెసి
సద్గురు కపిల సిద్ధమల్లికార్జునా
మీ శరణడు స్వయం ప్రసాది అయ్యాడయ్యా బసవన్న - సిద్ధరామేశ్వర/1015 [1]

కామారిని గెలిచాను బసవా మీవలన
సోమధరుని పట్టుకొన్నాను బసవా మీ దయవలన
నామంలో ఆడదన్న పేరైనంతలో ఏమిలోటు
భావించి చూస్తే మగరూపు బసవా మీ కృపవలన
అతికామి చెన్నమల్లికార్జుని తోందరించి
మరియొక టెరుగక కూడితిని బసవా మీ కృపవలన. - అక్క మహాదేవి/1161 [1]

నోటిలోనున్న రుచిని ఊమ్మివేసి మింగనౌనా?
కంటోనున్న రూపాన్ని ఎడంచేసి చూడగలమా?
చేతిలోని వస్తువును వదిలి పట్టుకోగలమా?
తనలోని ఘనాన్ని భిన్నంగా పెట్టి చూస్తారా?
రేకణ్ణ ప్రియ నాగినాథా
బసవుని వల్ల బ్రతికాయి ఈ లోకాలన్ని - బహూరూపి చౌడయ్య/1841 [1]

బసవన పేరు కామధేనువు చూడండహో
బసవన పేరు కల్పవృక్షము చూడండహో
బసవన పేరు చింతాంణి చూడండహో
బసవన పేరు పరసవేది చూడండహో
బసవన పేరు సంజీవనమూలిక చూడండహో
ఇటువంటి బసవ నామామృతము
నా నాల్కపైనిండి పోంగిపోరలి మనసు నిండింది
ఆ మనస్సు నిండి వెలువడి సకల కరణేంద్రియాల్లో నిండింది
ఆ సకల కరణేంద్రయాలు నిండి పోంగిపోరలి
సర్వాంగాలు రోమంచనమై నందున
నేను బసవాక్షరమనే పడవనెక్కి
బసవ బసవ బసవా అని
భవసాగరము దాటానయ్యా అఖండేశ్వరా. - షణ్ముఖస్వామి/2480 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous వచన సాహిత్యము లింగాయతంలో ప్రతియోక్కరు ఇష్టలింగ పూజ చేయాలి Next