Previous రాష్ట్ర భక్తిగీతము విశ్వాత్ముని లీలారూపము Next

విశ్వాత్ముని పూజ

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

సృష్టి దేవుని దేవళమందు

తాళము : ఆది; ధ్వని దరువు : హృదయవీణె మీంటిదాగ; రాగము : రతిపతిప్రియ

సృష్టి దేవుని దేవళమందు
కర్తునిపూజ సాగుచున్నది ||ప||

అరయు కన్నుల లేకున్నయచట
కనబడునెల్లయు జడక్రియయై ||అ.ప||

ఆకసమున నిండెను కారు మేఘములు
స్నానము చేయుంచు కుంభములు!
ప్రకృతి ఒడలునందు బెడగుచుండు
పూలు పులకరించు పుష్పార్చనము ||1||

నభమునందు నిలిచి వెలుగు రవిశశి
అభవునికి మీదు ఆరితియు
నీలాంబరమందు మించు చుక్కలు
చెలువునికర్పించు అక్షతలు ||2||

అగ్ని యర్పించు దేవునికి భస్మము
నగ్న శరీరమునకు దిక్కులంబరము
లోక పరిమళము గంధ చందనములు
సకల ధాన్యములు ధరార్పితము ||3||

ఒయ్యారముతో వీచుగాలియు
“చుయ్య”ని వింజామరములు వీచుచున్నవి
శుకపిక భృంగముల సుమధుర కంఠాలు
ఘంటారావము చేయుచున్నది ||4||

లీలామయ మహాబ్రహ్మాండమందు
గోళములు సూర్యుని చుట్టు తిరుగుచున్నవి
ఎడ తెలిపి లేక ప్రదక్షిణించు చున్నవి.
మృడుని చేతనముతో నొకేమనముతో ||5||

శక్తి వ్యక్తరూపమై సృష్టియు
జగతి జనకుని పూజించుచు
ఓంకార రవము బింకముతో పాడుచు
సచ్చిదానందుని నమించుచున్నది. ||6||

*
సూచిక (index)
Previous రాష్ట్ర భక్తిగీతము విశ్వాత్ముని లీలారూపము Next