Previous గురుచరణాలకు నుడి నమనము సంకల్పగీతము Next

మంగళాంగ గురులింగా నందులు

*

- ✍ రచన : శరణమహాదేవ గుడేర, జె. ఎస్. ఎస్. కాలేజ్, గోకాక్.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

మంగళాంగ గురులింగానందా! మాయమొందితింటకు?

మంగళాంగ గురులింగానందా! మాయమొందితింటకు?
విశ్వచేతనా లీనమైతిరా లింగదేవునందు || ప ||

విశ్వధర్మపు విస్తారము తెలుపు మానవీయతకు మాహాత్మ్యమొసగనిచ్చి
బసవధర్మ ప్రమిదలకు తవ తపోతైలము కార్చనిమ్ము || 1 ||

సత్య శరణ సందేశమునీ జగతిలో విత్తి పెంచు
ఉత్తుంగమునకెక్కించితివి బసవధర్మ కలుపు తీసి చదునుగొల్పి
జంగమత్వమునంగము తాల్చు లింగ నైజమును తెల్పి
లింగాంగ సమరసపు తీపితేనెను బీదభక్త జనతకు త్రావించి || 2 ||

బసవునుసురుఱు జగతిలో ప్రసరించి జనుల జాగృతిగొలిపి
ప్రవహించి పంచిన ధర్మశక్తి క్రొత్త జ్వా లను లేపి.
బసవన్న నైక్య కూడల సంగమ ధర్మక్షేత్రమందు
నొకట గూర్చితివి బసవ భక్తులను శరణమేళమందు || 3 ||

బసవ సందేశమునకు చ్యుతిని తెచ్చు మఠములకు దిట్టముగా తెల్పి
జాతి నమ్మక భూతమును వదలించి నిజనీతి జ్యోతివైతివి.
స్తుతి నుండి యేదేని రాని నిలబడి నగుమోముతో
ధర్మమమత ఎదనిండియుండె, అదిమనమెరిగిన జగతి || 4 ||

నడత నుడులందు నిండియుండె సర్వధర్మ సమత ప్రీతి
హృదయాంతారాళమందిముడజేయు విశ్వశాంతికోర్కె
అపుడు వచ్చె హిరియూరినుండి కఱవు అసినపాత వార్త
వినినంతనే ఉదికినట్లయ్యె మండుసున్నపు బుగ్గలేచినట్లు || 5 ||

ఇంకెచట దొరకవచ్చయ్య గురువె మీ దివ్య ముఖకాంతి
ఇంకెవరు తెల్పవచ్చయ్య గురువె నిర్భయ ధర్మక్రాంతి ?
గురువె రారా ! జగద్గురువెరా ! నా పిలుపు నాలకించి
బసవుడదృశ్యుడై నిలిచె ఈ బసవదళము భక్తులకు వరము లొసగె || 6 ||

*
సూచిక (index)
Previous గురుచరణాలకు నుడి నమనము సంకల్పగీతము Next