బసవ మంగళ హారతి (మంగళారతి)
|
|
*
- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి
ఓం గురు బసవప్రభు, వరగురు శరణవిభు
ఓం గురు బసవప్రభు, వరగురు శరణవిభు
ఆశ్రితజన సంరక్షక సద్గురు బసవప్రభు! వరగురు శరణవిభు ||ప.||
శరణలోలుడీవు పరమ పురుషుడీవు
శరణాసింధో నీవు ధీనుల బంధువీవు
శుభగ గాత్రుడీవు ప్రేమ నేత్రుడవీవు
పరమ చరితుడనీవు జ్ఞాన భరితుడవీవు || 1 ||
భవభయతారకుడా నవపథదాయకుడా
హరగణ తారల నడుమనుండు చంద్రుడా
మాతపితలీవె. బంధు బలగము నీవే
భక్తజన మనోవిరాజిత మంత్ర పురుషుడీవు || 2 ||
మోహరహితుడీవు మమతాసహితుడీవు
మాయా దూరకుడీవు ముక్తిదాయకుడీవు
మనుకుల జ్యోతియునీవు, క్రాంతివీరుడవీవు
శాంతిప్రవాహము ప్రవహింపవచ్చిన సచ్చిదానంద సుతుడీవె || 3 ||
*