Previous పాఠశాల పిల్లల కొఱకు ప్రార్థనము నాడు మాతకు నుడి నైవేద్యము Next

పాఠశాల పిల్లల కొఱకు ప్రార్థనము

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

భారతీయులారా ..... ........మేలుకొండి

రాగము : ఉదయరవి చంద్రిక; తాళము : ఆది

ఓ భారతీయులారా ! లేవుడిపుడు తెలవాఱెను.
ధర్మ భానుడుదయించుచున్నాడు. లేవు లేవు లేవు మూర్ఖదనము విడిచిప్టు ||ప||

జాతీయత తిమిరము తొలచి ధార్మికత తత్త్వమును దాల్చి
సమతా పతాకము హిందు తత్త్వముతోడ మెఱయుచు
మానవత కనుల తెఱచి దానవత అరిని మెట్టి
బాననుంచి సర్వజనుల హృదయమందు నింపు చుండు || 1 ||

ధర్మమె మధువు సద్ధర్మము, ధర్మమై మధువు మానవ ధర్మము -
ధర్మము మనరాష్ట్ర ధర్మము, ధర్మము విశ్వధర్మము
మనమును జగమాకశముల వెడల్పు పెంపొందించి
ధర్మవంతులై మనము , సర్వులకాశ్రయమొసగెదమా || 2 ||

బసవ శంకర మాధ్వలు, మహాదేవి మీరాబాయి
గురునానక, రామానుజుల, భవ్య పరంపర మనవి
బాపు బుద్ధ మహావీర అరవింద వివేకానంద
ధర్మ గుడిని యెన్నుకొనిన మహంతుల నాడుమనది ||3||

ప్రణవ గీతము పాడి, ఓంకారధ్వజము చూచి
అన్నదమ్ములై బ్రతికి విశ్వప్రేమ మార్గము చూపి
సంకోచపుటెల్లను దాటి ప్రేమలోకమందు
అందటిని మనమాహ్వానించెదము సచ్చిదానంద బిడ్డలమని ||4||

*
సూచిక (index)
Previous పాఠశాల పిల్లల కొఱకు ప్రార్థనము నాడు మాతకు నుడి నైవేద్యము Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys