*
- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి
జ్యోతి వెలుగు చున్నది
జ్యోతి వెలుగు చున్నది
కల్యాణ జ్యోతి వెలుగు చున్నది || ప. ||
మనుకుల మంచిని కోరి బసవగురు
కల్యాణపుర మంటపమునందపుడు వెలిగించిన జ్యోతి వెలుగు చున్నది....|| అ. ప. ||
కల్యాణమే ప్రమిదలై దానిలో
భక్తిరసమే తైలమై
సదాచారమను వత్తిని పెట్టి బసవన్నయను జ్యోతి
ముట్టిన పరమ ప్రకాశ సరసము వెదజల్లి జ్యోతి వెలుగు చున్నది....|| 1 ||
అల్లమ ప్రభుదేవ సుజ్ఞాని
శ్రీ చన్న బసవన్న
వీర విరాగిని శ్రీ అక్కమహాదేవి
సన్నుత శరణులు వెలిగించిన కల్యాణ జ్యోతి వెలుగు చున్నది....|| 2 ||
శ్రీ సిద్దరామేశ్వర, మడివాల మాచయ్య,
కేతయ్య హరళయ్య , మధువయ్య,
అంబిగర చౌడయ్య మన శరణులు వెలిగించన కల్యాణము జ్యోతి వెలుగు చున్నది....|| 3 ||
నీలమ్మ , నాగమ్మ, ముక్తాయి
శరణి కల్యాణమ్మ
అనుభవ మంటపము లింగదేవుని తలచి
జయజయమనుచు శరణులు వెలిగించిన జ్యోతి వెలుగు చున్నది....|| 4 ||
మోళిగే మారయ్య అతని సతి
జ్ఞాని గంగాదేవి
ఆయ్దక్కి మారయ్య లక్కమ్మ సత్యక్క
చిన్మయ శరణులు వెలగించిన కల్యాణ
సద్గురులింగా నందుల సంకల్పముతో జ్యోతి వెలుగు చున్నది....|| 5 ||
బసవాత్మజమాతయు
కాయక దినమందు కల్యాణ పర్వమున
సచ్చిదానందుని శరణుల కూటమి. జ్యోతి వెలుగు చున్నది....|| 6 ||
*