Previous విశ్వాత్ముని లీలారూపము చూడు చూడు చూడు లింగమా Next

నిత్య నివేదనము

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

దేవ దేవుడా దివ్యభానువే, పరమజ్ఞాన తేజమా

దేవ దేవుడా దివ్యభానువే, పరమజ్ఞాన తేజమా
కావు మమ్ముల కరుణనొసగుచు లోకపాలక ధేనువే ||ప||

హృదయ మందిరమందు నీదుజ్ఞానకిరణము వెలుగని
ముదముతో విరయు మానసఅంబుజము భక్తి సౌరభము చల్లుచు
నీదు ప్రీతిప్రవాహము ప్రవహించుచు బ్రతుకు కష్టాలు తొలగని
జనన జంజాట మరణ భీతి మలినములను కడిగి ||1||

మిథ్య భ్రాంతి సుఖమును కోరి మనమర్దనము చేయు, నీ
సత్యమార్గమును విడువక నడుచు ఆత్మబలమొసగు, నీ
స్తుత్యరీతి తత్త్వనిష్ఠను నొసగు నాకు సింధువై
నిత్య మొనర్చు తప్పు తడలను క్షమించి పాలించు బంధువే ||2||

నీదు చరణ కమలమందు భృంగమై పాడెద
భిన్నముగ చలించక నుండునట్టి మనమునొసగ వేడెద
మతి పందిరి యందు మంత్రలతను నేను పెంచెదను
స్తుతింతునిన్ను ప్రేమనొసగు సచ్చిదానంద తండ్రి ||3||

*
సూచిక (index)
Previous విశ్వాత్ముని లీలారూపము చూడు చూడు చూడు లింగమా Next