లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్యం
|
|
ఆద్యుల వచనాలు పరుషవేది చూడన్నా
సదాశివుడను లింగం నమ్ముతుంది
నమ్మడంతో నీది గెలుపు కనుమన్నా
అధరానికి చేదు ఉదరానికి స్వాదు (రుచి)
కూడల సమగని శరణుల వచనాలు వేము జుర్రినట్లు! - గురు బసవన్న/39
[1]
పాలవాగులో బెల్లమే బురద చక్కెర ఇసుక
తవరాజపు మీగడ లాగా ఆద్యుల వచనాలుండగా
మరో బావిని త్రవ్వి ఉప్పునీరు త్రాగేవాని గతిలా
అయిపోయిందీ నామతి, కూడల సంగమదేవా! - గురు బసవన్న/404 [1]
పాతాళగంగను తాడులేక తేవచ్చునా?
సోపానాల బలంతోకాక తేవచ్చునా?
శబ్ద సోపానాలమర్చి మడిపారు పురాతనలు
దేవ లోకానికి దారిని, చూడండిరా
మర్త్యుల మనోమాలిన్యం పోగోట్టాలని
గీత పలుకులనే జ్యోతిని వెలిగించి ఇచ్చారు
కూడల చెన్న సంగని శరణలు/ 833 [1]
మా ఒక వచన పారాయణానికి
వ్యాసుని ఒక పురాణం సమం కాదయ్యా
మా నూటెనిమిది వచనాల అధ్యయనానికి
శతరుద్రీయ యాగం సమం కాదయ్యా
మా సహస్ర వచనాల పారాయణానికి
గాయత్రీ లక్షజపం సమం కాదయ్యా
కపిల సిద్ధ మల్లికార్జునా/969 [1]
ఈ వచనాను భావము నందున్న అర్థము
సకల వేదాగమశాస్త్ర పురాణాల్లోనూ ఉన్నది గనుమా
ఈ వనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాల్లోనూ లేదు కనుమా
ఈ వచనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాలకు అందదు గనుమా
ఈ వచనాను భావార్థము
సకల వేదాగమ శాస్త్ర పురాణాతీసము గనుమా
అప్రమాణ కూడల సంగమదేవా. /2441 [1]
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*