*
- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి
ఓంగురు ఓంగురు ఓంగురు బసవా
ఓంగురు ఓంగురు ఓంగురు బసవా
సద్గురు బసవా తవ శరణం ||ప||
మంగళరూపివి జంగమ మూర్తి
మద్గురు బసవా తవ శరణం ||అ.ప.||
నమామి సద్గురు ప్రణవ స్వరూప
మంత్ర పురుష హేతవ శరణం
జగదోద్దారక పతితోద్దారక
వరగురు బసవా తవశరణం || 1 ||
శరణ రక్షక కరుణామూర్తి
మరణ విదూర తవ శరణం|
సమతావాది మనుకుల కీర్తీ
చిన్మయ మూర్త్ తవశరణం ||2||
సన్మయ గాత్ర పరమ పవిత్ర
మమతా మూర్త్ తవ శరణం |
మాతృ స్వరూప పితృస్వరూప
జ్యోతి స్వరూప తవ శరణం || 3 ||
భవతాపహర శివ సుఖదాయక
పావన పురుష తవ శరణం!
వరగుణ హిత నిరుపమ చరిత
పరశివ భరిత తవ శరణం || 4 ||
నిత్యానందిన్ సత్యస్వరూప
భ్రాంతి వినాశక తవశరణం|
ఆనంద రూప చిదానందరూప
సచ్చిదానంద సుత తవశరణం || 5 ||
*