Previous బసవ భక్తుల ప్రతిజ్ఞ పాఠశాల పిల్లల కొఱకు ప్రార్థనము Next

లింగాయత నేను లింగాయత

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

లింగాయత నేనులింగాయత

లింగాయతుడు నేను లింగాయతుడు
విశ్వబంధువు నేను విశ్వబంధువు ||ప||

నాధర్మము లింగాయతమనిచాటి నుడివెదను
బసవన్నయే ధర్మగురువని నమ్మి నడుచుకొందును
లింగ దేవుడు జగతికర్త అను శ్రద్ధనొందుచు
వచన శాస్త్రము మననడతకు ధర్మసూత్రమందును ||1||

ఇష్టలింగము దేవుని గురుతనుచు నేను ధరింతును
సంగమము ధర్మక్షేత్రమని తెలిసివచ్చెదనని
శరణ వ్రతము ధరించి నేను జన్మదన్యమొందెదను
శరణ మేలమందుకూడి యాడిపాడి సంతసించెదను ||2||

షట్కోణ బసవ ధ్వజము గర్వముతో నారోహించెదను
ఇష్టలింగ దీక్షపొంది గణపదవి నొందెదను
భక్తి పక్షమొందుటకు బసవ మంటపము కట్టెదను
వారమునకొక్కసారి సామూహిక ప్రార్థననుగైకొందును ||3||

శ్రావణమాసమందు నేనువచనపఠనను గైకొందును
శరణభాష కన్నడమని గర్వముతో నుడివెదను
బసవాది శరణుల పరంపరనాది.
జాతివర్ణ వర్గాతీత సహోదరత మనది ||4||

మర్త్యలోకము కర్తుని కమ్మటమని యనుచు
దివ్య గణ లింగమును కూర్చుగురుతనెదను
జాతి సూత్రము విడిచి నేను నీతిసూత్రము పట్టితి
ధర్మసోదరత్వము చాటి శరణసమాజమును కట్టెదను ||5||

*
సూచిక (index)
Previous బసవ భక్తుల ప్రతిజ్ఞ పాఠశాల పిల్లల కొఱకు ప్రార్థనము Next