Previous బసవజ్యో తి మంగళాంగ గురులింగా నందులు Next

గురుచరణాలకు నుడి నమనము

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

గురుచరణాలకు నుడి నమనము

శ్రీ గురువు శివచరణానికి నమోనమో అందును
గురుదేవుని మహాత్యాగానికి నతమస్తకరాలైతిని || ప ||

బసవన్న శ్రీ రక్ష వహించి మీరనగితిరి
నవజీవన బ్రతుకు విధానమీలోకానికి చూపితిరి
దేవుడొక్కడే మనుజకులానికను తత్త్వము చాటితిరి
మనుజులెల్లరొకటే యను భ్రాతృత్వమును చాటితిరి || 1 ||

జాతివాద శుష్కమార్గ మూడరూఢుల వీడితిరి
క్రాంతి శంఖము నూది మీరు జాగృతి నొందితిరి
ప్రవచన నిజసుధను జనుల మనసున నింపితిరి
భవగెలుపు శివమంత్రము నెదలో నూది నింపితిరి || 2 ||

బసవన్నని నిజతత్త్వము మరల విత్తి పండితిరి
ఎన్నెన్నో జీవులయందు స్ఫూర్తి నిప్పురవను వెలిగించితిరి
మిథ్యవీడి సత్యమొంది స్తుత్యపథమున నడచితిరి.
ఇట్టియడుగు వెనుతీయక క్రాంతి పురుషులైతిరి. || 3 ||

బాందవ్య యెడరు తొడరుల జయించి భవ్యమూర్తులైతిరి
కలిమి కీర్తి వార్తలను సమచిత్తముతో పొందితిరి.
మనకెంత పుణ్యముండెనో యిట్టిగురువు నొందుటకు
శివరక్ష యభయమొంది దివ్యపథమున నడువ || 4 ||

అడుగిడి నడిచితిరెల్ల దీపముల వెలిగించి వచ్చితిరి.
బసవభానుని క్రాంతి ఉషవలె ముందు నడచితిరి.
గురుదేవ లింగానంద నామమమర మాయెను
సత్తు చిత్తు ఆనందుని శుభరక్షలు మీకున్నవి. || 5 ||

*
సూచిక (index)
Previous బసవజ్యో తి మంగళాంగ గురులింగా నందులు Next