Previous లింగాయతంలో , స్వర్గ నరకాల నమ్మకం లేవు లింగాయతం దేవుడు ఒక్కడే ఉన్నాడనే సిద్దాంతము అనుసరిస్తుంది Next

దేవలోకం మర్త్యలోకములని వేరుగా లేవు;
భక్తుని ముంగలే వారణాసి, కాయకమే కైలాసం

దేవలోకం మర్త్యలోకములని వేరుగా ఉన్నాయా?
ఈ లోకంలోనే మళ్ళి అనంత లోకాలా?
శివలోకం శివాచారమయ్యా
శివభక్తుడున్న ఠావే శివలోకం
భక్తుని ముంగలే వారణాసి, కాయకమే కైలాసం
ఇది సత్యమయా కూడల సంగమదేవా! - గురు బసవన్న/232 [1]

శరణుడు నిద్రిస్తే జపం చూడండిరో
శరణుడు మేలుకోని వుంటే శివరాత్రి చూడండిరో
శరణుడు నడచిందే పవిత్రం చూడండిరో
శరణుడు పల్కిందే శివతత్వం చూడండిరో
కూడల సంగని శరణుని కాయమే కైలాసం చూడండిరో - గురు బసవన్న/363 [1]

చుట్టి చుట్టి వస్తే లేదు లక్ఞగంగల్లో మునిగిన లేదు
కొట్టకొనల మేరుగిరినెక్కి కెకలిడిన లేదు
నిత్య నేమముతో తనువు తాకినా లేదు
నిత్యానికి నిత్యం తలచే మనసును
ఆనాటి కానాటికి అట్టిట్టు తిరిగే మనసును
చిత్తంలో నిలుపగల్గితే నిర్మలమైన వెలుగు గుహేశ్వరలింగము - అల్లమప్రభు/625 [1]

అంగంపై లింగసాహిత్యమైన పిదప
తీర్థ క్షేత్రయాత్ర లెందుకయ్యా!
అంగం మీది లింగం స్థావర లింగాన్ని తాకితే
దేన్ని ఘనమనను! దేన్ని చిన్నదనగలను!
తాళ సంపుటానికిరాని ఘనం తెలియక చెడ్డారు
జంగమ దర్శనం శిరసు తాకి పావనం
లింగ దర్శనం కరం తాకి పావనం
దరిసున్న లింగాన్ని మిథ్య చేసి
దూరాననున్న లింగానికి మొక్కే
వ్యర్థవ్రతుణ్ణి చూపించకయ్యా
కూడల చెన్న సంగయ్యా /653 [1]

పాలుంచుకొని వెన్న వెదకడమా?
లింగం పట్టుకుని పుణ్యక్షేత్రానికి వెళ్ళడం తగునా?
లింగ సంగం చేశాననే వానికి అన్యదైవ భజన ఎందుకయ్యా?
ఇష్టలింగమ విశ్వస్య యోన్యదైవ ముపాసతే|
శ్వాన యొని శతం గత్వా చండాల గృహ మాచరేత్||
ఇలా అన్నందువల్ల,
ఇలాంటి పాతకికి ఘోర నరకం తప్పదు కనుమా!
కూడల చెన్న సంగమదేవా. - చెన్న బసవన్న/934 [1]

భక్తులకు పేదతనముంటుందా? సత్యవంతులకు కర్మ ఉంటుందా
మనస్ఫూర్తిగా సేవ చేసే భక్తునికి
మర్త్యలోకం కైలాసం అనేవికలవా?
అతడున్నదే సుక్షేత్రం
అతని అంగమే అమరేశ్వరలీంగని సాంగత్య సుఖం - ఆయ్దక్కి మారయ్య/1526 [1]

వారణాసి, అవిముక్తి, ఇక్కడే వున్నాడు
మంచు కేదారుడు, విరూపాక్షుడు ఇక్కడే వున్నాడు
గోవర్ణ సేతు రామేశ్వరడు ఇక్కడే వున్నాడు
శ్రీశైల మల్లికార్జునుడిక్కడే వున్నాడు
సకళ లోక పుణ్యక్షేత్రుడు ఇక్కడే వున్నాడు
సకల లింగ ఉళి ఉమేశ్వరుడు తనలో వున్నాడు!/ 1595 [1]

అసలైన శివైక్యుడికి ప్రొద్దున్నే అమావస్య
మిట్ట మధ్యాహ్నమూ సంక్రాంతే,
మళ్ళి అస్తమయం, పౌర్ణమి, పున్నమి;
భక్తుని ఇంటిముంగెలే వారణాసి కనరా రామనాథా!/ 1714 [1]

దాత మానవుడంటే
తరమూ నోటిని చెరువుగుంతలోకి
మానవుని హృదయంలో తానీశ్వరుడు దూరి
అవరసమైనంత ఇప్పిస్తాడు దేవరాయ సొడ్డళా/2115 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous లింగాయతంలో , స్వర్గ నరకాల నమ్మకం లేవు లింగాయతం దేవుడు ఒక్కడే ఉన్నాడనే సిద్దాంతము అనుసరిస్తుంది Next