Previous అకలంక గురువు శరణు బసవశరణు Next

మాయాసాగరము

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

నశ్వర మాయాసాగరమందు...

రాగము : రతిపతి ప్రియ; ధ్వని దరువు : హృదయవీణె మీంటిదాగ; తాళము:ఆది

నశ్వర మాయాసాగరమందు
జీవన దోనె సాగుచున్నది ||ప||

పాప పుణ్యాల అలలు నిండిన
కడలిది పరివృత్తమై బిత్తరించి ||అ.ప. ||

కాయకదోనె నెక్కిన జీవుడు
అలల మధ్యలో సాగుచునుండు
పడవ పతనమై మాయకు చిక్కి -
ఉరికంబము చివర బొమ్మవలె నూగుచుండు ||1||

మాయలో నావికుడు పుట్టుక ఆసను
మీటుచు పడవ నడపుచు
తాపత్రయముల సరకును నింపి
నరకమును చేయు పయనమును ||2||

నావకు నవవిధాల రంద్రాల చేసి
నగవుతో సాగును నావికుడు
కాతరుడై బసవన్న మఱుగున
జీవిని చూచి చిఱునగవు చిందు .... ||3||

తీరమని దూరమునుండి పిల్చుచుండినను
ఎపుడు ముగియునో ఈ పయనము,
ఆస, అమిష, రోష, హర్షములను
భీకర ప్రాణికి బలినొసగక ||4||

సద్గుణ పూర్ణ మంగళ గురుని
కరమునకు దొరకిన ఈ దోనె
శివకారుణ్య పుట్టుకను మీటిన |
సచ్చిదానంద తీరము చేరదు దోనె ||5||

*
సూచిక (index)
Previous అకలంక గురువు శరణు బసవశరణు Next