Previous లింగాయత భక్తి గీతాలు గురుచరణాలకు నుడి నమనము Next

ధర్మ గురు బసవజ్యోతి

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

జ్యోతి జగమును వెలిగించు బసవని....

జ్యోతి జగమును వెలిగించు బసవని
జ్యోతి జగమునకు వెలుగు
ధర్మాకసమందు నిశకవియక నుండ
బాలరవివోలె చెదురగొట్ట వచ్చితివా ||అ.ప||

మూఢ రూఢి బంధనమున బిగించిన
ముగ మానవుడు సంకట పడుచుండ
మఱపను తిమిరమున ముందుకు నడుప
మంగళ ముందు వెలుగై వచ్చితివా

వధువుకు మాయా పట్టముకట్టి
కన్నయెడలుకు పాపి తాననుచు
హీనతన నెరవనుచు వీపుపై నెక్కిన
పురుషుల భ్రాంతిని విడిపింప వచ్చితివా ||2||

మ్రాను ఓడమానవుడా చినిగిన ఓడ రక్షకుండు
మేలు కీడను భ్రాంతి యదెందుకు?
సర్వసమత క్రాంతిని చాట
దైవీక కొమ్ము మ్రోగు చుండ వచ్చితివా

భారత జనని కీర్తికంద
విశ్వాకాశపు చిన్మయ భానువే
మనుకుల సరస్సు కందమైన అంబుజమా
సచ్చిదానంద కందా తా వచ్చితివా ||4||

*
సూచిక (index)
Previous లింగాయత భక్తి గీతాలు గురుచరణాలకు నుడి నమనము Next