Previous లింగాయత ధర్మగ్రంథం వచన సాహిత్యం (వేద. శాస్త్ర , ఆగమ లింగాయతలు నమ్మరు) లింగాయతంలో తిథి వారాలు, జాతకము నమ్మరు Next

లింగాయతంలో వ్రతం, శీలం మరియు నేమాలు

వచ్చినదేమైనా స్వికరించడం నేమం
ఉన్నదాంట్లో వంచన చేయకుండుటే నేమం
నడచి తప్పకుంటే నేమం పలికి బొంక కుండుటే నేమం
మా కూడల సంగని శరణులు రాగా
ఆ దొరలకు సిరుల నొప్పించడమే నేమం - గురు బసవన్న/271 [1]

పాల నేమం, పాలమీగడ నేమం
మీగడ తిసిన పిదప కిచ్చిడి నేమం
వెన్న నేమం, బెల్లం నేమం
అంబలి నేమం వారి నెవరిని గాన!
కూడల సంగని శరణల్లో
అంబలి నేమంవాడు మాదిగ చెన్నయ్య - గురు బసవన్న/405 [1]

పాల ఎంగిలి దూడది; నీళ్ళ ఎంగిలి మత్స్యానిది
పూల ఎంగిలి తుమ్మెదది
ఎలా పూజించేది శివశివా! ఎలా పూజింతును?
ఈ ఎంగిళ్ళను దాటడం నావల్ల కాదు
దక్కిందే గైకో కూడల సంగమదేవా! - గురు బసవన్న/406 [1]

పాల నేమము పట్టినవాడు పిల్లియై పుడతాడు
శనగల నేమము పట్టినవాడు గుర్రమై పుడతాడు
ఆర్ఘ్యపు నేమము పట్టినవాడు కప్పయై పుడతాడు
పూల నేమము పట్టినవాడు తుమ్మెదై పుడతాడు
ఇది షడు స్థలమునకు వెలుపలనే సుమా
నిజభక్తి లేనివారిని చూసియు మెచ్చడు గుహేశ్వరుడు - అల్లమప్రభు/635 [1]

శీలం శీలమని గర్వించి పలుకుతున్నారు, శీలమేదని తెలియరు
ఉన్నదాన్ని వంచన చేయక ఇవ్వడమే శీలం
లేనందుకు తిరిపెము వేడకుండడమే శీలం
పరధన పరస్త్రీల కాశపడకుండుటె శీలం
పరదైవ పరసిద్ధాంతాల కోరకుండుటే శీలం
గురునింద దేవనింద జంగమనింద వినకుండుటే శీలం
కూడల చెన్న సంగని శరణుల రాకకు
మనసారా సంతోషపడ గలిగితే అచ్చపు శీలం - చెన్న బసవన్న/913 [1]

శీలవంతులు శీలవంఉలంటారు మాకిది తెలియదయ్యా
అంగనల అధరపానం
తన కడుపులోనికి పోతున్నంతకాలం శీల మెక్కడిదో?
ఈషణ త్రయమనే శునకం వెన్నంటి వస్తూవుంటే శీలమెక్కడిదో?
వెనుకంజ వేసి మనసు మహాశివునిలో నిలిస్తే శీలం
పరిణామం లభిస్తే శీలం
అందువల్ల కూడల చెన్న సంగనిలో శీలవంతులు విరళం. - చెన్న బసవన్న/911 [1]

శీలం శీలమంటారు శీలం భక్తిలో లేదు
కారణమదేమంటే
ధాన్యం ధరణి ఎంగిలి
కలశ జలం మేఘపు ఎంగిలి
పరిమళం గాలి ఎంగిలి
పాకం అగ్ని ఎంగిలి
చేతిలో దివ్వె పట్టుకుని
కన్నులు కానక తొట్రుపడిపోయే కుటిల శీలులను మెచ్చుతాడా?
కూడల చెన్న సంగమ దేవుడు - చెన్న బసవన్న/914 [1]

