Previous కల్యాణ జ్యోతి జ్ఞాన పూర్ణం Next

జ్యోతి వెలుగుచున్నది

*

- ✍ శ్రీ నిజగుణ శివయోగులు
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

జ్యోతి వెలుగు చున్నది విమల ! పరం

రాగము : నాదనామక్రియ; తాళము : తిశ్రఏక

జ్యోతి వెలుగు చున్నది విమల ! పరం |
జ్యోతి వెలుగు చున్నది!
మాట మనములు ప్రక్కకు మీఱని
యగ్గలిక స్వతంత్రమైన నిర్మల || ప ||

శివధర్మనాళమునెడి కంబముపైన
సువివేక హృదయాజ్ఞ ప్రమిదయందు
సమయని సద్భక్తి రసతైలముతోడ
ప్రవిమల కళయనెడి వత్తిని వెలిగించి దివ్య ....జ్యోతి వెలుగు చున్నది || 1 ||

ముసుగుడు విషయ పతంగము పడి దొరలి| తా
మసబుద్దియను చీకటిని తొలచు,
మసగు సుజ్ఞాన మనెడి మహాప్రభ
ప్రసరించి మాయా కాళిక కూడుననుపమ ...జ్యోతి వెలుగు చున్నది || 2 ||

ప్రణవాకార గుణములు మూడు మూయబడి
గణన గతితార్థమును చూపును |
అణుమాత్రచలనము లేని మోక్షచింతా
మణియనుపించు శంభు లింగమే తానయి ...జ్యోతి వెలుగు చున్నది || 3 ||

*
సూచిక (index)
Previous కల్యాణ జ్యోతి జ్ఞాన పూర్ణం Next