Previous విశ్వాత్ముని పూజ నిత్య నివేదనము Next

విశ్వాత్ముని లీలారూపము

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

సుడి తిరుగుచు ప్రవహించుచు కనబడునెల్లడను

ధ్వని దరువు : హృదయవీణె మీంటిదాగ; తాళము : ఝంప

సుడి తిరుగుచు ప్రవహించుచు కనబడునెల్లడను
కనబడదె బాల వాని సిరిలీల ||ప||

విరియుచున్న సుమమందు విరిసి నగుచుండునతడు
మొరయుచుండు జలమందు ఓంకారము స్పందించుచు ||అ.ప. ||

కోకిల కుహలందు ఉలియుచు చేతనుడు
మూగ తామరయందు వికసించు మోహనుడు
వీచు గాలియందు నిరాకార అజ్జనుంచి
వాంఛించు హృదయానికి ప్రేమ లీనముచేసి ||1||

మూడుచు రవియచట నగునగుచు వచ్చును
తాడించు నాకమునారోహించి తానువచ్చు
హృదయ నీణను మీటు చతుర వైణికుడు
సుధ సారము సారించు మకరంద ప్రియుడు ||2||

ఝంకరించు భ్రమరము తనివిలో వినదో ఓంకార
సంయమ గాలినడక యందు శ్రీకార శుభకార
హృదయ ఉదరముపై చూడాతని అజ్జ
కన్ను తెఱవ కనబడదో వేరేది యొప్పు ||3||

సుందరుడితడు, నావాడు నేనితని భార్య
అందాల సచ్చిదానందుని కొప్పిన నేనే కడుధన్యురాలు ! మంగళము ||4||

*
సూచిక (index)
Previous విశ్వాత్ముని పూజ నిత్య నివేదనము Next
cheap jordans|wholesale air max|wholesale jordans|wholesale jewelry|wholesale jerseys