ధర్మ గురు బసవన్న ఆరాధన గీతము
|
|
*
- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి
ముక్తిదాయక శరణరక్షక నిత్యమూర్తి బసవన్న
ముక్తిదాయక శరణరక్షక నిత్యమూర్తి బసవన్న
భక్తితో చరణ కమలమునకు నిత్యము వందింతును తండ్రి ||2||
జ్ఞానములేక మనుజ జన్మము శాపమనుచుకుందితి
మఱచు వ్యాపించు గురువే అనుచు నీదు చరణమును పట్టితిని
నీకరుణయే నాబతుకుకు రక్ష అనుచు నమ్ముచు
బాధను వారించు వెలుగు చిమ్ము శక్తి అనుచుకాచెద ||1||
మోహరహితుడా, జ్ఞాన భరితుడా, పరమశాంతి ధామమా
కావుము మమ్ము కరమువీడక హరుని కరుణకందా!
కామ క్రోధాది కలుషము వీడి భక్తజలమందు ప్రోక్షించు
జ్ఞానదుస్తుల మనమునకు తొడిగి మృడుని పాదానికర్పించు ల ॥2॥
నీదు చిన్మయ జ్ఞానము నాకు మార్గదర్శక దీపము
నీదు మమతయేహృదయమందిరము నాకు శాంతిపందిరి
నీపావన చరణయుగ్మము భవము దాటించు దోనెయు
సన్నుతాంగ నిన్ను తలచిన బతుకమృత సోనయు ||3||
వాడించు బొమ్మమీటి వాయించు వీణనేను
నీవు బుజ్జగించి తినిపించి నీ సలహాతో నాబతుకు ఝంకృతి
మంత్రపురుషుడా శాంతి చంద్రుడా దురిత తిమిరములకు భానుడా
కీర్తింతుననవరతము నిన్ను సచ్చిదానంద కందుడా! ||4||
*