Previous జ్ఞాన పూర్ణం బసవ మంగళ హారతి Next

జయతు జయతు బసవగురు

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

జయతు జయతు బసవగురు భక్త బంధు పాహిమాం

జయతు జయతు బసవగురు భక్త బంధు పాహిమాం
కరుణహృదయ త్యాగమయ శరణలోల రక్షమాం ||ప ||

దేవసుత కారణిక ప్రణవరూప పాహిమాం
భావజహర భవదూరక శక్తియుక్త రక్షమాం !
భ్రాంతిరహిత భక్తి సహిత శరణు ప్రీత పాహిమాం
స్ఫూర్తి దాత కీర్తిభరిత జ్ఞానమూర్తె రక్షమాం || 1 ||

అభయహస్త శుభదాయక మంత్రపురుష పాహిమాం
సుభగగాత్ర పరమతృప్త శాంతమూర్తి రక్షమాం
నిర్మలాంగ కర్మరహిత యోగిరాజ పాహిమాం
సౌమ్యలాస్య వదన సహిత నమ్రమూర్తి రక్షమాం || 2 ||

సామ్యవాది క్రాంతినిధే దలిత ప్రీత పాహిమాం
ధీమంత సత్యజ్యోతి, తత్త్వనిష్ఠ రక్షమాం
కర్మహరణ చరణయుక్త శివనయన హేపాహిమాం
సచ్చిదానంద సుత బసవగురు రక్షమాం - ||3||

*
సూచిక (index)
Previous జ్ఞాన పూర్ణం బసవ మంగళ హారతి Next