Previous లింగాయత నేనులింగాయత భారతీయులారా ..... ......మేలుకొండి Next

పాఠశాల పిల్లల కొఱకు ప్రార్థనము

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

దేవ దేవ దివ్యప్రభువే కాపాడుమమ్ము కరమువీడక

దేవ దేవ దివ్యప్రభువే కాపాడుమమ్ము కరమువీడక
నీదు కృపాకవచమందు మమ్ము రక్షించు ||ప||

దుష్టతనము నొసగక శిష్టగుణమునొసగు. లోక
మిష్టపడు భవ్యబ్రతుకు నొసగు తండ్రి ! ||అ.ప||

సుప్రభాతమందులేచి యర్తితో నినుతలచి
చిత్తశుద్ధిని పడయు బుద్ధిని కరుణించ
విద్యనేర్చి బుద్ధులయి హృద్యమైన నుడులనాడు
ముద్దు పిల్లలైవెలయు వరమునొసగయా ||1||

అడ్డువచ్చి యడరు చుండ జడత నుడుగులాడుచుండి
వెంటనే ధైర్యము వీడక పంతము మాకొడగూర్చుము
సత్యమును పలుకు నట్టి సత్యపథములో నడుచు నట్టి
శక్తి. బ్రతుకునట్టి దివ్యబ్రతుకును కరుణించు ||2||

జన్మమిచ్చినతండ్రి జ్ఞానమిచ్చు తల్లి పరమ గురువులు
అన్నమిచ్చు మాతృభూమిని చూచి వందించు !
వినయ భావమొసగి మమ్ము. మాననీయులుగా మార్చు
ఇటునటు నుండునట్టి నిలువు కరుణించు ||3||

నీటిలో పెరుగులత చిరునవ్వుతో పెరుగురీతి
నీదు కరుణ యున్న మేము నిరతము పెరిగెదము
అందరితో గూడి బ్రతికి చనవొందు సుభగప్రేమ
మొల్లెలవలె బ్రతుకునొసగు సచ్చిదానంద ||4||

*
సూచిక (index)
Previous లింగాయత నేనులింగాయత భారతీయులారా ..... ......మేలుకొండి Next