Previous శరణుడు శరణుడిని చూచి ’శరణ’ని చేతులు జోడించడమే భక్తి లక్షణం (అభినందించడం) బ్రహ్మా, విష్ణు, మహేష గురించి Next

లింగాయతంలో స్త్రీ పురుషలు సమానం

చన్నులు పొంగివస్తే ఆడదంటారు
మీసం మొలిచివస్తే మగ అంటారు
ఈ ఉభయాల జ్ఞానం
ఆడా? మగా? నాస్తి నాథా! - గొగ్గవె /1312 [1]

మగవాడు మొహించి స్త్రీని పట్టుకున్నప్పడు
ఆమె ఒకని సొమ్ము అని తెలుసుకోవాలి
స్త్రీ మొహించి పురుషుని పట్టుకున్నప్పడు
ఉత్తరమేమిటనుకోవాలి?
ఈ రెంటి యందలి ఉభయత్వాన్ని
చెరపి సుఖి తానవగలిగినప్పుడు
నాస్తినాథుడు పరిపూర్ణుడని అంటాను - గొగ్గవె /1311 [1]

వక్షొజాలు, కొప్పు ఉన్నదే స్త్రీ అన్నది ప్రమాణం కాదు
కాసె, మీసం, కఠారి ఉంటే పురుషుడని నిర్ధారణ కాదు
అది లోకం తీరు, తెలిసిన వాళ్ళు చెప్పిన నీతి కాదు
ఏ రకం పండైనా దనిలో తీపియే కారణం / అందంగాలేని
కుసుమానికి వాసనే కారణం
దీంట్లోని అందం నీకే తెలుసు శంభు జక్కేశ్వరా. - సత్యక్క / 1348 [1]

భార్య ప్రాణానికి స్తనాలూ, కొప్పూ ఉంటాయా?
పారుని ప్రాణానికి ఉంటుందా యజ్ఞోపవీతం?
ఆఖరున ఉన్న అంత్యజనుని ప్రాణం పట్టి ఉందా పిడికర్ర?
నీవు పెట్టిన అడ్డంకిని ఈ జడులైన లోకులెలా తెలుసుకుంటారు
రామనాథా! - జేడర (సాలె) దాసిమయ్య /1760 [1]

చన్నులు, జుట్టు పెరిగితే ఆడదంటారు
గడ్డాలు, మీసాలు వస్తే మగాడంటారు
మధ్యన తిరుగాడే ఆత్మ
ఆడకాదు మగకాదు కనుమా రామనాథ! - జేడర (సాలె) దాసిమయ్య /1764 [1]

సతి గుణాన్ని పతి చూడాలి కానీ
పతి గుణాన్ని సతి తెలుసుకోవచ్చా? అంటారు
సతివల్ల కలిగే కళంకం పతికి కీడు కాదా?
పతివల్ల కలిగే కళంకం సతికి కీడు కాదా?
ఒక అంగం కళ్ళు రెండింట్లో, ఒకటి చితికిపొతే
భంగమెవరికని తెలిసినపుడే
కాలాంతక భీమేశ్వర లింగానికి చక్కగా అతికింది. - డక్కా బొమ్మన్న /1785 [1]

తాను సృష్టించిన స్త్రీ తన తలనెక్కింది
తాను సృష్టించిన స్త్రీ తన ఒడికెక్కింది
తాను సృష్టించిన స్త్రీ బ్రహ్మ నాలుకకెక్కింది
తాను సృష్టించిన స్త్రీ నారాయణ ఎదకెక్కింది
అందువల్ల స్త్రీ స్త్రీ కాదు, స్త్రీ రాక్షసి కాదు
స్త్రీ ప్రత్యక్షంగా కపిల సిద్ధ మల్లికార్జునుడే కనవయ్యా. - సిద్ధరామేశ్వర / 1018 [1]

బంగారు మాయ అంటారు - బంగారు మాయకాదు
అంగన మాయ అంటారు - అంగన మాయకాదు
కనుముంగిట మట్టిమాయ అంటారు - మట్టిమాయ కాదు
మనసు ముంగిట ఆశే మాయ కనమా గుహేశ్వరా. - అల్లమప్రభు /648 [1]

బంగారన్నొదిలి లింగాన్ని ఆరాధించమని అంటారు
బంగారానికి లింగానికి విరోధం ఉందా?
స్త్రీని వదిలి లింగాన్ని చేరమని అంటారు
స్త్రీకి లింగానికీ విరోధం ఉందా?
మన్ను నొదలి లింగాన్ని చేరమంటారు
మన్నుకు లింగానికి విరోధం ఉందా?
అంగాన్ని వదలి లింగాన్ని చేరమంటారు
అంగానికి లింగానికి విరోధం ఉందా?
ఇంద్రియాల నొదిలి లింగాన్ని చేరమంటారు
ఇంద్రియాలకూ లింగానికి విరోధం ఉందా?
జగాన్ని వదిలి లింగాన్ని చేరమంటారు
జగానికి లింగానికి విరోధం ఉందా?
ఇది కారణం, పరంజ్యోతి పరమ కరుణి
పరమ శాంతుడనే లింగం
అలిగిన కారణం చించివేస్తే చూడవచ్చు
మరచిపొతే చూడలేం
తెలివితో చూచినప్పుడు కలిగినదే సుఖం
మసణయ్య ప్రియ గజేశ్వరా. - గజేశ మసణయ్యగారి పుణ్యస్త్రీ మసణమ్మ /1309 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous శరణుడు శరణుడిని చూచి ’శరణ’ని చేతులు జోడించడమే భక్తి లక్షణం (అభినందించడం) బ్రహ్మా, విష్ణు, మహేష గురించి Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys