లోకవిరోధి శరణుడెవరికీ బెదిరేవాడు కాడు

ఎవరు కోపించి మాత్రం మమ్మేమి చేయగలరు
ఊరికి ఊరే కోపించినా మమ్మేమి చేయగలరు
మా వరునికి కన్నే నీయకండి
మా శునకానికి తళియలో పెట్టకండి
ఏనుగు పై పోయేవాణ్ణి కుక్క కరవగలదా?
మాకు మా కూడల సంగడున్నంత వరకు? - గురు బసవన్న/51 [1]

జంబూ ద్వీప నవఖండ పృథ్విలో
వినండయ్యా ఇరువురు చేసిన బాసలు
చంపుతాననే బాస దేవునిది గెలుస్తాననే బాస భక్తునిది
సత్యమనే మొనదేలిన కత్తిని చేబట్టి
సద్భక్తులు గెలిచారు కనుమా కూడల సంగమదేవా - గురు బసవన్న/200 [1]

జోన్నవాళినిగాను వేళవాళి వాణ్ణి నేనయ్యా
మాలిమిచెడి పరుగెతే బంటును నేను కానయ్యా
విను, కూడల సంగమదేవా
మరణమే మహార్నవమి - గురు బసవన్న/ 206 [1]

రేపు రానున్నది మాకినాడే రానీ
నేడు రానున్నది మాకిప్పుడే రానీ
దీనికెవరు బెదురుతారు దీనికెవరు అదురుతారు
"జాతస్య మరణం ధృవం" అని వున్నందున
మా కూడల సంగమ దేవుడు వ్రాసిన వ్రాతను తప్పించగా
హరిబ్రహ్మాదుల కలవిగాదు - గురు బసవన్న/249 [1]

న్యాయనిష్ఠురి, దాక్షిణ్యపరుడ గాను
లోకవిరోధి శరణుడెవరికీ బెదిరేవాడు కాడు
కూడల సంగమ దేవుని రాజతేజంలో ఉండటం వలన - గురు బసవన్న/266 [1]

ఇల్లు చూస్తే పేదలు ఉల్లం ఎంతో ఘనం
జవ్వనుల ఎడ శుచులు సర్వాంగాల్లో మొనగాళ్ళు
సరకుల కనువులేదు తదవసరానికున్నది
కూడల సంగని శరణులు స్వతంత్ర ధీరులు - గురు బసవన్న/ 313 [1]

సంసారమను అడివిలో పులులుండే ఎలుగులుండే
శరణుడు వెరవడు వెరవడు మహాధీర శరణుడదరడు బెదరడు
కూడల సంగని శరణునికి నిర్భయము - గురు బసవన్న/373 [1]

ఉత్తమమైన గుర్రాన్ని చర్నాకోలతో అదలించిన వాళ్ళుంటారా?
పట్టణానికి దొర అయ్యాక జాతిగోత్రాలను తెలుసుకొనేవాళ్ళుంటారా?
పరమ సుజ్ఞానికి ప్రాణం మీద తీపి ఉంటుందా?
లింగాన్ని నమ్మిన శరణుని ఎవరెవరో దూషిస్తే, సందేహించాలా?
ఇహలోకంవారు తిట్టారని బాధపడ్డం ఎందుకు?
అముగేశ్వర లింగాన్ని తెలుసుకున్న శరణునికి
ఎవరు పొగడితే ఏమిటి? ఎవరు తిడితే ఏమిటి? /1266 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక్ (index)
*
Previousలోకపు వంకరలు మీరెందుకు దిద్దడం; మీమీ మనసులు సరిచేసుకోండిశరణుడు శరణుడిని చూచి ’శరణ’ని చేతులు జోడించడమే భక్తి లక్షణం (అభినందించడం)Next
Guru Basava Vachana

Akkamahadevi Vachana

[1] From the book "Vachana", pub: Basava Samiti Bangalore 2012.