*
- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి
భారత భూమిలో ప్రభవించితి నేను
భారత భూమిలో ప్రభవించితి నేను
భారత మాతను వందించెదను ||ప ||
గురువును స్మరించి దేవుని నమ్మి
ప్రతిన చేసి పాటుపడిదెను ||అ.ప||
గంగాజలముందు జలకి మాడెదను
తుంగా జలపానము చేసెదను
గౌరీ శంకర గిరిని వందించి
కన్యాకుమారిని స్మరించెదను ||1||
ధర్మకవచమును ధరించెదను
సత్యజ్యోతిని చేతబట్టెదను
దేశవిదేశాలలో భారత కీర్తి
వ్యాపించునట్లు నేను పాటుపడెదను. ||2||
నాడు జనులెల్లరు నావారు
అనెడి భావము నొందెదను
సుందర బంధుర భారత మందిరము
కట్టుటకు నేను బ్రతికెదను ||3||
*