Previous మంగళాంగ గురులింగా నందులు బసవ జెండా (ధ్వజ) గీతము Next

సంకల్పగీతము

*

- ✍ పూజ్య శ్రీ మహాజగద్గురు డా|| మాతె మహాదేవి.
తెలుగు అనువాదము: సి. కృష్ణశెట్టి , బూదిముట్లు - వేపనపల్లి

షట్కోణ బసవ ధ్వజారోహణమునకు ముందు పాడు గీతము

కర్త సృష్టిలోన పుట్టిన నేను
కర్తను నిష్ఠతో వందింతును ||ప||

బసవని స్మరించి లోకము లేసుకు
ప్రతిన చేసి పాటుపడిదెను ||అ.ప ||

భక్తిజలమందు జలకమాడెదను
జ్ఞాన వస్త్రమును ధరించెదను
దీన దలితుల సేవను చేయ
గంధముతో బ్రదుకును నిర్మించెదను ||1||

మానవులెల్లరు దేవునికూనలు
అనుచు ధ్వజమెత్తెదను.
గురుబసవన్న వచన సౌరభము
విస్తరింప కంకణము కట్టుకొందును ||2||

ధర్మకవచమును ధరించెదను
తత్త్వ ఖడ్గమును పట్టెదను
కర్త కమ్మటమైన యీజగమందు
కల్యాణ రాజ్యమును కట్టెదను ||3||

*
సూచిక (index)
Previous మంగళాంగ గురులింగా నందులు బసవ జెండా (ధ్వజ) గీతము Next