కామికి వ్రతం వుంటుందా? నిష్కామికి కాక?
క్రోధికి వ్రతం వుంటుందా? ఓర్పుగల వానికి కాక?
లోభికి వ్రతం వుంటుందా? ఉదారికి కాక?
ఇలాంటి క్షమ, దమ, శాంతి, ఓరిమి, సంపద మొదలుగా
గురులింగ జంగమాలకు, తను మన ధనాలతో నిరతుడై
తన శక్తికి తగినట్టు చిత్త శుద్ధాత్ముడై ఉండే
మహా భక్తడే కృత్యం లేని శరణుడు
ఆతని పాదం నా హృదయంలో అచ్చొత్తినట్టుగా ఉంటుంది
అచారమే ప్రాణమైన రామేశ్వర లింగం
వారి ఎద్దులను కట్టివేసే గూటమై వున్నాడు. /1246 [1]

దుష్టలకు భయపడి కఠినమైన వ్రతాన్ని చేపట్టవచ్చునా
ఆ వ్రత విచారం ఎలాంటిదంటే
వింటి మొన కంటిన నేతి రుచిని లాలసతో నాకితే
ఆ బాణం పదును నాలుకకు తగిలి ఆ ప్రాణి కనలినట్లుగా
ప్రేమలేని భక్తి, పట్టుదల లేని నిష్ట
బూరుగ చెట్టు మీదున్న విహాంగంలాగు,
ఇలాంటిదే మూలాన్నెరుగని వారి వ్రతనిష్ట
హత్య, ఆశుచి, సూతకాలకు అనువైనది
ఆచారమే ప్రాణమైన రామేశ్వరలింగానికి వ్యతిరేక నియమం./1254 [1]

వ్రతమంటే ఏమిటి? వస్తువును చుడడానికి నిచ్చెన
వ్రతమంటే ఏమిటి? ఇంద్రియాల సందడిని కూల్చే కులకుఠారం
వ్రతం అంటే ఏమిటి? సకల వ్యాపకాలకు దావానలం
వ్రతం అంటే ఏమిటి? సర్వ దోష నాశనం
వ్రతం అంటే ఏమిటి? చిత్తం జాగ్రత్తతో
వస్తువును చూడడానికి కట్టిన కప్పం
వ్రతమంటే ఏమిటి? ఆచారమే ప్రాణమైన రామేశ్వరలింగం
వారికి చిన్నారి కొడుకై వుంటాడు. /1259 [1]

పరధనాన్ని వద్దనడమే వ్రతం
పరస్త్రీలను కూడకుండా వుండడమే శీలం
ఈ ప్రాణిని చంపకుండా వుండడమే నేమం
సత్యాసత్యాల మరచివుండటమే నిత్యనేమం
ఇది ఈశాన్యమూర్తి మల్లికార్జున లింగమనకు సందేహంలేని వ్రతం /2039 [1]

శీలవంతులు, శీలవంతులంటారు
శిలత్వమునెవరు ఎరుగుదురు చెప్పుమా?
నేలకు శీల మనవచ్చునా?
శవ్పచ పద్దెనిమిది జాతుల నడవడి నుడువులకు ఒకటే ఆయింది.
నిళ్లకు శీలమందునా?
చేప మొసళ్లు ఖగమృగాలు జలకాలాడిన ఎంగిలి.
బంగారానికి శిల మందునా?
రొమ్ముకు బరువు ఆయినది.
మగువకు శీల మందునా?
కళ్ళు చెదిరించి వేధిస్తుంది.
శీలమింకేది చెప్పండన్నా
దీనికి వశమైనవారంతా దు:శిలులు.
దీన్ని పట్టి పట్టక, వదలి వదలక,
తన మనసుకు శీలమైయుండడమే.
అచ్చమైన శీలమురా,
బసవప్రియ కూడల చెన్నబసవన్నా. /2164 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous లింగాయత ధర్మగ్రంథం వచన సాహిత్యం (వేద. శాస్త్ర , ఆగమ లింగాయతలు నమ్మరు) లింగాయతంలో తిథి వారాలు, జాతకము నమ్మరు Next